Bonfire
-
ట్రైన్లో పిడకలతో చలి మంట.. తర్వాత ఏం జరిగిందంటే..
కదులుతున్న రైలులో కొందరు వ్యక్తులు చలి మంట వేశారు. ఆ మంట వద్ద ప్రయాణికులు చలి కాచుకున్నారు. అయితే రైలు నుంచి మంటలు, పొగలు రావడాన్ని గమనించిన గేట్‌మ్యాన్ వెంటనే రైల్వే అధికారులను అలెర్ట్ చేశాడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరిని ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 3న అస్సాం నుంచి ఢిల్లీ వెళ్తున్న సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగిలో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు రాత్రి వేళ చలిని తట్టుకోలేక మంటను రాజేశారు. బోగిలోని ప్రయాణికులు ఆ మంట వద్ద చలి కాచుకున్నారు. రైలు బర్హాన్ స్టేషన్ సమీపంలో రైల్వే క్రాసింగ్‌లో గేట్‌మ్యాన్ రైలు కోచ్ నుండి మంట, పొగ వెలువడటం గమనించాడు. వెంటనే బర్హాన్ రైల్వే స్టేషన్‌లోని తన ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. అనంతరం ఆర్పీఎఫ్ పోలీసులు తదుపరి స్టేషన్ చమ్రౌలాలో రైలును ఆపి తనిఖీలు చేశారు. జనరల్ బోగిలో కొంతమంది వ్యక్తులుపిడకలతో చలి మంట వేసినట్లు గుర్తించారు. మంటలు భోగి మొత్తం వ్యాపించకముందే వాటిని ఆర్పివేశారు. రైలు అలీఘర్ జంక్షన్ చేరిన తరువాత జనరల్ బోగిలోని 16 మంది ప్రయాణికులను ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే రైలులో చలి మంట వేసింది తామేనని ఫరీదాబాద్‌కు చెందిన చందన్(23), దేవేంద్ర(25) ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మిగతా 14 మంది ప్రయాణికులను హెచ్చరించి వదిలేశారు. చదవండి: టికెట్లకు రూ.4లక్షలు.. ఎయిర్ ఇండియా సర్వీసుకు షాకైన కుటుంబం -
Happy Holi 2023: రంగుల పండుగ హోలీ విశిష్టత ఇదే.. ఎప్పుడు జరుపుకోవాలంటే..?
మంగళవారం(07-03-2023)రంగుల కేళి హోలీ సంబురాలు జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. నేటి ఉదయం నుంచే దేశవ్యాప్తంగా ప్రజలు హోలీని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైన భారత్‌లో ప్రతి ఏటా అనేక పండుగలను జరుపుకొంటారు. అయితే రంగుల పండుగ హోలీకి వీటిలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అందర్నీ కలిపే పండుగగా చెప్పుకునే హోలీని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకొంటారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ హోలీ పండుగ విశిష్టత ఏంటి? ఎన్నిరోజులు జరుపుకొంటారు? హోలికా దహనం ఎందుకు చేస్తారు? ఈ ఏడాది ఏ మూహుర్తంలో పూజలు చేసుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, రాధా కృష్ణల ప్రేమకు గుర్తుగా హోలీ జరుపుకొంటారు. ఈ పండుగను రెండు రోజులు చేసుకుంటారు. మొదటి రోజు చోటీ హోలి. అంటే హోలికా దహనం. రెండో రోజు రంగుల హోలి. అంటే ఒకరిపైఒకరు రంగులు జల్లుకొని పండుగ చేసుకోవడం. ఈ ఏడాది చోటి హోలి (హోలికా దహన్) మార్చి 7న, బడీ హోలి(రంగుల హోలి)మార్చి 8న జరపుకోవాలని ప్రముఖ పంచాంగం వెబ్సైట్ డ్రిక్ పంచాగ్ తెలిపింది. హోలికా దహనం ఏ సమయంలో.. హోలికా దహనాన్ని మార్చి 7న(మంగళవారం) సాయంత్రం 6:24 గంటల నుంచి రాత్రి 8:51 గంటల మధ్యే జరుపుకోవాలి. అయితే పౌర్ణమి తిథి మార్చి 6(సోమవారం) సాయంత్రం 4:17కు ప్రారంభమై, మార్చి 7( మంగళవారం) సాయంత్రం 6:09 గంటలకు ముగుస్తుంది. హోలికా దహనం సందర్భంగా భక్తులు పూజలు నిర్వహించి భోగి మంటలు వెలిగిస్తారు. తెలుగురాష్ట్రాల ప్రజలు ఈ పూజను సాయంత్రం 6:24 నుంచి రాత్రి 08:49 మధ్య జరుపుకోవాలని పండితులు చెప్పారు. ఎందుకీ పండుగ? హిందూ పురాణాల ప్రకారం హోలికా దహనం ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. రాక్షసుల రాజైన హిరణ్యకశ్యపుడు.. తన సొంత కుమారుడు ప్రహ్లాదుడుని చంపేందుకు శత విధాలా ప్రయత్నిస్తాడు. ఎందుకుంటే అతడు విష్ణువును ఆరాధించడం హిరణ్యకశ్యపుడికి అసలు నచ్చదు. దీంతో ఎన్నోసార్లు ప్రాహ్లాదుడ్ని చంపే ప్రయత్నం చేసి విఫలమవుతాడు. విష్ణువు అతడ్ని కాపాడుతుంటాడు. అయితే ప్రహ్లాదుడ్ని చంపేందుకు హిరణ్యకశ్యపుడి సోదరి హోలికా సాయం చేయాలనుకుంటుంది. ఇద్దరూ కలిసి పథకం పన్నుతారు. దీని ప్రకారం హోలికా మంటల్లో కూర్చుంటే.. ప్రహ్లాదుడ్ని ఆమె ఒడిలో కూర్చోమని హిరణ్యకశ్యపుడు ఆదేశిస్తాడు. తండ్రిమాట ప్రకారం ప్రహ్లాదుడు వెళ్లి మంటల్లోనే హోలికా ఒడిలో కూర్చుంటాడు. కాపాడమని విష్ణువును ప్రార్థిస్తాడు. దీంతో విష్ణువే ప్రహ్లాదుడ్ని మంటల్లో కాలిపోకుండా చేస్తాడు. హోలికా మాత్రం అదే మంటల్లో కాలిబూడిదవుతుంది. దీంతో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు హోలికా దహనం చేసి, ఆ మరునాడు హోలి పండుగను ఘనంగా జరుపుకొంటారు. అలాగే ఈ పండుగను శ్రీకృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మథుర, బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు. కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని నల్లని శరీర రంగు , రాధ శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధ ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుటుందని, అందుకే ఈ రోజును రంగుల పండుగగా జరుపుకుంటారని ప్రజలు విశ్వసిస్తారు. -
ప్రాణం తీసిన చలిమంట.. సోషల్ మీడియాలో పోస్ట్‌తో..
సాక్షి, నెల్లూరు(వెంకటాచలం): చలి కాచుకునేందుకు వేసిన మంట ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మంటలు అంటుకుని ఇద్దరు చిన్నపిల్లలు, కాపాడేందుకు వెళ్లిన తల్లి గాయపడ్డారు. రెండేళ్ల వయసున్న చిన్నకుమార్తె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ విషయం బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బయట పడింది. అయితే పోలీసులు గోప్యంగా ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని కంటేపల్లి గ్రామానికి చెందిన మానికల రవికృష్ణ పెయింట్ పని చేస్తుంటాడు. అతడికి భార్య నాగభూషణమ్మ, కుమార్తెలు లహరిశ్రీ, శ్రీవర్ష (2) ఉన్నారు. ఈనెల 16వ తేదీన తెల్లవారుజామున నాగభూషణమ్మ థిన్నర్ వాడి ఇంటి ముందు చలిమంట వేసింది. కుమార్తెలు చలి కాచుకుంటుండగా ఆమె సమీపంలో ముగ్గు వేస్తోంది. రవికృష్ణ కూడా అక్కడ ఉన్నాడు. కాగా మంట ఆరిపోతుండడంతో లహరిశ్రీ థిన్నర్ పోసింది. దీంతో ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున చెలరేగి లహరిశ్రీ, శ్రీవర్ష శరీరానికి అంటుకున్నాయి. తల్లి చూసి వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. రవికృష్ణ, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 సిబ్బంది ముగ్గురిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన పిల్లలను మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీవర్ష మంగళవారం సాయంత్రం మృతిచెందింది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే కొందరు వ్యక్తులు బాధిత గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా వైరలైంది. కాగా ఇది పెద్ద విషయం కాదన్నట్లుగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పత్రికలు, మీడియాకు తెలియజేసి ఉంటే బాధితులకు సాయం అందేదని చెబుతున్నారు. చలి కాచుకునేందుకు వేసిన మంట చిన్నారిని బలి తీసుకోవడం, మరో బాలిక, తల్లి గాయాలపాలవడంతో కంటేపల్లి గిరిజన కాలనీలో విషాదం నెలకొంది. -
సంక్రాంతి సంబరాల్లో అపశ్రుతి.. స్కూల్లో భోగి మంటలు అంటుకుని..
సాక్షి, కోనసీమ జిల్లా: ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో సంక్రాంతి సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గొల్లవిల్లిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో భోగి మంటలు వేశారు. ఆ మంటలు అంటుకుని ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన విద్యార్థులను మంత్రి విశ్వరూప్, ఎంపీ అనురాధ, కలెక్టర్ హిమాన్షు శుక్లా పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. చదవండి: నాపై భర్త, అతడి ప్రియురాలి హత్యాయత్నం.. ఆత్మహత్య చేసుకుంటా.. -
చెన్నైకి ఫ్లైట్‌లో వెళుతున్నారా...అయితే
సాక్షి, చెన్నై: దేశప్రజలంతా సంక్రాంతి ఉత్సాహంతో ఉరకలేస్తోంటే.. చెన్నై విమానాలు మాత్రం గాల్లోకి ఎగరలేక తెల్లబోవడంతోవిమాన ప్రయాణీకులు మాత్రం ఉసూరుమంటున్నారు. దట్టమైన పొగ కారణంగా దాదాపు 10 విమానాలు టేక్‌ఆఫ్‌లు, లాండింగ్‌లు నిలిచిపోయాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. చెన్నైనుంచి బయలు దేరాల్సిన కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 18 విమానాలను హైదరాబాద్, బెంగళూరు వైపు మళ్లించారు. చెన్నై నగరంలో ‘భోగి’ మంటల వల్ల వ్యాపించిన దట్టమైన పొగతో ఎయిర్‌క్వాలిటీ, రన్‌వే విజిబిలిటీ దారుణంగా పడిపోవడంతో ప్రయాణీకుల ఆందోళన నెలకొంది. విమానాశ్రయ సీనియర్ అధికారి మాట్లాడుతూ రన్‌వే దృశ్యమానత 50 మీటర్లకు పడిపోయిందనిచెప్పారు. ఉదయం మూడున్నరనుంచి తమకు విమాన కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరికొన్ని గంటల్లో పరిస్థితి చక్కబడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు తనకు ముంబైలో చాలా ముఖ్యమైన బిజినెస్ మీట్ వుందంటూ భరత్ జైన్ వాపోయారు. చెన్నైకు భోగి మంటలు ఒక ఛాలెంజ్‌గా నిలుస్తున్నాయని మరో సీనియర్ అధికారి తెలిపారు. గతపదేళ్లుగా ఈ విషయంలో కాలుష్య నియంత్రణ బోర్డు తమిళనాడులో అవగాహన పెంచుతోందన్నారు. ఇది ఇలా ఉంటే.. చెన్నై, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భోగి సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తెల్లవారుఝామునుంచే సందడి మొదలైంది. పాత బట్టలు, వస్తువులను తగలబెట్టడం శుభాన్నిస్తుందని , అంతేకాదు భోగిమంటలు గాలిని శుభ్రం చేస్తాయని స్థానికుడు కరుప్పన్ సంతోషంగా చెప్పారు. తమిళ సంస్కృతిలో 'భోగీ' ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఈపొగ గాలిని కలుషితం చేస్తుందని తెలుసు.. అందుకే తాము ప్లాస్టిక్స్ , టైర్లను నివారిస్తామని చెన్నైవాసి శరవణన్ వివరించారు. -
ఉమ్మడిగా.. ఉత్సాహంగా
సకుటుంబ సపరివారంగా భోగి ఉత్సవాలు పల్లె వాతావరణంలో వెలిగిపోయిన మురళీనగర్ హాజరైన ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దంపతులు మురళీనగర్ వైశాఖి స్పోర్ట్సు పార్కులో భోగి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాలనీలోని వారంతా కలిసి ఉమ్మడిగా పండగను జరుపుకున్నారు. కాలనీ వాసులంతా కదలి వచ్చి వయోభేదం లేకుండా పిల్లా పాపలతో ఉత్సవాల్లో పాల్గొన్నారు. వందలాది కుటుంబాలు తరలిరావడంతో పాటు పల్లెవాతావరణాన్ని తలపించే విధంగా ఉత్సవాలు జరిగాయి. ఎక్కడ చూసినా సంక్రాంతి ముగ్గులు మెరిసిపోయాయి. ఉత్తర నియోజకవవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచి ఉత్సవాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి ప్రజలను ఉత్సాహపరిచారు. అలరించిన కళారూపాలు ఉత్సవాలు భోగి మంటలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవ ప్రాంగణంలోకి అందరూ తెలుగు సంప్రదాయ దుస్తుల్లో తరలి వచ్చారు. భోగిమంటల్లో పాత ఆశలను వదిలేసి నూతన ఉషస్సు కోసం ఆకాంక్షిస్తూ భోగిమంటల చుట్టూ చేరి ఆనందంగా గడిపారు. ఒక వైపు భోగిమంటలు వేస్తుండగా మరోవైపు మహిళలు కొత్త బియ్యంతో భోగి జావ తయారు చేసి అందరికి ప్రసాదంగా అందజేశారు. హరిలో రంగ హరీ అంటూ హరిదాసు కీర్తనలతో హరిదాసు విష్ణు స్తుతి గీతాలతో ఆధ్మాత్మికత సంతరించుకుంది. గంగిరెద్దు విన్యాసాలు, పద్మనాభం మండలం అనందపురం గ్రామానికి చెందిన తప్పెట గుళ్ల కళాకారుల విన్యాసాలు విశేషంగా అలరించాయి. పులివేషధారులు మంటల్లో చేసిన విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచాయి. స్వాగత నృత్యం, కూచిపూడి నృత్యాలు, వనితా వాకర్స్ మహిళల కోలాటాలు, దాండియా నృత్యాలు పండగకు మరింత వన్నె తెచ్చాయి. అంతా ఒకటై.. ఆనందించిన వేళ డప్పుల శబ్దాలకు ఆడా, మగా, చిన్నా, పెద్దా తేడా లేకుండా నృత్యాలు చేసి ఆనందంగా గడిపారు. ఎమ్మెల్యే విష్ణు కుమార్రాజు వారితో పాటు జతకలిసి మరింత ఉత్సాహాన్ని నింపారు. బామ్మలు తాతయ్యలు తమ బాల్య స్మృతులను గుర్తుకు తెచ్చుకుని మురిసిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు చిన్నారులకు భోగిపళ్లు వేసి దీవెనలు అందజేశారు. ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నా«థం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.పృథ్వీరాజ్, స్వాతి ప్రమోటర్స్ అధినేత ఎం.కృష్ణారెడ్డి, వైశాఖి స్పోర్ట్స్ పార్కు అధ్యక్ష, ఉపాధ్యక్షులు దుర్గా ప్రసాద్, సనపల వరప్రసాద్, కార్యదర్శి నారాయణరావు, టీఎన్ రెడ్డి, కూర్మారావు, 39వ వార్డు వైఎస్సార్సీïపీ అధ్యక్షుడు ఎస్.మౌళి, వాకర్స్ క్లబ్ కార్యదర్శి కె.త్రిపుర సుందరరావు, వనితా వాకర్స్ క్లబ్ కార్యదర్శి వి.జయప్రభాశర్మ, ఎస్.వరప్రసాద్ పాల్గొన్నారు. -
కొత్త కోడి.. గమ్మత్తు కోడి
భోగి వెలుగులు పదీపదిన్నరకైనా నోట్లోకి టూత్‌బ్రెష్ వచ్చేయడం పెద్ద ప్రారంభోత్సవం. స్నానం ముగించడం మహోత్సవం. బయటికొచ్చి మనుషులకు కనిపించడం బ్రహ్మోత్సవం. ఉదయాన్నే చల్లగా బస్సు దిగి ఉంటారు. మరీ ఉదయాన్నే దిగి ఉంటే, భోగి మంటల్ని దాటుకుని వెచ్చగా ఇంట్లోకి వెళ్లిపోయి ఉంటారు. మళ్లీ పడుకోడానికి! అంత త్వరగా తెల్లారిపోతే ఎలా? హైదరాబాద్ మెట్రో బాడీ తట్టుకుంటుందా! కనీసం పది వరకైనా పడుకోవాలి. పదిన్నరకు లేచినా లైఫ్‌లో అదో పెద్ద అచీవ్మెంట్. నోట్లోకి టూత్‌బ్రెష్ వచ్చేయడం పెద్ద ప్రారంభోత్సవం. స్నానం ముగించడం మహోత్సవం. బయటికొచ్చి మనుషులకు కనిపించడం బ్రహ్మోత్సవం. ఎప్పుడైనా చూడండి.. మనిషి కన్నా ఊరే ముందు నిద్రలేస్తుంది. కోడి నిద్రలేపుతుంది అనుకుంటాం. కోడిని కూడా ఊరే నిద్రలేపుతుంది. పొలం వెళ్లడానికి, పాలు పొయ్యడానికి ఊళ్లో ఒక్కరు ముందు లేచినా.. ఊరే ముందు లేచినట్టు! ఒళ్లు అలిసి పొలంవాళ్లు, పాలవాళ్లు లేవడం కొద్దిగా అలస్యం అయినా సరే, ఊరే ముందు నిద్రలేచినట్లు. వాళ్లకంటే ముందు వాళ్ల ఇంటి ఇల్లాలు లేచి ఉంటుంది కాబట్టి! ఒంట్లో ఆమెకు ఎలా ఉన్నా, ఇంటికోసం లేచి కూర్చుంటుంది. అందుకే కోడి.. ఊరితో పెట్టుకున్నా ఇల్లాలితో పెట్టుకోదు. పనిలేని వాళ్లు కోడితో గేమ్స్ ఆడుతున్నారని చెప్పి, పని తెమలని ఇల్లాళ్లతో కోడి గేమ్స్ ఆడదు. వాళ్ల దగ్గర ఒళ్లు దగ్గర పెట్టుకుంటుంది. ‘లేడీస్ ఫస్ట్’ అని రెస్పెక్ట్ ఇస్తుంది. వాకిట్లో బరాబరామని చీపురు చప్పుడు విన్నాకే, కోడి కొక్కొరొకోమంటుంది. కావాలంటే ఉదయాన్నే లేచి చూడండి. ముందు లేవడం, ముగ్గులెయ్యడం.. ఊళ్లకు, ఇల్లాళ్లకు అచీవ్మెంట్కాదు. అదొక మామూలు పని. మనిషన్నవాళ్లు చెయ్యవలసిన పని. ఏ టైమ్‌కి చెయ్యాల్సిన పనిని ఆ టైమ్‌కి చెయ్యని మనిషిని ఊరిప్పుడు కోపంగా చూస్తోందో లేదో.. ఊళ్లో ఉన్న కోడి మాత్రం విడ్డూరంగా చూస్తుంది. రాత్రే కదా హైదరాబాద్‌లో బయల్దేరాం. మనలో కొందరింకా బస్సులోనే ఉండి ఉంటారు. వాళ్లు ఊళ్లో దిగ్గానే కోడి మెడ తిప్పి చూస్తుంది.. వీడెవడో కొత్త కోడిలా ఉన్నాడని.. ఎత్తు కోడిలా ఉన్నాడని.. గమ్మత్తు కోడిలా ఉన్నాడని చూస్తుంది! చేత్తో సూట్‌కేస్ పట్టుకుని, భుజాల వెనక్కి బ్యాగు వేలాడేసుని ఊళ్లోకి దిగిన ఆ కోడి.. అల్లుడు కోడా, కొడుకు కోడా, అన్న కోడా, తమ్ముడి కోడా, బావ కోడా, మరిది కోడా అని చూస్తుంది. వాళ్ల పక్కనే ఇంకేదైనా కోడి కనిపిస్తే అది అతిథి కోడా, అతి చేయబోతున్న కోడా అని ఒకట్రెండుసార్లు తలతిప్పి చూస్తుంది. కోడి తలతిప్పి చూసిందంటే.. ఆయనెవరో లీడర్లా అది మనల్ని ప్రశ్నిస్తోందనే! కోడికి తన టైమింగ్స్ తప్ప హైదరాబాద్‌లో ఉన్న ఎంజీబీస్ టైమింగ్‌లు, జేబీఎస్ టైమింగులు తెలీవు. దారి మధ్యలో ఉండే టోల్గేట్లు, రైల్వేగేట్ల గురించి తెలీదు. ‘ఏబ్బాయ్ ఇప్పుడు తెల్లారిందా?’ అన్నట్టు చూస్తుంది. ‘ఒకరోజు ముందుకు రాలేకపోయా’ అన్నట్టు చూస్తుంది. ‘ముందొస్తే నువ్వూ భోగిమంటలకు కూర్చునేవాడివిగా.. చిన్న ఎండుపుల్లైనా వేసేవాడివి..’ అన్నట్టు చూస్తుంది. ఊరు అలా చూడదు. కన్నతల్లి కదా.. కోడిలానో, లీడర్లానో ప్రశ్నించదు. వచ్చిందే చాలనుకుంటుంది. సంక్రాంతి వచ్చేసిందనుకుంటుంది. కోడికి ఒకటే రూపం. ఊరికి మలుపుకో రూపం. పెద్ద కాల్వ ఒక రూపం. ప్రాథమిక పాఠశాల ఒక రూపం. దొరువు ఒక రూపం. దొరువు గట్టు మీద ఊడలమర్రి ఒక రూపం. అమ్మ పిలుపు ఒక రూపం. నాన్న జ్ఞాపకాలు ఒక రూపం. పెద్దకాలువ వీపు నిమిరిందీ, పాఠశాల పలక దిద్దిందీ, ఊడలమర్రి చీకట్లో దెయ్యమయి ఊగిందీ, ‘ఒరే ఎక్కడ్రా’ అని అమ్మ గాభరాగా ఊరంతా వెతుకులాడిందీ, సెకండ్ క్లాసొచ్చి తలవంపులు తెచ్చినందుకు ‘వాడీ ఇంట్లో ఉండటానికి వీల్లేదు’ అని నాన్న అనలేకపోయిందీ.. తడిమే జ్ఞాపకాలే కానీ, తడుముకునేలా చేసే ప్రశ్నలు కాదు. ‘ఎన్నేళ్లయిందిరా నిన్నుచూ సి’ అని ఊరు ఊరంతా అమ్మై చూసే ఒక్క చూపుకు జలజలా రాలే కన్నీళ్లు.. ఎన్ని భోగిమంటలకు మనం ఊరొచ్చి వెళితే ఆ భగభగల్లో ప్రక్షాళన అవుతాయో సీఎం కేసీఆర్ చెప్పలేడు, మాదాపూర్‌లోని హైటెక్ సీటీ చెప్పలేదు. చలి మూడు నెలలు ఉండిపోతుంది. సంక్రాంతికో, శివరాత్రికో వెళ్లిపోతుంది. ఊరు దాటొచ్చిన బతుకులోని ముక్కుదిబ్బడ కూడా.. ఉండాలి, పోవాలి తప్ప.. ఉండిపోకూడదు. ఊళ్లో బతుకు లేదనుకున్నప్పుడు ఉద్యోగం మనల్ని ఒళ్లోకి తీసుకున్న మాట నిజం. ఉద్యోగమే బతుకైపోతున్నప్పుడు.. ఒక్కసారైనా వచ్చిపొమ్మని ఊరు మన కోసమే.. కేవలం మన కోసమే భోగినీ, సంక్రాంతినీ చేసుకుంటున్నదీ నిజం. మాధవ్ శింగరాజు -
అమ్మో! భోగిపళ్లు!!
♦ పండగ సణుగుడు ‘ఏవండీ! ఈసారి పిల్లలకు పండగ మూడ్రోజులూ మూడు జతల బట్టలు కొందామండీ’ అని మా ఆవిడ పండగ నెల పట్టినప్పటినుంచే చెవులు కొరకడం మొదలెడుతుంది. అవి మా అమ్మ అంతకుముందు అదే విషయం మీద ఆల్రెడీ కొరికి వదిలి పెట్టిన చెవులేనని తనకి తెలుసో లేదో నాకు తెలీదనుకోండి! ‘సరే చూద్దాంలే’ అనే సి నేను అదో పెద్దవిషయం కానే కాదన్నట్టు పోజుపెడుతుంటాను కానీ నాకు మాత్రం ముచ్చట ఉండదూ... ఒకరు కాదు ఇద్దరు బంగారు తల్లులు కొత్తబట్టలు తొడుక్కుని కళకళలాడుతూ కళ్లముందు తిరుగుతుంటే చూడాలని! బట్టలు కొనడమంటే నేను ఆట్టే కంగారు పడను కానీ, బోగిపళ్లంటేనే కొంచెం కలవరపడతాను. ఎందుకంటే బట్టలు ఆన్లైన్లో బుక్ చేసి పారేయొచ్చు, క్రెడిట్‌కార్డ్ పుణ్యమా అని ఇరవైనాలుగ్గంటలూ అందుబాటులో ఉండే ఇంటర్నెట్టు మహాతల్లి చలవ వల్ల ఇంచక్కా కొనిపడేస్తుంటాను... ఆ తర్వాత నెలాఖరులో జీతం రాగానే (మాకు నెల చివరి తారీక్కే జీతాలు ఇస్తారు) తిట్టుకుంటూనే గుట్టుచప్పుడు కాకుండా బిల్లు కట్టేసి, మూడోరోజు నుంచి మళ్లీ వద్దువద్దనుకుంటూనే కార్డు తీస్తుంటాను... అద్సరే! బోగిపళ్లంటే ఎందుకంత బెంబేలు అని కదూ సందేహం! మా చిన్నప్పుడు రూపాయిస్తే చాలు... పళ్లు పులిసిపోయేటన్ని పళ్లొచ్చేవి! ఇప్పుడు భాగ్యనగరంలో రేగుపళ్లు వందగ్రాములు ఇరవై రూపాయలు... లెక్కపెడితే ఇరవై కూడా సరిగా ఉండవు. పావుకేజీ యాభై రూపాయలు. అదీ నార్మల్ డేస్‌లో అయితేనే... ఇక బోగిపళ్ల రోజుల్లో అయితే చెప్పనే అక్కర్లేదు. చచ్చూపుచ్చూ చూసుకోకపోతే కాస్త చవగ్గానే వస్తాయి కానీ, వాటిని పిల్లల తలమీద పోసినప్పుడు ఆ కంగారుకు పాపం అవి వాటి ఇళ్ల నుంచి (రేగుపళ్ల నుంచి) తలలు బయటపెట్టి చూస్తాయి. కొండొకచో పిల్లల తలమీదనుంచి ఒంటిమీదికి పాకుతుంటాయి. మంచివి తీసుకుందామంటే కేజీ రెండొందలకు పైమాటే! చిన్నప్పుడు పదిరూపాయలు పడేస్తే మానెడు వచ్చే రేగుపళ్లకు చూస్తూ చూస్తూ రెండుమూడొందలు పెడదామంటే ప్రాణం ఒప్పదు. అదీ కనీసం రెండుకేజీలన్నా తీసుకోకపోతే ఏం బాగుంటుంది... ఇద్దరు పిల్లలకు పోయాలాయె! భోగిపళ్లు పోయడమంటే ఒక్క రేగుపళ్లు కొంటే సరిపోదు, సెనగలు, తమలపాకులు, వక్కపొడి ప్యాకెట్లు.... వగైరా వగైరాలు కూడా ఉంటాయి. వీటన్నిటికీ కరకురొక్కం (హార్డ్ క్యాష్) ఇవ్వక తప్పదు, క్రెడిట్ కార్డిస్తే వాళ్లు విసిరి మొహాన కొట్టినా కొడతారు. ‘పోనీ, ఎంత వెతికినా రేగుపళ్లు దొరకలేదు.. ప్చ్!’ అని ముఖం వేలాడేసుకుని ఉట్టి చేతులతో ఇంటికి వెళ్తేనా... అమ్మో! ఇంకేమన్నా ఉందా?! - బాచి -
తిరుపతిలో భోగి మంటల వ్యర్థాలు 95 టన్నులు
తిరుపతి కార్పొరేషన్: భోగి పండుగ రోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం ఉద్యోగ, కార్మికులు నగరంలోని వీధులు శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కార్పొరేషన్ కమిషనర్ వినయ్‌చంద్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఉషాకుమారి భోగి మంటల వ్యర్థాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య పర్యవేక్షణలో నగరంలోని భోగి మంటలను శుభ్రం పని యుద్ధప్రాతిపదికన చేయించారు. ఉద యం నుంచి సాయంత్రం వరకు దాదాపు 95టన్నుల వ్యర్థాలను తొలగించారు. ఇందుకోసం ఎనిమిది మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు, 40 మంది మేస్త్రీలు, 239 మంది శాశ్వత ఉద్యోగులు, 649 మంది కాంట్రాక్టు కార్మికులు సేవలు అందించారు. -
జనసంద్రమైన మల్లన్న సన్నిధి
ఐనవోలు మల్లన్న సన్నిధి భక్తజన సంద్రమైంది.. శివసత్తుల పూనకాలు.. ఒగ్గు పూజారుల కథలు.. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం భోగి పండుగను పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకుడు స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం రాజయ్య పూజలు నిర్వహించారు. - సెంటర్‌స్ప్రెడ్‌లో.. - వర్ధన్నపేట ఐలోని మల్లన్నకు భక్తుల మొక్కులు భోగి నేపథ్యంలో పెరిగిన రద్దీ కొనసాగుతున్న మల్లికార్జున స్వామి జాతర మల్లన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం ఐనవోలు (వర్ధన్నపేట) : ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తజన సంద్రమైంది. భోగి పండుగ నేపథ్యంలో రద్దీ పెరిగింది. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో విడిది ఏర్పాటు చేసుకున్నారు. ఒగ్గు పూజారుల కథ, డప్పు వారుుద్యాల నడుమ నెత్తిన బోనాలతో మహిళలు శివతాండవం చేశారు. రేణుక ఎల్లమ్మకు నైవేద్యం సమర్పించారు. మల్లన్న ఆలయంలో మహిళలు టెంకాయ బందనం చేసి వరంపట్టారు. చిన్న పట్నాలు వేసి మొక్కులు చెల్లించారు. చిన్న పట్నాలు వే శారు. ఒగ్గు కథ (మల్లన్న చరిత్ర)తో స్వామివారిని కొలిచారు. ప్రభుత్వం జాతరను అధికారికంగా గుర్తించడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి భక్తులు ఐనవోలుకు చేరుకున్నారు. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. మల్లన్న సేవలో డిప్యూటీ సీఎం ఐలవోనిని అధికారిక జాతరగా గుర్తించడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ రాజలింగం, రాజయ్య యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ గ ద్దల పద్మ, వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్రావు, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ నల్ల మల్లారెడ్డి, ఎంపీపీ మార్నెని రవీందర్రావు, జెడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దేవస్థానం చైర్మన్ వడిచర్ల శ్రీనివాస్, ఈవో శేషుభారతి ఆలయ మర్యాదలతో సత్కరించారు. మామునూర్ డీఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఏవీవీ కళాశాల ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ కొడిమ్యాల శ్రీనివాసరావు నేతృత్వంలో 25 మంది వాలంటీర్లు భక్తులకు సేవలందించారు. నేటి ఉత్సవాలు.. మహాన్యాస పూర్వక ఏకాద శ రుద్రాభిషేకాలు, మహానివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. సాయంత్రం ఎడ్లబండ్లకు ప్రభలు కట్టుకొని గుడిచుట్టు ప్రదక్షిణలు చేస్తాయి. -
సిటీకి పల్లె కళ..
భాగ్య నగరం సిరి సంపదల పండుగకు సమాయాత్తమైంది. ఎటుచూసినా సంక్రాంతి జోష్ కనిపించింది. ఒక వైపు పట్నవాసులు పల్లెబాట పట్టగా మరో వైపు యువత, పెద్దలు అందరూ భోగి మంటలు వేసుకుని పెద్ద పండుగకు ఘన స్వాగతం పలికారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా అర్ధరాత్రి నుంచే మంటలు వేసేందుకు ఉత్సాహం చూపారు. సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తుగా హైటెక్ సిటీలో డూడూ బసవన్నలు సందడి చేశారు. -
భోగి భాగ్యాలు
ఏ దేశంలోనైనా సరే కొన్ని సంప్రదాయాలుంటాయి. అలాగే భారతీయ సంప్రదాయంలో మాత్రం తిలదానం దగ్గరనుండి అప్తోర్యామయాగం వరకు ప్రతి తంతుకీ లో విశేషం ఉంటుంది- ఉండి తీరుతుంది. ఆ ఆంతర్యాన్ని తెలుసుకోగల పండుగల మనకుండడాన్ని ఓ అదృష్టంగా భావిస్తూ ఆ నేపథ్యాన్ని గ్రహిద్దాం! భోగం కలిగింది భోగి. భోగమంటే ఆనందాన్ని అనుభవించడమని అర్థం. భూమి- తాను సంతృప్తిగా ధాన్యాన్ని ఇచ్చాననే ఆనందాన్ని అనుభవిస్తూ, వృషభం- తన శ్రమకి ఫలితం లభించి ధాన్యం ఇబ్బడిముబ్బడిగా గాదెలకు చేర్చగలిగాననే సంతోషంతో, యజమాని- గాదెలన్నీ నిండాయ నే ఆనందాన్ననుభవిస్తూ, పిచ్చుకలు- కంకులనిండా ఉన్న ధాన్యాన్ని తినగలుగుతున్నామనే తృప్తితో... ఇలా పశుపక్షి మానవ జీవరాశులన్నీ భోగంతో (ఆనందానుభవంతో) గడుపుకునే పండుగ కాబట్టి ‘భోగి’. ఇది మొదటి ఆంతర్యం. నిజమైన భోగం ఆనందానుభవం ఎప్పుడంటే ఆకాశవర్షం భూమికి చేరి పంట చేతికొచ్చినప్పుడే. అందుకే ధరణి నుండి పుట్టిన గోదాదేవికి ఆకాశరాజపుత్రుడైన రంగనాథునితో కల్యాణాన్ని చే(యి)స్తారు. పంచభూతాల్లో మొదటిదైన పృథివి ఆ చివరిదైన ఆకాశంతో సమన్వయపడి ఉంటే ఇంక పంచభూతాత్మక ప్రపంచానికి తిరుగేముంది? - కాబట్టి ‘భోగి’. ఇది రెండవ ఆంతర్యం. అభ్యంగస్నానభోగం: ప్రాతఃకాలంలోనే తల్లులందరూ తమ పిల్లల్ని నిద్రలేపి వాళ్ల మాడున నువ్వులనూనెని అద్దుతూ ‘ఆశీర్వచనాలని హృదయపూర్వకంగా చేసి, ఎక్కడా ఏ రక్తనాళంలోనూ రక్తప్రసరణ మందంగా ఉండకుండా ఉండేలా బలంగా శరీరాన్ని మర్దించి నలుగుపెట్టి, శిరోజాల్లో క్రిమికీటకాలు చేరకుండా ఉండేలా కుంకుడుపులుసుతో రుద్ది, అభ్యంగస్నానాన్ని చేయించి వాళ్లకి సుఖనిద్ర కలిగేలా చేస్తారు. స్వేదరంధ్రాలన్నీ తెరుచుకున్న కారణంగా శరీరానికి ఆనందానుభవం కల్గిస్తుంది ఈ పర్వదినం. అందుకే ఇది ‘భోగి’. ఆరోగ్యపరమైన ఆంతర్యం ఇది మూడవది. ప్రాతరగ్ని భోగం: తెల్లవారుఝామునే నాలుగుమార్గాల కూడళ్లలోనూ మంటలు వేస్తారు. ఏవో పాతకర్రలూ పనికిరాని చెక్కముక్కలూ దీనిలో పడిపోతాయనేది రహస్యం కాదిక్కడ. శరీరానికి హాని కల్గించేవి క్రిములు. వాతావరణానికి హాని కల్గించేవి కృములు. ఈ చలీమంచూ పుష్కలంగా ఉండే ఈ కాలంలో ఆ క్రిమికృములూ ఇటు వ్యక్తులకీ అటు వాతావరణానికీ హాని కల్గిస్తూ ఉంటాయి. ఆ కారణంగా మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి, మారేడు, ఉత్తరేణి, తులసి ఎండుకట్టెలతో మంటని చేసి ఆ ధూమాన్ని పీల్పింపచేస్తూ ఆ మంట వద్ద కూర్చోవలసిందన్నారు పెద్దలు. దీంతో మనలోపలి క్రిమిబాధ తొలగి శరీరారోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్యానుభూతిని పొందడమనేది నాల్గవ ఆంతర్యం. ఇక కృములన్నీ వాటంతట అవే మంటలకి ఆక ర్షింపబడి మరణించి పర్యావరణానికి హాని కల్గించ కుండా మనకి ఆనందానుభవాన్ని ఇస్తోంది కాబట్టి ఇది వాతావరణ కాలుష్య హరానందానుభూతి నియ్యడమనేది 5వ ఆంతర్యం. రంగవల్లికాభోగం: ఏ విధమైన పరిశోధనా పరికరమూ లేకుండా ఖగోళంలో ఉన్న గ్రహగతుల్నీ వాటిద్వారా వ్యక్తులకి కలిగే మేలు- కీడులని తెలియజేయడం కోసం - ఈ నేలని ఆకాశంగా చేస్తూ- గ్రహాలు తిరిగే మార్గాలని ముగ్గుగీతలుగా చేస్తూ, ఈ తీరు గ్రహ పరివర్తన కారణంగా వర్షం ఎంత పడుతుంది? ఎంత దూరంలో పడుతుంది? ఆ స్థాయి వర్షబలంతో ఏ పంట పండుతుంది? ... ఇలా అన్నింటినీ వ్యవసాయదారులు నేలమీదే చూసి తెలుసుకుని ఆనందానుభూతితో గడుపుకునేది భోగి. ఇది ఆరవ ఆంతర్యం. వాతపట భోగం: వాతమంటే గాలి పరివర్తన దిశకి సంకేతం. పటమంటే వస్త్రం. ఒకప్పటి రోజుల్లో వస్త్రంతో చేసిన గాలిపటాలనెగురవేస్తూ ఉండేవాళ్లు. ఆ సూర్యునికి ఆహ్వానాన్ని అక్కడికి వెళ్లి పలకలేం కాబట్టి ఇక్కడినుండి గాలిపటాలనెగురవేసి స్వాగతించడంలో ఓ ఆనందానుభవాన్ని పొందడం భోగి. మరో విశేషమేమిటంటే ఉత్తరాయణం రాబోతున్న రోజున గాలి వేగం ఎంతతో ఉందో, గాలి ఏ దిశగా వీస్తోందో, దానిలో తేమ ఎంత శాతముందో, దాన్ని బట్టి రాబోయే కాలంలో పంట దిగుబడిక్కావలసిన వర్షపాతాన్ని లెక్కించగలరు రైతులు. ఆ కారణంగా వాళ్లకి- రాబోయే పంట సమాచారాన్ని తెలుసుకోగలిగా-మనే ఆనందానుభవం ‘భోగి’. ఇది ఏడవ ఆంతర్యం. కుండలినీ భోగం: భోగము అంటే పండుగ. అది కలిగినది భోగి అంటే పాము. ఆ పాము (కుండలిని) శరీరానికి ఉత్తరంగా ఉండే శిరసులోనికి ఆయనం (ప్రయాణం) చేస్తూ మెల్లమెల్లగా సహస్రారంలో ఉండే దైవాన్ని దర్శించి ఆనందానుభవాన్ని పొందడం ‘భోగి’. ఇది యథార్థం కాబట్టే కార్తిక త్రయోదశి, చతుర్దశి, అమావాస్యలు కలిసిన అవమతిథినాడు కురుక్షేత్రయుద్ధంలో పాల్గొన్న భీష్ముడు మార్గశీర్ష (శీర్షం వైపుకి ప్రయాణింపజేసే మార్గం)- శుద్ధ దశమినాడు అంపశయ్యని చేరే ఆనందానుభవం లభించే భోగిని దాటి, అష్టమీ తిథి రోహిణీ నక్షత్రంలో కృష్ణునిలో లీనమయ్యాడు! కేవలం యోగమార్గంలో ఆనందానుభవాన్ని పొందడమే ఆయన లక్ష్యమైనా అష్టమి, రోహిణి అనే రెంటికోసమే మరికొన్ని రోజులు తన శరీరాన్ని త్యజించకుండా ఆపాడు. ఇన్ని ఆంతర్యాలతో కూడిన భోగం ‘భోగి’. ఎంత అదృష్టవంతులం! మనం ఇలాంటి పండుగంటూ ఒకటి మనకి ఉన్న కారణంగా! ఫొటో: వీరభగవాన్ తెలగరెడ్డి, విజయవాడ అర్కఫలభోగం సూర్యునితో ఆకారంలోనూ, రంగులోనూ పేరులో కూడా (అర్కఫలమ్) పోలిక ఉన్న రేగుపళ్లని తలమీదుగా శరీరం నిండుగా పో(యి)స్తూ ఆశీర్వచనాన్ని అందరూ చేస్తూ ఆ ఆనందానుభవాన్ని పొందడం భోగి. సూర్యుణ్ణి ఈ పసివారి శరీరాల్లోకి ఆవహింపజేస్తూ అటు ఆ సూర్యుని ఆరోగ్యశక్తీ ఇటు ఆ సూర్యునికి గల జ్ఞానశక్తీ (ధియో యోనః ప్రచోదయాత్) అనే రెండూ ఈ ఫలాభిషేకాన్ని చేయించుకుంటున్న వ్యక్తికి లభించాలనే తీరు ఆనందానుభవం (భోగి). ఇది ఎనిమిదవ ఆంతర్యం.