సంక్రాంతి సంబరాల్లో అపశ్రుతి.. స్కూల్‌లో భోగి మంటలు అంటుకుని.. | Three Students Injured In The Bonfire In Konaseema District | Sakshi
Sakshi News home page

సంక్రాంతి సంబరాల్లో అపశ్రుతి.. స్కూల్‌లో భోగి మంటలు అంటుకుని..

Published Wed, Jan 11 2023 8:06 PM | Last Updated on Wed, Jan 11 2023 9:20 PM

Three Students Injured In The Bonfire In Konaseema District - Sakshi

సాక్షి, కోనసీమ జిల్లా: ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలోని ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో సంక్రాంతి సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. స్కూల్‌ సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గొల్లవిల్లిలోని ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో భోగి మంటలు వేశారు.

ఆ మంటలు అంటుకుని ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. అమలాపురంలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన విద్యార్థులను మంత్రి విశ్వరూప్‌, ఎంపీ అనురాధ, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
చదవండి: నాపై భర్త, అతడి ప్రియురాలి హత్యాయత్నం.. ఆత్మహత్య చేసుకుంటా.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement