Y category security
-
ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ‘వై’ కేటగిరి భద్రత.. 8 మంది కమాండోలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రత కల్పించింది. దీంతో ఇక నుంచి అర్వింద్ కాన్వాయ్‌లో ముగ్గురు, ఇంటి వద్ద ఐదుగురు సీఆర్పీఎఫ్ కమాండోలు భద్రతా వలయంగా ఉండనున్నారు. మొత్తం 8 మంది కమాండోలు ఎంపీకి నిరంతరం రక్షణగా ఉండనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వరుసగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఇటీవల బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ కేటగిరి భద్రత కల్పించింది. తర్వాత కేంద్రం తాజాగా ఎంపీ అర్వింద్‌కు భద్రత కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ పర్యటన వివరాలన్నీ కేంద్రానికి, రాష్ట్ర డీజీపీకి.. ఎంపీ అర్వింద్‌కు ‘వై’ కేటగిరి భద్రత నేపథ్యంలో ఆయన దేశంలో ఎక్కడ పర్యటించి నా అందుకు సంబంధించిన ప్రతి అంశాన్ని కేంద్ర హోంశాఖ కు పంపాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రాష్ట్ర డీ జీపీకి పర్యటన వివరాలు అందుతాయి. దీంతో ఎంపీ పర్యటన సందర్భంగా భద్రత కల్పించే వ్యవహారాలను డీజీపీ నేరుగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎంపీ పర్యటన నేపథ్యంలో చిన్న ఘటన చోటుచేసుకున్నా సంబంధిత జిల్లా, క్షేత్రస్థాయి అధికారులపై డీజీపీ చర్య లు తీసుకోవాల్సి ఉంటుంది. వై కేటగిరి భద్రత ఎంపీ అర్వింద్ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గ పరిధిలో పర్యటించిన సందర్భంగా వరుసగా మూడు సార్లు బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరుపార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు, పోలీసు సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యా రు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇతర అంశాలపై బీజేపీ ఆందోళనలు చేస్తే, ప్రతిగా టీఆర్ఎస్ శ్రేణులు పసు పు బోర్డు విషయంలో ఆందోళనలు చేస్తూ ఎంపీ అర్వింద్‌ను అడ్డుకుంటూ వచ్చాయి. గతేడాది ఎంపీ అర్వింద్ పలుచోట్ల పర్యటనలు, ప్రారంభోత్సవా లు చేసేందుకు, మరికొన్ని చోట్ల ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాలు ఆవిష్కరించేందుకు వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వరుసగా ఇందల్వాయి మండలం గన్నారం, ధర్పల్లి మండల కేంద్రంలో, భీమ్‌గల్ మండలం బాబాపూర్‌లో ఉపాధ్యాయురాలు మరణించిన సందర్భంలో, ఆర్మూర్ మండ లం ఇస్సాపల్లి ప్రాంతంలో ఎంపీ అర్వింద్ పర్యటన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీ లకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి పర్యటన నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఎంపీ కారు అద్దాలు సైతం బీఆర్ఎస్ శ్రేణు లు పగులగొట్టాయి. ఈ విషయంలో పోలీసులు టీఆర్ఎస్కు సహకరించి తన భద్రతను గాలికొదిలేశారని అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌పై పార్ల మెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఎంపీ ఫిర్యాదు చేశారు. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. అధికారికంగా హోంశాఖ నుంచి భద్రత కల్పించే విషయంలో ఆలస్యమయ్యే నేపథ్యంలో అమిత్‌షా కార్యాలయం సూచనల మేరకు ఎంపీ వీఆర్ఎస్ తీసుకున్న బ్లాక్‌క్యాట్ కమెండో, బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు నలుగురు మార్షల్స్‌ను తన భద్రత కోసం నియమించుకున్నారు. అలాగే ఒక కిలోమీటర్ రేడియస్‌లో పనిచేసే విధంగా 5 వాకీటాకీలు, మూడు ప్రత్యేక వాహనాలు, అడ్వాన్స్డ్ వెపన్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఎన్నికలు రానున్న నేపథ్యంలో ‘వై’ కేటగిరి భద్రత కల్పించడం గమనార్హం. ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వాళ్లు దాడులకు దిగితే తూటాలు దిగడం ఖాయమని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. -
‘హిజాబ్ తీర్పు’ జడ్జిలకు బెదిరింపులు.. వై కేటగిరీ భద్రత
హిజాబ్ తీర్పు వెల్లడించిన ధర్మాసనంలోకి ముగ్గురు న్యాయమూర్తులకు వై కేటగిరీ భద్రత కల్పిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం ప్రకటించారు. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థితో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులు.. హిజాబ్ ముస్లిం మతాచారం కాదంటూ ఈ మధ్యే సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటు తీర్పు హిజాబ్ తీర్పు వెలువరించిన న్యాయమూర్తులను బెదిరించిన ఓ వ్యక్తి వీడియో వైరల్ అయ్యింది. శుక్రవారం తిరుచురాపల్లికి చెందిన Tamil Nadu Thowheed Jamath (TNTJ) నేత ఉస్మానీ ఓ ర్యాలీలో పాల్గొని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియోపై తంజావూర్(తమిళనాడు) పోలీసులు కేసు నమోదు చేయడం.. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వం.. హైకోర్టు జడ్జిలకు రాష్ట్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రతను కల్పించింది. ఈ బెదిరింపు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తులో స్వయంగా పాల్గొనాల్సిందిగా కర్ణాటక డీజీపీని సీఎం బొమ్మై స్వయంగా ఆదేశించారు. తమిళనాడు పోలీసులతో కలిసి విచారణను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలంతా కుహనా లౌకికవాదులని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జిలను బెదిరించిన ఘటనపై ఇంత వరకు ఎవ్వరూ ఖండించలేదని విమర్శించారు. ‘‘జడ్జిలను బెదిరించిన ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా.. ఈ కుహనా లౌకికవాదులు ఎందుకు మాట్లాడడం లేదు? ఓ వర్గం వారిని మెప్పించేందుకే నోరు మూసుకున్నారా? అది నిజమైన లౌకికవాదం కాదు. అదే అసలైన మతతత్వం’’ అని మండిపడ్డారు. జార్ఖండ్‌లో వాకింగ్‌కు వెళ్లిన ఓ జడ్జి దారుణ హత్యకు గురైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఓ వ్యక్తి తీసిన బెదిరింపు వీడియో వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం కర్ణాటక హైకోర్టు అడ్వొకేట్ ఉమాపతితో పాటు మరికొందరు అడ్వొకేట్లు.. హైకోర్టు రిజిస్టర్ జనరల్‌కు సదరు వీడియోపై ఫిర్యాదు చేశారు. భగవద్గీత సిలబస్‌లో.. నైతిక విద్యలో భాగంగా కర్ణాటక స్కూల్ సిలబస్‌లో భగవద్గీతను చేర్చబోతున్నట్లు సీఎం బొమ్మై, శనివారం వెల్లడించారు. ఇదివరకే గుజరాత్ స్కూల్ సిలబస్‌లో భగవద్గీతను చేర్చాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆ స్టూడెంట్స్‌కు షాక్ హిజాబ్ నిరసనల్లో భాగంగా పరీక్షలను బహిష్కరించిన విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చేదే లేదని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి వెల్లడించారు. తీర్పు ముందు బహిష్కరించిన వాళ్లకే అవకాశం అని, తీర్పు వచ్చాక కొందరు పరీక్షలను బహిష్కరించారని, వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ నిర్వహించబోయే పరీక్షలకు అనుమతించబోమని మంత్రి స్పష్టం చేశారు. -
ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్‌కు 'వై' కేటగిరీ భద్రత
కశ్మీరీ పండిట్లపై జరిగిన ఊచకోత ఆధారంగా తెరకెక్కిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా మార్చి 11న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ బజ్‌తో దూసుకుపోతోంది. కేవలం మౌత్‌టాక్‌తోనే జనాలను థియేటర్లకు రప్పిస్తూ ఇప్పటివరకు మొత్తంగా రూ.97 కోట్లు రాబట్టింది. ఈరోజు వచ్చే కలెక్షన్లతో కశ్మీర్ ఫైల్స్ వందకోట్లు రాబట్టిన సినిమాల జాబితాలో చేరిపోవడం ఖాయం. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే అతడికి ఏదైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉండటంతో కేంద్రం వివేక్ అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రతను కేటాయించింది. ఆయన ఎక్కడకు వెళ్లినా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తారు. కాగా ఈ సినిమాకు పలు రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయించిన విషయం తెలిసిందే! చదవండి: The Kashmir Files: ఓటీటీలోకి ‘ది కశ్మీర్ ఫైల్స్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? -
ఎన్నికల వేళ కేంద్ర హెం శాఖ కీలక నిర్ణయం.. ఆయనకు ‘వై’ కేటగిరి భద్రత
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ నాయకుల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మాజీ నేత కుమార్ విశ్వాస్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్.. పంజాబ్ ముఖ్యమంత్రి లేదంటే ఖలిస్తాన్ ప్రధాని కావాలని అనుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. తాను వేర్పాటు వాదినే అయితే అరెస్ట్ చేయలేదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇలా నేతల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కుమార్ విశ్వాస్‌కు వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టు హోం శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే కుమార్ విశ్వాస్‌కు ముప్పు పొంచి ఉందనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రత కల్పించినట్టు హోం శాఖ తెలిపింది. ‘వై’ కేటగిరీ భద్రత ఇదే.. వై కేటగిరి భద్రతలో మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. వీరిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ కమాండోలు విధులు నిర్వర్తిస్తారు. అయితే, వీరిలో కొంత మంది కుమార్ విశ్వాస్ నివాసం వద్ద భద్రతలో ఉంటారు. మిగిలిన వారు కుమార్ విశ్వాస్ ఎటు వెళ్లినా ఆయనతో పాటే వెళ్తారు. -
వై ప్లస్ సెక్యూర్టీ!
‘‘ప్రస్తుతం ముంబై పరిస్థితి కాశ్మీర్‌ను తలపిస్తోంది’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆయితే ఆ కామెంట్లు పలువురు మహరాష్ట్ర నేతలకు రుచించలేదు. కంగనాను ముంబైలో అడుగుపెట్టనివ్వం అన్ని సవాళ్లు విసిరారు. లాక్డౌన్లో వచ్చిన బ్రేక్ కారణంగా తన సొంతూరు భంభ్లాలో ఉంటున్నారు కంగనా. హిమాచల్ ప్రదేశ్‌లోని చిన్న పట్టణం ఇది. ‘‘సెప్టెంబర్ 9న ముంబై వస్తున్నా’’ అని ప్రకటించారు కంగనా. ఆమెకు భద్రత కల్పించాల్సిందిగా కంగనా సోదరి రంగోలి, ఆమె తండ్రి ప్రభుత్వాన్ని కోరారట. దాంతో ఆమె హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నప్పుడే కాదు.. ముంబైలోనూ సెక్యూర్టీ కల్పిస్తామని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రికమండ్ చేసిన మేరకే కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ సెక్యూర్టీ అందించడానికి సిద్ధమవుతోందని సమాచారం. 9న ముంబై చేరుకున్నప్పటి నుంచి కంగనాకి కేంద్ర ప్రభుత్వం ఈ భద్రత కల్పించనుందట. -
‘ఉన్నావ్’ నిందితుడికి సెక్యురిటీ కట్
లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ లైంగిక దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగర్‌కు సంబందించి యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేనేళ్ల బాలికను అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడుగా ఉన్న కుల్దీప్సింగ్కు కేటాయించిన ‘వై’ కేటగిరి భద్రతను తొలగిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. ఎమ్మెల్యేకు భద్రత కల్పిస్తున్న 11 మంది కమాండోలను ఉపసంహరించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యేను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కుల్దీప్ పై కిడ్నాపింగ్, చిన్నారులపై లైంగిక వేధింపుల చట్టం (పోస్కో), ఐపీసీ 164 సెక్షన్ కింద మూడు కేసులను సీబీఐ నమోదు చేసింది. నిందితుడిపై అత్యాచార ఆరోపణలు వచ్చానా, ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆలాహాబాద్ హైకోర్టు ఆదేశం మేరకు యూపీ పోలీసులు కుల్దీప్ సింగ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసు సీబీఐ విచారణలో ఉంది. -
ఆర్నాబ్ కే అంత భద్రత ఎందుకు?
న్యూఢిల్లీ: టైమ్స్ నౌ న్యూస్ ఛానెల్ చీఫ్ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామికి ఏకంగా 22 మంది భద్రతా సిబ్బందితో ‘వై’ కేటగిరీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఎందుకు కల్పించాల్సి వచ్చిందో జర్నలిస్టు పెద్దలందరూ ‘న్యూస్ అవర్’ కార్యక్రమంలో కూర్చొని చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేసినందుకు ఆయన ప్రాణాలకు ముప్పున్న కారణంగానే ఈ రక్షణ కల్పించాల్సిన అసరం వచ్చిందని కేంద్ర హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచే భద్రతా సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్నందున ఆర్నాబ్ గోస్వామికి ఎందుకు? వై ? భద్రతను ఏర్పాటు చేయాల్సి వచ్చిందో ఒక్క జర్నలిస్టులకే కాకుండా మొత్తం ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకు చర్చించి, సమాధానాలు రాబట్టాల్సిన అంశాలు ఏమిటంటే..... 1. ఆర్నాబ్ గోస్వామి ప్రాణాలకు ముప్పుందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు ఎలా తెలిసింది? ఉగ్రవాద సంస్థల నుంచి వచ్చిన సందేశాలనుగానీ, సమాచారాన్నిగానీ వారు మధ్యలో ట్రేస్ చేశారా? 2. ఆర్నాబ్ గోస్వామి వ్యాఖ్యలకు ఏ ఉగ్రవాద సంస్థ నొచ్చుకుంది? ఏ ఉగ్రవాద సంస్థ నుంచి ఆయన ప్రాణాలకు ముప్పుంది? 3. ‘వై’ కేటగిరీ భద్రతనే ఆయనకు ఎందుకు కల్పించాలనుకున్నారు? జెడ్ లేదా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఎందుకు కల్పించడం లేదు? 4. తమకు వ్యతిరేకంగా ఆర్నాబ్ చేసిన ఏ వ్యాఖ్యలు తీవ్రమైనవిగా ఉగ్రవాద సంస్థలు భావించాయి? ఇవి తెలుసుకుంటే ఎలాంటి వ్యాఖ్యలు తక్కువ తీవ్రతగలవో జర్నలిస్టులు అర్థం చేసుకునేందుకు వీలవుతుంది. 5. టైమ్స్ నౌ ఛానెల్లో ఒక్క ఆర్నాబ్ గోస్వామి ప్రాణాలకు మాత్రమే ముప్పుందా? ఆయన సిబ్బంది ప్రాణాలకు ముప్పు లేదా? ఆయన్ని చంపేందుకు వచ్చే ఉగ్రవాదులు దాడి సందర్భంగా సిబ్బందికి ఎలాంటి హాని తలపెట్టరా? 6. టైమ్స్ నౌ ఛానెల్లో చర్చల కోసం వచ్చే అతిథులకు ఎలాంటి ముప్పులేదా? వారంతా క్షేమంగానే ఉంటారా? 7. ఆర్నాబ్ గోస్వామికి రక్షణ కల్పించడం కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఎంత ఖర్చు పెడుతున్నారు? 8. ముకేశ్ అంబానీకి జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నందుకు ఆయన నుంచి15 లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారు. మరీ ఆర్నాబ్ గోస్వామి నుంచి గానీ, ఆయనకు ఉద్యోగం ఇచ్చిన బెన్నెట్, కోల్మెన్ అండ్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఎన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు? 9. ‘వై’ కేటగిరీ భద్రతా సిబ్బందికి సరైన శిక్షణ ఉందో, లేదో పరీక్షించారా? వారి ధరించే బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు నాణ్యమైనవేనా? దేశంలో జర్నలిస్టులకు కూడా వీఐపీల్లాగా భద్రతను కల్పించడంలో ఆర్నాబ్ గోస్వామి మొదటి వ్యక్తి కాదు. బీజేపీ ఎంపీ, పంజాబ్ కేసరి పత్రిక యజమాని అశ్విణి కుమార్ చోప్రాకు దేశంలోనే అత్యంత ఉన్నతమైన ‘జెడ్ ప్లస్’ కేటగిరీ భద్రతను కల్పించారు. ఆర్నాబ్ స్వామికన్నా చోప్రా భద్రతకు 16 మంది సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. పంజాబ్‌లో ఖలిస్థాన్ ఉద్యమం తీవ్రంగా ఉన్న రోజుల్లో ఆయన తాత లాలా జగత్ నారాయణన్ 1981లో, ఆయన తండ్రి రమేశ్ చందర్ 1984లో హత్యకు గురయ్యారు. మరి అలాంటి ముప్పు ఇప్పుడు చోప్రాకు లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగిస్తున్నారు. ఒక్క ఉగ్రవాదుల నుంచి ముప్పుందన్న కారణంగానే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా జర్నలిస్టులకు భద్రతను కల్పిస్తున్నారు. దౌర్జన్యంగా డబ్బు దండుకున్నారన్న కేసులో మాజీ కాంగ్రెస్ ఎంపీ, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ నుంచి ముప్పుందన్న కారణంగా జీ న్యూస్ ఎడిటర్ సుధీర్ చౌదరికి ‘ఎక్స్’ కేటగిరీ కింద నలుగురు సెక్యూరిటీ గార్డులతో భద్రతను ఏర్పాటు చేశారు. ఒక్క జర్నలిస్టులకే కాకుండా ఏ పౌరుడి ప్రాణాలకు ముప్పున్నా దేశ రాజ్యాంగం ప్రకారం ఆ పౌరుడికి భద్రతను కల్పించాల్సిన బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానిది. అలాంటప్పుడు కేంద్రం నేరుగా జోక్యం చేసుకొని ఎందుకు భద్రతను కల్పిస్తుందో కూడా సమాధానం రాబట్టాలి. 2010 సంవత్సరం నుంచి దేశంలో 22 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. వారంతా తమ ప్రాణాలకు ముప్పుందంటూ ఎంత మొత్తుకున్నా ఏ రాష్ట్ర ప్రభుత్వంగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ పట్టించుకోలేదు. జగేంద్ర సింగ్ అనే జర్నలిస్ట్ గత జూన్ నెలలో తన ప్రాణాలకు ముప్పుందంటూ అధికారులకు మొరపెట్టుకున్నా, ఫేస్బుక్లో తనకున్న ప్రాణాపాయాన్ని తెలియజేసినా పట్టించుకోలేదు. ఫలితంగా గతేడాది జూన్ నెలలో జగేంద్ర సింగ్ హత్యకు గురయ్యారు. ప్రభుత్వం ఈ జర్నలిస్టులందరికి భద్రత కల్పించి ఉన్నట్టయితే వీరంతా నేడు బతికి ఉండేవారు కాదా? --------------- ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
నీతా అంబానీకి కూడా...
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మెన్ ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీకి కేంద్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరీ భద్రత కల్పించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ ( సీఆర్పీఎఫ్) కమాండోలు ఆమెకు రక్షణ కల్పిస్తారు. నీతా అంబానీకి ముప్పు పొంచివుందని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐఎం), కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారంతో ఆమెకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించారు. పదిమంది సీఆర్పీఎఫ్ సాయుధ కమాండోలతో ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేశారు. ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ నుంచి ప్రమాదం పొంచివుందన్న నిఘా వర్గాల సమాచారంతో ముఖేశ్ అంబానీకి మూడేళ్ల క్రితమే ప్రభుత్వం ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పించింది. ఇందుకోసం సీఆర్పీఎఫ్ కు ఆయన నెలకు రూ. 15 లక్షలు చెల్లిస్తున్నారు.