హోలీ వేడుకల్లో తుపాకీ మిస్‌ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ చనిపోయాడు.
శివ్‌పురి: హోలీ వేడుకల్లో తుపాకీ మిస్‌ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ చనిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం శివ్‌పురిలో చోటుచేసుకుంది. రాజేంద్ర జాటవ్(38) రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో తోటివారితో కలిసి హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర తన సర్వీస్ రివాల్వర్‌తో గాలిలోకి మూడు సార్లు కాల్పులు జరిపాడు.
మూడోసారి ట్రిగ్గర్ నొక్కగా అది జామ్ అయింది. దీంతో ఆయన తుపాకీని పరిశీలిస్తుండగా అది ప్రమాదవశాత్తు పేలి బుల్లెట్ రాజేంద్ర తలలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన రాజేంద్రను వెంటనే ఆస్పత్రికి తరలించగా అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని జిల్లా సూపరింటెండెంట్ సునిల్ యాదవ్ తెలిపారు.