అరీనా సబలెంకాకు గాయం.. వింబుల్డన్ టోర్నీకి దూరం | Aryna Sabalenka Withdraws From Wimbledon 2024 With Shoulder Injury | Sakshi
Sakshi News home page

Wimbledon 2024: అరీనా సబలెంకాకు గాయం.. వింబుల్డన్ టోర్నీకి దూరం

Published Mon, Jul 1 2024 8:18 PM | Last Updated on Mon, Jul 1 2024 8:27 PM

Aryna Sabalenka Withdraws From Wimbledon 2024 With Shoulder Injury

వింబుల్డన్ -2024 నుంచి బెలారస్ టెన్నిస్ స్టార్‌, మూడో సీడ్ అరీనా సబలెంకా  వైదొలిగింది. భుజం గాయం కారణంగా సబలెంకా ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీకు దూరం కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మెయిన్ డ్రాలో సబలెంకా స్ధానాన్ని రష్యన్ టెన్నిస్ స్టార్ ఎరికా ఆండ్రీవాతో భర్తీ చేశారు. 

ఇక ఈ విషయాన్ని అరీనా సబలెంకా సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. గాయం కారణంగా వింబుల్డన్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు సబలెంక తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. "భుజం గాయం కారణంగా ఈ  ఏడాది వింబుల్డన్ టోర్నీ నుంచి తప్పుకున్నాను.

ఈ విషయాన్ని మీకు తెలియజేయాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. కానీ నా భుజం గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నొప్పితో బాధపడుతున్నప్పటకి ప్రతీ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను. 

వచ్చే ఏడాది ఇంతకంటే బలంగా తిరిగి వస్తానని మీకు మాటిస్తానని" ఎక్స్‌లో రాసుకొచ్చింది. కాగా వింబుల్డన్ టోర్నీ జూలై 1 నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం తొలి దశ పోటీలు జరుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement