ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. వారం రోజుల్లోనే వంద కోట్లు సాధించిన ఈ చిత్రానికి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాకు సెన్సార్ ఆమోదం తెలపలేదంటూ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ)లో ఒక సభ్యుడు కాబట్టే సినిమాను ఎలాంటి కట్స్ లేకుండా యధాతథంగా రిలీజ్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. తాజాగా దీనిపై వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. 'దయచేసి ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేయడాన్ని ఆపేయండి. కాస్త విరామం తీసుకోండి. కనీసం చనిపోయిన వారికైనా గౌరవమివ్వండి' అని ట్వీట్ చేశాడు.
ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మార్చి 11న విడుదలైంది. 1980-90లలో కశ్మీర్‌లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మించాడు. బాలీవుడ్ నటీనటులు అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు.
Please stop spreading fake news, like always. Take a little break. At least to respect the dead. https://t.co/hZflsTUbOk pic.twitter.com/yvOKhGieDX
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 20, 2022
చదవండి: ఆల్‌టైం బ్లాక్‌బస్టర్: వంద కోట్ల క్లబ్బులో 'కశ్మీర్ ఫైల్స్'
Comments
Please login to add a commentAdd a comment