Vivek Agnihotri's 'The Vaccine War' to clash with Prabhas 'Salaar' - Sakshi
Sakshi News home page

సలార్‌తో వార్.. మళ్లీ ఆ సీన్ రిపీట్ అవుతుందా?

Published Wed, Aug 16 2023 8:04 AM | Last Updated on Wed, Aug 16 2023 9:11 AM

Vivek Agnihotri Movie The Vaccine War Will Be Released On Salaar  - Sakshi

ది కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రంలో దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక అదే ఉత్సాహంతో వివేక్ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'ది వ్యాక్సిన్ వార్'. కొవిడ్ టైంలో పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నానా పటేకర్‌, పల్లవీ జోషి, రైమాసేన్‌, అనుపమ్‌ ఖేర్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. క్లిష్ట సమయంలో అత్యంత వేగంగా టీకాలను అభివృద్ధి చేసిన మన శాస్త్రవేత్తల గొప్పదనం ఈ సినిమాలో చూపించనున్నారు.

(ఇది చదవండి: అర్జున్ బర్త్ డే.. అదిరిపోయిన గ్లింప్స్! )

అయితే ఈ చిత్రం విడుదల తేదీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అదే రోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ కూడా రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హాంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్‌తో పోటీపడి  బాక్సాఫీస్‌ బరిలో నిలుస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

అయితే తాజాగా వివేక్ ‍అగ్నిహోత్రి చేసిన ‍ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. డియర్ ఫ్రెండ్స్.. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తోన్న ది వ్యాక్సిన్ వార్‌ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. మీరంతా మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ది వ్యాక్సిన్ వార్ టీజర్‌ను రిలీజ్ చేశారు. అయితే అదే రోజు ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రం సలార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్‌ చర్చ మొదలైంది. ఎందుకంటే గతంలోనూ ది కశ్మీర్‌ ఫైల్స్‌ మూవీ.. ప్రభాస్ చిత్రం రాధేశ్యామ్ ఓకే రోజు రిలీజైన సంగతి తెలిసిందే.  

(ఇది చదవండి: రామ్ చరణ్- ఉప్సీల బిడ్డను చూశారా.. ఎంత క్యూట్‌గా ఉందో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement