ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ మరణం బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆయన బుధవారం (ఆగస్టు 2న) తెల్లవారుజామున ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కౌన్ బనేగా కరోడ్‌పతి షో, స్లమ్‌డాగ్ మిలియనీర్. మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి సినిమాలకు పని చేసిన ఆయన అర్ధాంతరంగా తనువు చాలించడంపై ది కశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సంచలన ట్వీట్ చేశాడు.
విజయం వరించిందంటే విలువలు పతనం
'బాలీవుడ్‌లో ఒంటరి చావులు.. హిందీ చిత్ర పరిశ్రమలో నువ్వు ఎంత పెద్ద విజయం సాధించినా చివరికి ఒంటరిగా జీవితం ముగించక తప్పదు. అంతా నీ చుట్టూ ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఏదీ నీతో రాదు. నీకు నువ్వు మాత్రమే మిగిలిపోతావు. ఇక్కడ ఒక్కసారి సక్సెస్ అయ్యారంటే పేరు, డబ్బు, ఫ్యాన్స్, సైకోఫాంట్స్, కవర్లు, రిబ్బన్లు, అమ్మాయిలు, ఎఫైర్లు.. ఇలా అన్నీ చాలా త్వరగా సమకూరిపోతాయి. అప్పుడు నీతి, నిజాయితీ అనే విలువలను లెక్క చేయాల్సిన పని లేదు. హత్య, టెర్రరిజం, అత్యాచారం, డ్రంక్ అండ్ డ్రైవింగ్.. ఇలా ఎందులో దొరికినా ఈజీగా తప్పించుకోవచ్చు.
నడుమంత్రపు సిరి పోవడంతో అసలైన కష్టాలు
మధ్యతరగతి నుంచి వచ్చిన నీకు అకస్మాత్తుగా వచ్చిన డబ్బుతో ఏం చేయాలో పాలుపోదు. వాళ్లూవీళ్లు చెప్పిందే వింటావు. భారీగా పెట్టుబడులు పెడతావు. కానీ ఈ పాడు లోకంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. నెమ్మదిగా కొత్త జెనరేషన్ వస్తుంది. నీ హవా తగ్గిపోతుంది. కానీ డబ్బు, ఫేమ్ కోసం నీ పాకులాట మాత్రం అలాగే ఉంటుంది. ఆ స్టేజీలో నువ్వు ఎంత చేసినా నీ అస్థిత్వాన్ని క్రమంగా కోల్పోతూ ఉంటావు. చివరకు చీకటి గుహలో ఒంటరివాడివైపోతావు. ఆ చీకటి ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని ఎవరితోనైనా చెప్పాలనుకుంటావు. కానీ నీ బాధ వినేంత తీరిక ఎవరికీ ఉండదు. నీకు నువ్వు మాత్రమే మిగిలిపోతావు.
సీలింగ్ ఫ్యానే గతి
కుటుంబాన్ని, స్నేహితులను, నైతిక విలువలను, దయ, జాలి వంటి గుణాలను, కృతజ్ఞతలను అన్నింటినీ పట్టించుకోవడం మానేసిన నీకు అవేవీ చివరికి దక్కవు. సంపద, పేరు ప్రఖ్యాతలు ఆవిరి కావడంతో నీకంటూ ఉన్న గుర్తింపు కూడా పోతుంది. కేవలం నీకు నువ్వు మాత్రమే మిగిలిపోతావు. మేకప్ లేకుండా, ఫ్యాన్స్ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేని నీకు చివరకు సీలింగ్ ఫ్యానే దిక్కవుతుంది. నీ ఒంటరితనానికి, దుర్భర జీవితానికి ముగింపు పలికేందుకు సాయం చేస్తుంది. కొందరిని అక్కడ ఉరేస్తే, మరికొందరు స్వయంగా ఉరేసుకుని ప్రాణాలు వదులుతుంటారు. ఇక్కడ జరిగేది ఇదే!' అని వివేక్ అగ్నిహోత్రి రాసుకొచ్చాడు.
LONELY DEATHS OF BOLLYWOOD:
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 2, 2023
It’s a world were however successful you become, in the end, you are only a loser.
In the end, everything is around you but nothing with you. For you. by you.
Everything comes fast… fame, glory, money, fans, sycophants… covers, ribbons, women,…
చదవండి: పబ్జీ లవర్ ప్రేమ గాథ.. ఇప్పుడేకంగా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్న పాక్ మహిళ
Comments
Please login to add a commentAdd a comment