The Kashmir Files Director Vivek Agnihotri Gets Y Category Security - Sakshi
Sakshi News home page

The Kashmir Files: డైరెక్టర్‌కు 'వై' కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం

Published Fri, Mar 18 2022 6:07 PM | Last Updated on Fri, Mar 18 2022 6:25 PM

The Kashmir Files Director Vivek Agnihotri Gets Y Security - Sakshi

కశ్మీరీ పండిట్లపై జరిగిన ఊచకోత ఆధారంగా తెరకెక్కిన చిత్రం ది కశ్మీర్‌ ఫైల్స్‌. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా మార్చి 11న రిలీజైన ఈ సినిమా పాజిటివ్‌ బజ్‌తో దూసుకుపోతోంది. కేవలం మౌత్‌టాక్‌తోనే జనాలను థియేటర్లకు రప్పిస్తూ ఇప్పటివరకు మొత్తంగా రూ.97 కోట్లు రాబట్టింది. ఈరోజు వచ్చే కలెక్షన్లతో కశ్మీర్‌ ఫైల్స్‌ వందకోట్లు రాబట్టిన సినిమాల జాబితాలో చేరిపోవడం ఖాయం.

ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే అతడికి ఏదైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉండటంతో కేంద్రం వివేక్‌ అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రతను కేటాయించింది. ఆయన ఎక్కడకు వెళ్లినా సీఆర్పీఎఫ్‌ బలగాలతో భద్రత కల్పిస్తారు. కాగా ఈ సినిమాకు పలు రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయించిన విషయం తెలిసిందే!

చదవండి: The Kashmir Files: ఓటీటీలోకి ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement