హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు, కానీ కొందరు పెద్ద హీరోలు మాత్రం ఇండస్ట్రీలో స్థిరంగా ఉండిపోతారు. ప్రతి చిత్రపరిశ్రమలో ఇది సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఏళ్ల తరబడి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే బడా హీరోలను అభిమానులు పవర్ స్టార్, కింగ్, బాద్‌షా అంటూ రకరకాలుగా పిలుచుకుంటారు. ఉదాహరణకు షారుక్ ఖాన్ వెండితెరపై అడుగుపెట్టి 30 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ బాలీవుడ్ కింగ్‌గా వెలుగొందుతున్నాడు. దీనిపై ఓ వెబ్‌సైట్ కథనం రాయగా దానిపై స్పందించాడు కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.
'బాలీవుడ్‌లో కింగ్‌లు, బాద్‌షాలు, సుల్తాన్‌లు ఉన్నంతకాలం అది మునిగిపోతూనే ఉంటుంది. ప్రజల కథలతో దీన్ని ప్రజల చలనచిత్రసీమగా మార్చండి. అప్పుడే బాలీవుడ్ ప్రపంచ సినీ ఇండస్ట్రీని ఏలుతుంది. ఇదే సత్యం' అని ట్వీట్ చేశాడు. దీనిపై అనేకమంది నెటిజన్లు మండిపడుతున్నారు. 'షారుక్, సల్మాన్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఎన్నో ఏళ్ల ఫలితంగా బాద్‌షా, సుల్తాన్, కింగ్‌లయ్యారు. వారిని జనాలు ప్రేమిస్తున్నారు. మధ్యలో మీకెందుకు అంత అక్కసు?', 'సల్మాన్, షారుక్‌లంటే మీకు ఈర్ష్య, అసూయ అని ఇట్టే అర్థమవుతుంది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిమంది మాత్రం నిజం చెప్పారు, ఇప్పటికీ వాళ్లనే ఇండస్ట్రీ కింగ్‌లని పిలవడమేంటో అర్థం కాదంటూ అతడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఐఎమ్‌డీబీ రిలీజ్ చేసిన 2022- టాప్ 10 ఇండియన్ చిత్రాల్లో కశ్మీర్ ఫైల్స్‌కు స్థానం లభించిన విషయం తెలిసిందే!
As long as Bollywood has Kings, Badshahs, Sultans, it will keep sinking. Make it people’s industry with people’s stories, it will lead the global film industry. #FACT https://t.co/msqfrb7gS3
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 14, 2022
చదవండి: ఆలోచింపజేసేలా నటుడి చివరి పోస్ట్.. నెట్టింట వైరల్
వారియర్ మొదటి రోజు ఎంత రాబట్టిందంటే?
Comments
Please login to add a commentAdd a comment