దేశ రాజధాని ఢిల్లీలోని పాండవ్ నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకలు ఈ ప్రాంతానికి చెందిన ఏడుగురిని విషాదంలోకి నెట్టివేశాయి. హోలీ వేడుకల్లో మునిగిన వీరంతా హై టెన్షన్ లైన్‌ను పొరపాటున తాకారు. ఫలితంగా వీరు తీవ్రంగా కాలిపోయారు. ప్రస్తుతం బాధితులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం గాయపడిన ఈ ఏడుగురిలో ముగ్గురు పిల్లలు, ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసి, బాధితులను ఆసుపత్రికి తరలించారు. దీనికి ముందు వీరంతా తమ ఇంటి పైకప్పులపైకి చేరి హోలీ ఆడుతున్నారు. ఈ సమయంలో నీరు హైటెన్షన్ లైన్‌ను తాకడంతో పేలుడు సంభవించింది. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులలో ఒక జీఆర్‌పీ జవాన్‌తో పాటు అతని భార్య కూడా ఉన్నారు.
#WATCH | A few members of a family admitted to Safdarjung hospital after getting injured due to an electric shock from a high-tension wire in the Pandav Nagar area of East Delhi, after celebrating Holi: Delhi Police pic.twitter.com/1nkJONc5HU
— ANI (@ANI) March 25, 2024
Comments
Please login to add a commentAdd a comment