తిరుపతిలో భోగి మంటల వ్యర్థాలు 95 టన్నులు | 95 tonnes of waste bonfire in Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో భోగి మంటల వ్యర్థాలు 95 టన్నులు

Published Thu, Jan 15 2015 2:20 AM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM

95 tonnes of waste bonfire in Tirupati

తిరుపతి కార్పొరేషన్: భోగి పండుగ రోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగం ఉద్యోగ, కార్మికులు నగరంలోని వీధులు శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కార్పొరేషన్ కమిషనర్ వినయ్‌చంద్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఉషాకుమారి భోగి మంటల వ్యర్థాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు.

శానిటరీ సూపర్‌వైజర్ చెంచయ్య పర్యవేక్షణలో నగరంలోని భోగి మంటలను శుభ్రం పని యుద్ధప్రాతిపదికన చేయించారు. ఉద యం నుంచి సాయంత్రం వరకు దాదాపు 95టన్నుల వ్యర్థాలను తొలగించారు. ఇందుకోసం ఎనిమిది మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, 40 మంది మేస్త్రీలు, 239 మంది శాశ్వత ఉద్యోగులు, 649 మంది కాంట్రాక్టు కార్మికులు సేవలు అందించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement