Holi celebration
-
పండుగ నింపిన విషాదం
జిన్నారం(పటాన్చెరు): ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలికొన్నది. గుమ్మడిదల మండలంలోని వీరన్నగూడ గ్రామంలో సోమవారం చెరువులో మునిగి ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా ఈ ఇద్దరు యువకుల మృతదేహాలు మంగళవారం చెరువులో లభ్యమయ్యాయి. గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వరెడ్డి కథనం ప్రకారం.. సూరారంలోని నివాసం ఉంటున్న శ్రావణ్(16), శంకర్ (22)లతోపాటు మరో పది మంది స్నేహితులు హోలి పండుగను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం స్నానం చేసేందుకు వీరన్నగూడ గ్రామంలోని వీరన్న చెరువు వద్దకు వెళ్లారు. తోటి స్నేహితులు స్నానం చేసి బయటకు రాగా శ్రవన్, శంకర్లు చెరువులోకి వెళ్లి బయటకు రాలేదు. గజ ఈతగాళ్లతో వెతికించినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం వీరిద్దరి మృతదేహాలు చెరువులో తేలాయి. మృతుడు శ్రావణ్ పదవ తరగతి చదువుతున్నాడు. పరీక్షలు ఉన్నా, తల్లిదండ్రులు చెబుతున్నారా వినకుండా సరాదా కోసం ఈతకు వెళ్లడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. మృతులు ఇద్దరూ వరుసకు అన్నాదమ్ముళ్లు అవుతారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ తెలిపారు. ఇద్రేశం చెరువులో మరో యువకుడు పటాన్చెరు టౌన్: హోలీ వేడుక స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి స్నేహితుడిని రక్షించబోయి నీటిలో మునిగిపోయి గల్లంతైన ఘటనలో మంగళవారం మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన దాదాపు పది మంది స్నేహితులు సోమవారం హోలీ సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ఇంద్రేశం గ్రామ శివారు సదర్ చెరువులో స్నానానికి వెళ్లారు. చెరువులో ఉన్న పుట్టె ఎక్కిన శివ అనే స్నేహితుడిని కాపాడబోయి బండి రాజేశ్ గల్లంతు కాగా, గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం తిరిగి గజఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టగా ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి సత్యనారాయణ ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతానికి గురైన ఏడుగురి పరిస్థితి విషమం!
దేశ రాజధాని ఢిల్లీలోని పాండవ్ నగర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకలు ఈ ప్రాంతానికి చెందిన ఏడుగురిని విషాదంలోకి నెట్టివేశాయి. హోలీ వేడుకల్లో మునిగిన వీరంతా హై టెన్షన్ లైన్‌ను పొరపాటున తాకారు. ఫలితంగా వీరు తీవ్రంగా కాలిపోయారు. ప్రస్తుతం బాధితులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గాయపడిన ఈ ఏడుగురిలో ముగ్గురు పిల్లలు, ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసి, బాధితులను ఆసుపత్రికి తరలించారు. దీనికి ముందు వీరంతా తమ ఇంటి పైకప్పులపైకి చేరి హోలీ ఆడుతున్నారు. ఈ సమయంలో నీరు హైటెన్షన్ లైన్‌ను తాకడంతో పేలుడు సంభవించింది. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులలో ఒక జీఆర్పీ జవాన్‌తో పాటు అతని భార్య కూడా ఉన్నారు. #WATCH | A few members of a family admitted to Safdarjung hospital after getting injured due to an electric shock from a high-tension wire in the Pandav Nagar area of East Delhi, after celebrating Holi: Delhi Police pic.twitter.com/1nkJONc5HU — ANI (@ANI) March 25, 2024 -
ఈ సాయంత్రం 6 గంటల నుంచి వైన్ షాపులు బంద్
హైదరాబాద్: మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్..ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయనున్నారు..ఎందుకంటే..రేపు సోమవారం 2024, మార్చి25న హోలీ సందర్భంగా నగర వ్యాప్తంగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. నగరంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా మద్యం షాపులు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 26 మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా పండుగ సందర్భంగా షాపులు మూసివేయాలని వైన్స్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మందు తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలను సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సిటీలో తిరిగే వాహనదారులపై రంగులు చల్లరాదన్నారు. వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని సూచించారు. -
హైదరాబాద్ లో ఘనంగా హోలీ సంబురాలు (ఫొటోలు)
-
రంగులతో తడిసి ముద్దైన హైదరాబాద్ యువత (ఫోటోలు)
-
Holi 2021: ఈ రంగులకు విదేశాల్లో భలే డిమాండ్..
రంగుల పండుగ హోలీలో కలర్స్ చల్లుకోవడమే పెద్ద సెలబ్రేషన్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీ కానిది ఏది లేదు. ఆకర్షణీయమైన రంగులు కూడా కల్తీ అవుతున్నాయి. రకరకాల హానికారక రసాయనాలతో తయారుచేసిన హోలీ రంగులను మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిలో కార్సినోజెన్స్ ఉంటున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తుండడంతో.. వివిధ రకాల మూలికలతో తయారు చేసిన రంగులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌లో తయారయ్యే గుల్లాస్‌కు (ఆకర్షణీయమైన రంగు) దేశంలోనే గాక విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. యూపీలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు మోదుగ పూలతో తయారు చేసే గుల్లాస్ రంగులకు ఎంతో ఆదరణ లభిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో పల్లాష్ పువ్వు (బుటియా మోనోస్పెర్మ–శాస్త్రీయ నామం) గా పిలిచే మోదుగ పూలను హోలీ రంగుల తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. యూపీలోని వివిధ జిల్లాల్లోని మహిళలు మోదుగ పూల నుంచి రంగులు తయారుచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. యూపీ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ప్రోత్సాహంతో నడిచే ఈ గ్రూపులు గుల్లాస్‌ను తయారు చేస్తున్నాయి. సోన్‌భద్ర, మీర్జాపూర్, చందౌలి, వారణాసి, చిత్రకూట్ జిల్లాల్లో మోదుగ పూలను సేకరించి ఎరుపు, ఆకుపచ్చ, ఊదా, గులాబీ రంగులను తయారు చేస్తున్నారు. ఈ రంగులకు యూపీలోనే గాక ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది.సోన్‌భద్ర భీమా ప్రేరణ సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుకు చెందిన సభ్యురాలు కాంచన్ మాట్లాడుతూ..‘‘ మోదుగ పూలను తెంపి వాటిని ఒకరోజుపాటు ఎండలో ఆరబెడతాము. పువ్వులు ఆరిన తరువాత వాటిని నీటిలో వేసి రెండు గంటలపాటు మరిగిస్తాము. పువ్వులు మరిగేటప్పుడు వాటి నుంచి రంగు బయటకు వస్తుంది. పూర్తిగా మరిగాక ఆ నీటిని గంజిపొడితో కలుపుతాము. మూలిక మొక్కల నుంచి తీసిన గంజిపొడిని ఈ నీళ్లతో కలపడంతో అది మంచి రంగులోకి మారి కలర్ తయారవుతుంది’’ అని చెప్పారు. ‘‘ఈ హెర్బల్ గులాల్ తయారు చేయడానికి మాకు పెద్దగా ఖర్చు ఉండదు. సగటున రూ.60 నుంచి 70 రూపాయలకు అవుతుంది. ఈ రంగులకు విదేశాల్లో భలే డిమాండ్.. ఈ పొడిని మార్కెట్లో రూ.150 నుంచి 200 వరకు విక్రయించడం ద్వారా మంచి లాభం వస్తుంది. మా గ్రూపులో నాతోపాటు మరో 11మంది మహిళలు పనిచేస్తున్నారు. మేమంతా కలిసి మూడు క్వింటాళ్ల రంగును తయారు చేసి సోన్‌భద్రా జిల్లాలో విక్రయిస్తాం’’అని కాంచన్ తెలిపారు.యూపీ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ డైరెక్టర్ సుజిత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మేము వంద శాతం రసాయనాలు కలపని రంగులు తయారు చేస్తున్నాం. ఇందుకోసం మోదుగపూలు బాగా ఉపయోగపడుతున్నాయి. సోన్‌భద్రా, మీర్జాపూర్ జిల్లాలోని సెల్ప్‌హెల్ప్ గ్రూపు మహిళలు ఎంతో నిబద్దతతో ఈ రంగులను తయారు చేస్తున్నారు. 32 జిల్లాలోని 4,058 మహిళలు మూలికలతో ఐదు వేల కిలోల రంగును తయారు చేస్తున్నారు. ఈ రంగును రూ.7లక్షలకు విక్రయించారు. రంగులతోపాటు చిప్స్, అప్పడాలు, కజ్జికాయలు వంటి వాటిని కూడా తయారు చేస్తున్నారు’’ అని తెలిపారు. సోన్‌భద్రా రంగులు కావాలని లండన్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయని, సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల ఉత్పత్తులను కోట్ల రూపాయల టర్నోవర్‌లోకి తీసుకురావడమే తమ లక్ష్యం’’ అని ఆయన చెప్పారు. కాగా మోదుగ పూలతో తయారు చేసిన రంగులకు మంచి డిమాండ్ వస్తుండడంతో మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఈ పూల మొక్కలను విరివిగా పెంచుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. మోదుగ పూలు మన చర్మానికి ఎటువంటి హానీ చేయవు. ఫంగల్ ఇన్పెక్షన్స్ నుంచి రక్షించడంతోపాటు కాలుష్యాన్నీ కూడా తగ్గిస్తాయి. అంతేగాక ఉదర సంబంధ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయి. మరెందుకు ఆలస్యం మీరు కూడా మోదుగ పూలతో రంగులు తయారు చేసి హెర్బల్ హోలీ ఆడండి. -
‘సామూహిక ఆత్మహత్యలే శరణ్యం’
సాక్షి, న్యూఢిల్లీ : హోలీ వేడుక జరిగిన రోజు గురుగ్రాంలో దాడికి గురైన ముస్లిం కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడతామని జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించింది. తమ కుటుంబంపై దాడి చేసిన అల్లరి మూక ఇంట్లోని మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేసిందని ఆ కుటుంబం పేర్కొంది. స్ధానిక రాజకీయ నేతల సిఫార్సుతో పోలీసులు, అధికారులు దాడికి తెగబడిన గూండాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. తమపై అల్లరిమూకలు పధకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడిన తీరు బహిర్గతమైందని, ఇప్పటికీ పోలీసులు తమకు సాయపడకుండా, ఫిర్యాదును వెనక్కితీసుకోవాలని తమను బెదిరిస్తున్న నిందితులకు, వారి కుటుంబ సభ్యులకు సహకరిస్తున్నారని బాధితుల్లో ఒకరైన మహ్మద్ అక్తర్ పేర్కొన్నారు. అల్లరి మూకలు తమ ఇంటికి వచ్చి తమమహిళలు, బాలికలను వేధిస్తే పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని, తమకు సామూహిక ఆత్మహత్యలే శరణ్యమని స్పష్టం చేశారు. ఈ కేసులో త్వరితగతిన విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులకు బాధిత కుటుంబం మెమొరాండం సమర్పించింది. నిందితులపై చర్యలు చేపట్టకపోగా తమ కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులపై స్ధానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా తాము గురుగ్రాంలో నివసిస్తున్నామని, హోలీ రోజున 30 నుంచి 40 మందితో కూడిన అల్లరి మూక తమ ఇంటిపై కర్రలతో దాడి చేసి తమను పాకిస్తాన్ వెళ్లాల్సిందిగా తీవ్ర వేధింపులకు గురిచేసిందని చెప్పుకొచ్చారు. బాధితులు అల్లరిమూక దాడి దృశ్యాలను వీడియోలో రికార్డు చేశారు. కాగా ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణతోనే ఈ దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. -
హైదరాబాద్ : 'రంగు' పడింది
-
రివాల్వర్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ మృతి
శివ్‌పురి: హోలీ వేడుకల్లో తుపాకీ మిస్‌ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ చనిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం శివ్‌పురిలో చోటుచేసుకుంది. రాజేంద్ర జాటవ్(38) రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో తోటివారితో కలిసి హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర తన సర్వీస్ రివాల్వర్‌తో గాలిలోకి మూడు సార్లు కాల్పులు జరిపాడు. మూడోసారి ట్రిగ్గర్ నొక్కగా అది జామ్ అయింది. దీంతో ఆయన తుపాకీని పరిశీలిస్తుండగా అది ప్రమాదవశాత్తు పేలి బుల్లెట్ రాజేంద్ర తలలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన రాజేంద్రను వెంటనే ఆస్పత్రికి తరలించగా అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని జిల్లా సూపరింటెండెంట్ సునిల్ యాదవ్ తెలిపారు. -
ఆడదామా హోలీ
కులం... మతం... ప్రాంతం... రంగు... రూపు... ఏదైనా... ఆడాలి హోలీ. మనసులు కలిసే రంగోలి... కలర్‌ఫుల్ కేళీ... ఆవో... ఖేలో... హోలీ... రంగులతో సందడి చేసిన లావణ్యా త్రిపాఠి ⇔ ‘సాక్షి’ కోసం సరదాగా హోలీ ఆడతారా? లావణ్య త్రిపాఠి: బాబోయ్.. హోలీ రంగులంటే నాకు భయం. అయినా అడిగారు కాబట్టి, ఓకే. ⇔ హోలీ పండగ అనగానే మీకు గుర్తుకొచ్చేది ఏంటి? చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తాయి. నార్త్‌లో హోలీ బాగా జరుపుకుంటారు. మా డెహ్రాడూన్‌లో అయితే పిచ్చి పట్టినట్లుగా ఆడతారు. ఉదయాన్నే నిద్ర లేచి, పక్కింటికి వెళ్లి, నిద్ర లేవని వాళ్లను లేపేసి మరీ రంగులు చల్లేవారు. నేనైతే దుప్పటి ముసుగు తన్ని నిద్రపోతుండేదాన్ని. నా నిద్ర మత్తు వదిలే లోపు రంగులు చల్లేయాలనుకునేవాళ్లు. కానీ, వాళ్లకి ఆ ఛాన్స్ ఇచ్చేదాన్ని కాదు. అందకుండా పరిగెత్తేదాన్ని. ⇔ అవునూ.. అసలు హోలీ అంటే మీకెందుకంత భయం? నాకు రంగులు పూసుకోవడం పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అందుకే వీలైనంతగా ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించేదాన్ని. కానీ, ఫ్రెండ్స్ ఊరుకుంటారా? వెతికి పట్టుకుని మరీ రంగులు పూసేసేవాళ్లు. ఏడ్చినంత పని చేసేదాన్ని. ఆ వెంటనే నవ్వు కూడా వచ్చేసేది. ⇔ రంగులు పూసుకోవడం ఎందుకు ఇష్టం ఉండేది కాదు? డ్రై కలర్స్ అయితే ఓకే. ఈ రంగు నీళ్లతోనే నాకు ప్రాబ్లమ్. బట్టలు తడిసిపోతాయ్. జుత్తు తడుస్తుంది. రంగు వదిలించుకోవడానికి నానా తిప్పలు పడాలి. ఒంటికి అతుక్కుపోయిన రంగు ఓ పట్టాన వదలదండీ బాబూ. ⇔ మరి... హోలీ స్వీట్స్ గురించి? అవి మాత్రం ఓ పట్టు పట్టేదాన్ని. మా అమ్మగారు బెస్ట్ కుక్. మామూలు వంటల నుంచి పిండి వంటల వరకూ... అన్నీ బాగా చేస్తారు. హోలీ అప్పుడు చేసే ఖీర్, మాల్పువా, గుజియా... అన్నీ ఇష్టమే. అప్పుడైతే డైటింగ్ ప్రాబ్లమ్ లేదు కదా. ఎన్ని స్వీట్లయినా లాగించేసేదాన్ని. ⇔ స్వీట్స్ అందరికీ పంచేవారా? కలర్స్ చల్లుకుంటూ ఆడటం ఇష్టం ఉండేది కాదు కానీ, స్వీట్స్ మాత్రం చాలా జోరుగా పంచేదాన్ని. మా వీధి వీధంతా నాకు ఫ్రెండ్సే. వాళ్లు పిండి వంటలు తెచ్చివ్వడం, నేను వెళ్లి ఇవ్వడం... భలే సరదాగా ఉండేది. ⇔ రంగుల పండగ కాబట్టి, మీకిష్టమైన రంగుల గురించి? గాళ్స్ కలర్ పింక్. అదంటే నాకు ఓ స్పెషల్ లవ్. ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టం. ఎల్లో కలర్ అంటే కూడా లవ్వే. ఎల్లో కలర్ విషయంలో నా ఫ్రెండ్స్ కొంతమంది నన్ను విపరీతంగా ఆటపట్టించేవారు. ‘ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో’ అనేవాళ్లు. ఎల్లో గురించి ఎవరేమన్నా... నాకు అదంటే ఇష్టమే. వైట్ కలర్ అన్నా ఇష్టమే. బట్ హోలీ రంగుల్లో వైట్ ఉండదు కదా. కానీ, మన మనసు మాత్రం అలా ఉండాలి. ⇔ రంగుల గురించి కొన్ని విషయాలు చెప్పండి? ఒక్కో రంగుకి ఒక్కో మూడ్ ఉంటుంది. దాని గురించి నేను వివరంగా చెప్పలేను కానీ, నా మూడ్, క్లైమెట్ని బట్టి నేను కలర్స్ సెలక్ట్ చేసుకుంటాను. బాగా ఎండగా ఉన్నప్పుడు లైట్ కలర్స్, వీలైతే ఎక్కువగా వైట్ డ్రెస్సులు వేసుకుంటాను. చల్లని వాతావరణానికి ముదురు రంగులు బాగా నప్పుతాయి. హోలీ అంటే ‘ఫెస్టివల్ ఆఫ్ కలర్స్’. ఈ సందర్భంగా అందరి జీవితం కలర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ⇔ సినిమాల్లో మీరు చేసిన హోలీ సీన్స్ గురించి చెబుతారా? నా ఫస్ట్ మూవీ ‘అందాల రాక్షసి’లో హోలీ సీన్ ఉంది. పర్సనల్‌గా రంగు నీళ్లు ఇష్టం లేకపోయినా... ప్రొఫెషనల్‌గా చేయక తప్పలేదు. ఆ సీన్లో పిల్లలు నా మీదకు రంగులు చల్లడానికి వస్తుంటే, నేను వద్దంటూ మొహానికి చేతులు అడ్డం పెడుతూ, వెనక్కి వెనక్కి వెళుతుంటాను. రియల్ లైఫ్‌లో కూడా అలానే చేసేదాన్ని. అందుకే ఆ సీన్ చేసేటప్పుడు నా చిన్నప్పటి విశేషాలు గుర్తొచ్చాయి. నీళ్లల్లో తడిచే సీన్లు చేయడం కష్టం. తడవడం, కాసేపటికి బట్టలు ఆరిపోవడం, మళ్లీ తడవడం... ఇదే తంతు. భలే గమ్మత్తుగా అనిపించింది. ‘భలే భలే మగాడివోయ్’లో కూడా ఇలాంటి సీన్ చేశాను. స్క్రీన్ మీద ఆ కలర్‌ఫుల్ సీన్స్ చూసినప్పుడు నేను ఫుల్లుగా ఎంజాయ్ చేసి, చేసినట్లే మీకు అనిపిస్తుంది. అంతా యాక్టింగ్. చెప్పాను కదా... రంగు నీళ్లు ఇష్టం ఉండదని. ⇔ హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి, డెహ్రాడూన్‌ని మిస్సవుతన్నట్లు అనిపిస్తోందా? తెలుగు సినిమాలు చేస్తూ దాదాపు హైదరాబాద్‌లోనే ఉంటున్నాను కదా. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా పండగలప్పుడు మాత్రం మా ఊరు గుర్తొస్తుంటుంది. ఆ రోజులే వేరు అనిపిస్తుంది. ⇔ హోలీ ఆడబోయే వాళ్లకు మీరిచ్చే సలహా? ఏ పండగైనా ముందు పిల్లలకే సలహా ఇస్తాం. పిల్లలూ జాగ్రత్తగా ఆడుకోండి. రంగు పొడులు కళ్ల మీద పడకుండా చూసుకోండి. ముక్కుకి మాస్క్ తగిలించుకోండి. కళ్లద్దాలు పెట్టుకుంటే కళ్లల్లో నీళ్లు పడవు. రంగు పొడులు కొనుక్కునేటప్పుడు మీరంతట మీరు వెళ్లొద్దు. పెద్దవాళ్లను తీసుకెళ్లండి. ఇక, పెద్దలకు చెప్పొచ్చేదేంటంటే... మీరు కూడా జాగ్రత్త సుమా. ఇప్పుడు కల్తీ పొడులు వస్తున్నాయట. ఆర్గానిక్ కలర్స్ కొంటే సేఫ్. ⇔ ఫైనల్లీ... ఈ ఏడాది మీ కెరీర్ ఎప్పటిలా కలర్ఫుల్గా ఉంటుందనిపిస్తోందా? యస్ అండీ. గత ఏడాది ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’... రెండూ పెద్ద హిట్. ఈ ఏడాది కూడా హిట్స్ గ్యారంటీ అనే నమ్మకం ఉంది. శర్వానంద్‌తో చేసిన ‘రాథ’ ఈ నెలాఖరున విడుదల కానుంది. మంచి సబ్జెక్ట్. నా పాత్ర బాగుంటుంది. వరుణ్ తేజ్ పక్కన చేస్తున్న ‘మిస్టర్’లోనూ నాది మంచి క్యారెక్టర్. నాగచైతన్యతో చేస్తున్న సినిమాలో కూడా మంచి పాత్రే. సో... కెరీర్ ఎప్పటిలా కలర్ఫుల్గా ఉంటుందనే నమ్మకం ఉంది. హోలీ సాంగ్స్... కొన్ని 1 సందెపొద్దు మేఘం (నాయకుడు) 2 కొట్టు కొట్టు కొట్టు రంగుతీసి కొట్టు (మాస్ ) 3 దిల్ దిల్ దివానా... (జెమిని) 4 రంగు రబ్బా రబ్బా... (రాఖీ) 5 హోలీ రంగోలీ హోలీ... హంగామా హోలీ (చక్రం) 6హరివిల్లే హోలీ (మహానగరంలో) 7హోలీ... హోలీ.. (శాడిస్టు) 8హోలీ.. హోలీ (దొంగోడి పెళ్లి) 9హోలీ.. హోలీ పండగల్లే ఉత్సాహమేదో ఉప్పొంగుతుంది నాలో.. (శ్రీ) హోలీ.. కేర్ హోలీ వేడుకలో చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోడానికి కొన్ని సూచనలు... ⇒ రంగులు చల్లుకునే ముందు జుట్టు, ముఖం, దేహానికి కొబ్బరినూనె రాసుకోవాలి. ఇలా చేస్తే దేహానికి అంటిన రంగులను వదిలించడం సులభం. ⇒ చేతి గోళ్లకు, కాలిగోళ్లకు నెయిల్‌పాలిష్ మందంగా వేయాలి. గోరు చుట్టూ ఉన్న చర్మానికి కూడా పాలిష్ రాయాలి. ట్రాన్స్పరెంట్ నెయిల్‌పాలిష్‌లు ఉన్నాయి. కాబట్టి మగవారు కూడా హోలీ ఆడే ముందు నిరభ్యంతరంగా నెయిల్‌పాలిష్ వేసుకోవచ్చు. ⇒ రంగులను వదిలించుకునేటప్పుడు చర్మం మంట పుడుతుంటే కాలమైన్ లోషన్ రాసుకోవచ్చు. ⇒ సాధ్యమైనంత వరకు పొడి గులాల్నే వాడాలి. ⇒ ఎండలో హోలీ ఆడితే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎండ పెరిగే లోపు ముగించాలి. ⇒ ఆర్గానిక్ కలర్స్‌నే వాడాలి. అవి చర్మానికి పట్టేసినా కూడా ఎటువంటి హాని కలిగించవు. ⇒ రంగులు పెదవులకు అంటకూడదు. కళ్లలోకి, ముక్కు రంధ్రాలలోకి రంగు వెళ్లినా ప్రమాదమే. కాబట్టి ఎవరికీ బలవంతంగా, మొండిగా ముఖానికి రాయడానికి ప్రయత్నించకూడదు. ⇒ హోలీ రంగులు చల్లుకోవడం పూర్తయిన వెంటనే శుభ్రంగా స్నానం చేయాలి. రంగు త్వరగా వదిలించుకోవాలనే తాపత్రయంలో మరీ వేడిగా ఉన్న నీటిని పోసుకోకూడదు. స్నానం తర్వాత చర్మం మంటపుడుతుంటే వెన్న లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ⇒ రంగులు వదలడానికి డిటర్జెంట్ సబ్బులను ఉపయోగించవద్దు. స్నానానికి వాడే జంటిల్ సోప్స్ మాత్రమే వాడాలి. ⇒ ఒంటిపై దద్దుర్లు, ఎర్రమచ్చలు, అలర్జీ వంటివి వస్తే డర్మటాలజిస్ట్‌ను కలవాలి. కళ్ల సంరక్షణకు... ⇒ రంగులు తళుకుమనేందుకు చమ్కీలు కలుపుతుంటారు. రంగులు, చమ్కీలు ఏవీ కళ్లలోకి వెళ్లకూడదు. కాబట్టి గాగుల్స్ లేదా ప్రొటెక్టివ్ గ్లాస్‌లను వాడాలి. ⇒ హోలీ గన్‌తో రంగు నీళ్లు చల్లుకునేటప్పుడు ముఖానికి గురిపెట్టకూడదు. తల మీద మరీ ఎక్కువ నీటిని చల్లినప్పుడు అవి కళ్లలోకి జారుతాయి. కాబట్టి ఆడేటప్పుడు రంగులు చల్లేవాళ్లు... చల్లించుకునేవాళ్ల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ⇒ కళ్లలోకి రంగు వెళ్లినట్లు గ్రహిస్తే వెంటనే పరిశుభ్రమైన నీటితో కంటిని కడగాలి. ⇒ నీళ్లతో కడిగిన తర్వాత కూడా కళ్లమంటలు అనిపించినా, కళ్లకు ఏ మాత్రం అసౌకర్యం అనిపించినా వెంటనే కంటి డాక్టర్‌ను సంప్రదించాలి. – డి.జి. భవాని -
విద్యార్థిని మింగిన హోలీ
టేకులచెరువు(బూర్గంపాడు) : పండగపూట ఆ ఇంట విషాదం నెలకొంది. హోలీ వేడుకల్లో పాల్గొన్న విద్యార్థిని ట్రాక్టర్ బలిగొంది. ఈ సంఘటన టేకులచెరువు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కువ్వారపు నాగేశ్వరరావు, నర్సమ్మ దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్(15) స్నేహితులతో కలిసి హోలీ ఆడుతున్నాడు. ఈ క్రమంలో మట్టి లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి విద్యార్థిని ఢీకొట్టింది. దీంతో కిందపడిన ప్రవీణ్ పైనుంచి ట్రాక్టర్ వెళ్లింది. తీవ్ర గాయాలైన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, ట్రాక్టర్ నడుపుతున్న తేజావత్ రవి కూడా ప్రవీణ్ స్నేహితుడే. ప్రస్తుతం ఇద్దరు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. ప్రవీణ్ మరణవార్త తెలిసిన తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఘటనా స్థలాన్ని ఏఎస్సై రామకృష్ణ పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని బూర్గంపాడు సివిల్ ఆస్పత్రికి తరలించి శవపంచనామా నిర్వహించారు. పలువురి సంతాపం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ప్రవీణ్ కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించి.. సంతాపం వ్యక్తం చేశారు. సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ కైపు రోశిరెడ్డి, సర్పంచ్ పాండవుల వినోద, పాండవుల దర్గయ్య తదితరులు సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. -
హోలీ వేళ.. మృత్యుకేళి
► ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల్ని మింగిన కృష్ణమ్మ ► మూడు కుటుంబాల్లో పెను విషాదం సాక్షి, విజయవాడ/వన్‌టౌన్/పటమట : ఆ ముగ్గురూ ప్రతిభావంతులైన విద్యార్థులు.. ఎప్పుడూ చదువుల్లో మేటిగా ఉంటారు. విజయవాడ వీఆర్ సిద్ధార్థలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. బుధవారం హోలీ వేడుక చేసుకుందామని మరో ముగ్గురు స్నేహితులతో కలసి కృష్ణానదికి వెళ్లారు. సరదాగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. సెల్ఫీలు తీసుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపారు. అప్పటివరకు నీటిలో కేరింతలు కొట్టినవారిలో ముగ్గురిని ఊహించని రీతిలో మృత్యువు కబళించింది. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన ఆయా కుటుంబాలతోపాటు వారు చదివే కళాశాలలో పెనువిషాదాన్ని నింపింది. మరణించిన ముగ్గురిలో ఇద్దరు తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం కావడంతో వారి రోదన చూపరులను కంటతడిపెట్టించింది. విజయవాడ నగరంలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన చింతలపూడి శ్రీకాంత్ (18), పటమటకు చెందిన దేవినేని సాయికృష్ణ (18), పోతన సుభాష్ (19) బాగా చురుకైన విద్యార్థులు. ఇంటర్లో 80 శాతానికి పైగా మార్కులు సాధించి కానూరులో బీటెక్ (ఐటీ) మొదటి సంవత్సరం చదువుతున్నారు. బుధవారం హోలీ రావడంతో మరణించిన ముగ్గురు తమ స్నేహితులు వి.గుణశేఖర్, సాకేత్ ఓజాకుమార్, పూర్ణసాయికిరణ్‌లతో కలిసి కృష్ణాతీరంలో పండుగ చేసుకోవాలని నిర్ణయించి ఉదయమే సీతానగరంలోని కృష్ణానదికి చేరుకున్నారు. రంగులు చల్లుకుంటూ, ఆనందోత్సాహలతో స్నానాలు చేయడానికి నదిలోకి దిగారు. మంచినీళ్ల సీసాతో ఆడుకుంటూ లోతు తెలియక నదిలోకి వెళ్లి మరణించి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు. అక్కరకు వస్తాడునుకుంటే.. ఒరేయ్ శ్రీకాంత్ లేవరా...నువ్వు నవ్వుతూనే పడుకున్నావు. నన్నూ చెల్లినీ ఆటపట్టించింది చాలు.. ఇక లేవరా... అంటూ చింతలపూడిశ్రీకాంత్ తల్లి బాలత్రిపుర సుందరి రోదించిన తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. కొత్తపేట బావిపంపుల సెంటర్ కొండ ప్రాంతంలో ఈ కుటుంబం నివాసముంటుంది. శ్రీకాంత్ తండ్రి చిన్నతనంలోనే వారిని వదిలి వెళ్లిపోయారు. అప్పటినుంచి తల్లి కష్టపడి పిల్లలిద్దరినీ చదివిస్తున్నారు. కొడుకు బీటెక్ పూర్తిచేసి చేతికి అందివస్తే తన కష్టానికి ఫలితం దక్కుతుందని అపురూపంగా చూసుకుంటూ చదివిస్తున్నారు. ఇలాంటి దుర్ఘటన వారి ఆశల్ని చిదిమేయడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్కగానొక్క కొడుకు అమ్మా.. స్నేహితులతో కలిసి ఆడుకుని వచ్చాక కాలేజీకి వెళ్తా.. అంటూ అమ్మకు బై బై చెప్పి వెళ్లిన దేవినేని సాయికృష్ణ విగతజీవిగా తిరిగిరావడంతో ఆ తల్లిదండ్రులు హృదయవిదారకంగా రోదిస్తున్నారు. చదువుల్లో మెరిక.. బాధ్యత తెలిసిన ఒక్కగానొక్క కొడుకు అంటే వారికి అమితమైన ప్రేమ. ఎంతో బాధ్యతగా, సున్నితంగా ఉండే కృష్ణ ఇలాంటి ఊహించని ఘటనలో మరణించాడనే వార్తను తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ తండ్రి వాసుదేవరావు పటమట కెనరా బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతని సోదరి కొంత కాలం కిందట వివాహం చేసుకొని అమెరికా వెళ్లిపోయింది. ఇక కొడుకును బాగా చదివించి అమెరికా పంపి మంచి ఉద్యోగంలో స్థిరపడితే చూడాలని తల్లిదండ్రులు ఎంతగానో ఆశ పడ్డారు. కాని విధి చిన్నచూపు చూసింది. చదువుల కోసం వచ్చి.. తన కుమారుడు పోతన సుభాష్ చదువు కోసం వారి కుటుంబం కృష్ణా జిల్లా శ్రీకాకుళం నుంచి విజయవాడ వచ్చి పటమటలో ఉంటున్నారు. సుభాష్‌ను, అతని సోదరిని చదివిస్తూ తల్లి లలిత ఇక్కడే ఉంటుండగా, భర్త శివాజీ ఉద్యోగరీత్యా వరంగల్‌లో ఉంటున్నారు.కొడుకు మృతి వార్త విని ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. ఒక్కడే కొడుకు కావడంతో చదివించి ప్రయోజకుడ్ని చేద్దామనుకుంటే అందనంత దూరానికి వెళ్లిపోయాడని రోదిస్తోంది. సుభాష్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులు, బంధువులు మృతదేహాన్ని శ్రీకాకుళం తీసుకెళ్లారు. 40 నిమిషాలకు వచ్చిన 108 ఫోన్ చేసిన 10 నిమిషాల్లో రావాల్సిన 108 వాహనం 40 నిమిషాల తర్వాత వచ్చింది. వాస్తవానికి నదిలో మునిగిపోయిన వారిలో సుభాష్ నదిలోనే మరణించాడు. మిగిలిన ఇద్దరినీ స్థానికులు రక్షించి కొనఊపిరితో ఒడ్డుకు తెచ్చారు. వీరిలో కృష్ణ 20 నిమిషాలు, శ్రీకాంత్ 30 నిమిషాలకుపైగా కొట్టుకొని మరణించారు. 108 వాహనం 10 నిమిషాల వ్యవధిలో వస్తే ప్రాణాలు దక్కేవని బంధువుల ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ సిద్ధార్థలో విషాదం కానూరు (పెనమలూరు) : ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి ఘటన కానూరు వీఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో తీవ్ర విషాదం నింపింది. కాలేజీలో సరదాగా ఉండే ఇంజనీరింగ్ మొదటి ఏడాది ఐటీ చదువుతున్న చింతలపూడి మనోజ్‌దార్గాసాయిశ్రీకాంత్, దేవినేని జయనాగసాయికృష్ణ,పోతన సుభాష్‌లు నదిలో మునిగి చనిపోయారనే వార్తను సహ విద్యార్థులు, అధ్యాపకులు జీర్ణించుకోలేకపోతున్నారు. హోలీ అయినప్పటికీ కళాశాల బుధవారం యథావిధిగా పనిచేసింది. ఆ ముగ్గురూ తరగతులకు హాజరైనా బతికేవారేమోనని మిత్రులు కంటతడి పెట్టారు. బాధ్యతతో ఉండాలి : డీన్ పాండురంగారావు ఇంజినీరింగ్ విద్యార్థులపై చాలా బాధ్యత ఉందని, వారు జీవితాన్ని తేలికగా తీసుకోరాదని డీన్ బావినేని పాండురంగారావు అన్నారు. విద్యార్థులపై తల్లితండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుంటారని, దీన్ని విద్యార్థులు గుర్తించాలని కోరారు. -
హోలీ వేళ.. మృత్యుకేళి
ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల్ని మింగిన కృష్ణమ్మ మూడు కుటుంబాల్లో పెను విషాదం వీఆర్ సిద్ధార్థలో సహచర విద్యార్థుల శ్రద్ధాంజలి విజయవాడ/వన్‌టౌన్/ పటమట : ఆ ముగ్గురూ ప్రతిభావంతులైన విద్యార్థులు.. ఎప్పుడూ చదువుల్లో మేటిగా ఉంటారు. విజయవాడ వీఆర్ సిద్ధార్థలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. బుధవారం హోలీ వేడుక చేసుకుందామని ఆరుగురు స్నేహితులు కృష్ణానది వద్దకు వెళ్లారు. సరదాగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. సెల్ఫీలు తీసుకుంటూ ఆనందోత్సాహాలతో గడిపారు. అప్పటివరకు నీటిలో కేరింతలు కొట్టినవారిలో ముగ్గురిని ఊహించని రీతిలో మృత్యువు కబళించింది. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన ఆయా కుటుంబాలతోపాటు వారు చదివే కళాశాలలో పెనువిషాదాన్ని నింపింది. మరణించిన ముగ్గురిలో ఇద్దరు తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం కావడంతో వారి రోదన చూపరులను కంటతడిపెట్టించింది. విజయవాడ నగరంలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన చింతలపూడి శ్రీకాంత్ (18), పటమటకు చెందిన దేవినేని సాయికృష్ణ (18), పోతన సుభాష్ (19) బాగా చురుకైన విద్యార్థులు. ఇంటర్లో 80 శాతానికి పైగా మార్కులు సాధించి కానూరులో బీటెక్ (ఐటీ) మొదటి సంవత్సరం చదువుతున్నారు. బుధవారం హోలీ రావడంతో మరణించిన ముగ్గురు తమ స్నేహితులు వి.గుణశేఖర్, సాకేత్ ఓజాకుమార్, పూర్ణసాయికిరణ్‌లతో కలిసి కృష్ణాతీరంలో పండుగ చేసుకోవాలని నిర్ణయించి ఉదయమే సీతానగరంలోని కృష్ణానదికి చేరుకున్నారు. రంగులు చల్లుకుంటూ, ఆనందోత్సాహలతో స్నానాలు చేయడానికి నదిలోకి దిగారు. మంచినీళ్ల సీసాతో ఆడుకుంటూ లోతు తెలియక నదిలోకి వెళ్లి మరణించి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు. అక్కరకు వస్తాడునుకుంటే.. ఒరేయ్ శ్రీకాంత్ లేఓరా...నువ్వు నవ్వుతూనే పడుకున్నావు. నన్నూ చెల్లినీ ఆటపట్టించింది చాలు.. ఇక లేవరా... అంటూ చింతలపూడిశ్రీకాంత్ తల్లి బాలత్రిపుర సుందరి రోదించిన తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. కొత్తపేట బావిపంపుల సెంటర్ కొండ ప్రాంతంలో ఈ కుటుంబం నివాసముంటుంది. శ్రీకాంత్ తండ్రి చిన్నతనంలోనే వారిని వదిలి వెళ్లిపోయారు. అప్పటినుంచి తల్లి వస్త్ర దుకాణంలో పనిచేస్తూ కష్టపడి పిల్లలిద్దరినీ చదివిస్తున్నారు. కొడుకు బీటెక్ పూర్తిచేసి చేతికి అందివస్తే తన కష్టానికి ఫలితం దక్కుతుందని అపురూపంగా చూసుకుంటూ చదివిస్తున్నారు. ఇలాంటి దుర్ఘటన వారి ఆశల్ని చిదిమేయడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్కగానొక్క కొడుకు అమ్మా.. స్నేహితులతో కలిసి ఆడుకుని వచ్చాక కాలేజీకి వెళ్తా.. అంటూ అమ్మకు బై బై చెప్పి వెళ్లిన దేవినేని సాయికృష్ణ విగతజీవిగా తిరిగిరావడంతో ఆ తల్లిదండ్రులు హృదయవిదారకంగా రోదిస్తున్నారు. చదువుల్లో మెరిక.. బాధ్యత తెలిసిన ఒక్కగానొక్క కొడుకు అంటే వారికి అమితమైన ప్రేమ. ఎంతో బాధ్యతగా, సున్నితంగా ఉండే కృష్ణ ఇలాంటి ఊహించని ఘటనలో మరణించాడనే వార్తను తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ తండ్రి వాసుదేవరావు పటమట కెనరా బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతని సోదరి కొంత కాలం కిందట వివాహం చేసుకొని అమెరికా వెళ్లిపోయింది. ఇక కొడుకును బాగా చదివించి అమెరికా పంపి మంచి ఉద్యోగంలో స్థిరపడితే చూడాలని తల్లిదండ్రులు ఎంతగానో ఆశ పడ్డారు. కాని విధి చిన్నచూపు చూసింది. చదువుల కోసం వచ్చి.. తన కుమారుడు పోతన సుభాష్ చదువు కోసం వారి కుటుంబం కృష్ణా జిల్లా శ్రీకాకుళం నుంచి విజయవాడ వచ్చి పటమటలో ఉంటున్నారు. సుభాష్‌ను, అతని సోదరిని చదివిస్తూ తల్లి లలిత ఇక్కడే ఉంటుండగా, భర్త శివాజీ ఉద్యోగరీత్యా వరంగల్‌లో ఉంటున్నారు.కొడుకు మృతి వార్త విని ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. ఒక్కడే కొడుకు కావడంతో చదివించి ప్రయోజకుడ్ని చేద్దామనుకుంటే అందనంత దూరానికి వెళ్లిపోయాడని రోదిస్తోంది. సుభాష్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులు, బంధువులు మృతదేహాన్ని శ్రీకాకుళం తీసుకెళ్లారు. -
మన రాష్ట్రంలో హోలీ సంబరాలు
-
మన దేశ హోలీ సంబరాలు
-
హోళీకి దూరమైన రాజకీయ నేతలు!
దేశవ్యాప్తంగా ప్రజలందరూ హోళీ రంగుల్లో మునిగి తేలుతుంటే ముగ్గురు నేతల మాత్రం వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇటీవల బాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి దిగుమతైన గుల్ పనాగ్, మరో నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లు వివిధ కారణాలతో హోళీ వేడుకలకు దూరంగా ఉన్నారు. నీటి కొరత కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున చంఢీఘడ్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్న గుల్ పనాగ్ ఇష్టమైన హోళీ పండగకు దూరంగా ఉన్నాను అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా సహజసిద్దమైన రంగులతో హోళీని ఎంజాయ్ చేయండి.. ముఖ్యంగా మహిళలు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని విజ్క్షప్తి చేస్తూ.. హోళీ శుభాకాంక్షలు తెలిపింది. సాంప్రదాయ పద్దతిలో బీహార్ లో లక్షలాది మంది హోళీ వేడుకల్లో మునిగి తేలారు. అయితే సరన్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలోని ఓ స్కూల్ లో మధ్యాహ్న భోజన తిని 23 మంది పిల్లలు చనిపోయిన ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హోళీ పండగకు దూరంగా ఉన్నారు. ఇప్పడు బట్టలు చింపుకునేలా ప్రతి ఏటా హోళీ ఆడే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కారణంగా ఈ సారి హోళీ పండగకు దూరంగా ఉన్నారు. -
వెండి తెరపై వన్నె తరగని రంగేళీ
రంగులు పండుగ హోలీ అంటే ఇష్టపడని వారుండరు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆటపాటలతో సాగే రంగుల కేళీ ఆడేందుకు అందరూ ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా పిల్లలు, యువతీ యువకులు రంగుల్లో తడిచిముద్దవుతారు. వెండి తెరపై కూడా హోలీకి సముచిత స్థానం కల్పించారు. రంగుల లోకంలో రంగుల పండుగకు పెద్దపీటే వేశారు. సినిమాల్లో హుషారుగా సాగిపోయే హోలీ పాటలు ప్రేక్షకులు ఆదరించి పట్టం కట్టారు. సమకాలిన సినిమా పాటల్లో హోలీ ప్రస్తావన పరిపాటిగా మారిందంటే ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రాఖీ' సినిమాలో ముందుగా వస్తుంది హోలీ రంగుల పాట. ‘రంగు రపరప అంటోంది రంగుబర్సే’ అంటూ హుషారైన స్టెప్పులతో రంగులు జల్లుకుంటూ సాగిపోతుందీ పాట. ‘కొట్టు కొట్టు కొట్టు...రంగు తీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉందిరా’ అంటూ 'మాస్' చిత్రంలో నాగార్జున ఆడిపాడారు. తనకెంతో పేరు తెచ్చిన 'ఖుషీ' సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా 'హోలీ... హులీల రంగ హెలీ' అంటూ స్టెప్పులేశారు. 'మురారి'లో మహేష్ బాబు ఇంట్రడక్షన్ పాటలో రంగుల్లో మునిగి తేలాడు. మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర'లో తన కుటుంబ సభ్యులతో హోలీ ఆడే సీన్ కన్నులపండువ ఉంటుంది. ఉదయ్‌కిరణ్-రిచా చావ్లా జంటగా ‘హోలీ’ పేరుతో ఓ ప్రేమకధా చిత్రమే వచ్చింది. ఉత్తరాది వారు ఘనంగా జరుపుకునే హోలీకి బాలీవుడ్ కూడా పెద్దపీట వేసింది. నాటి షోలే నుంచి నేటి రామ్ లీలా వరకు రంగుళ కేళీని ఏదో ఒక సందర్భంలో తెరపై ఆవిష్కరిస్తూనే ఉంది. ఆన్,కోహినూర్, గోదా, కటీ పతంగ్, సిల్సిలా సినిమాల్లో హోలీ పాటలు ప్రజాదరణ పొందాయి. మదర్ ఇండియా, షోలే సినిమాల్లో కీలక సన్నివేశాల్లో వచ్చే హోలీ పాటలు కథను ముందుకు నడిపించడంలో దోహదపడ్డాయి. నాటి నుంచి నేటి వరకు వెండితెరపై రంగుల పాటల వన్నె తరగలేదు. కొత్త సినిమాల్లోనూ హోలీ పాటలు వస్తూనే ఉన్నాయి. ఇకముందు కూడా వస్తుంటాయి. ఎందుకంటే పండుగ మాత్రమే కాదు ఆనందాల కేళీ!