సిటీకి పల్లె కళ..
భాగ్య నగరం సిరి సంపదల పండుగకు సమాయాత్తమైంది. ఎటుచూసినా సంక్రాంతి జోష్ కనిపించింది. ఒక వైపు పట్నవాసులు పల్లెబాట పట్టగా మరో వైపు యువత, పెద్దలు అందరూ భోగి మంటలు వేసుకుని పెద్ద పండుగకు ఘన స్వాగతం పలికారు.
చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా అర్ధరాత్రి నుంచే మంటలు వేసేందుకు ఉత్సాహం చూపారు. సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తుగా హైటెక్ సిటీలో డూడూ బసవన్నలు సందడి చేశారు.