రైలు ఢీ కొని విద్యార్థి మృతి.... అధికారుల తప్పిదమే అంటూ నిరసనలు | Karnataka Student Slipped On Track Hit By Moving Train | Sakshi
Sakshi News home page

రైలు ఢీ కొని విద్యార్థి మృతి.... అధికారుల తప్పిదమే అంటూ నిరసనలు

Published Mon, Aug 1 2022 3:51 PM | Last Updated on Mon, Aug 1 2022 3:53 PM

Karnataka Student Slipped On Track Hit By Moving Train - Sakshi

బెంగళూరు: కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో ఒక విద్యార్థి రైలు ఢీ కొని మృతి చెందింది. ఐతే ఈ ఘటన రైల్వే అధికారుల నిర్లక్యం కారణంగానే జరిగిందంటూ ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. ఈ మేరకు ప్రీతి పుట్టస్వామి అనే  విద్యార్థి ప్రభుత్వ కాలేజ్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌ చివరి సంవత్సరం చదువుతుంది. ఆమె తండ్రి ఆటోలో రైల్వే పట్టాల వద్ద దింపడంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆమె రైలు పట్టాలు దాటుతుండగా జారిపడటంతో అటుగా వేగంగా వస్తున్న రైలు ఢీ కొనడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందింది. ఐతే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ కట్టకపోవడంతోనే ఈ ఘటన జరిగిందంటూ స్థానికులు విద్యార్థులు పెద్ద ఎత్తున్న నిరసనలు చేప్టటారు. ఇది ముమ్మాటికి రైల్వే అధికారుల తప్పిదమేనని, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి కట్టాల్సిందేనంటూ...నిరసనలు చేశారు.

ఈ మేరకు నిరసనకారులు హాసన్‌-మైసూరు హైవేను దిగ్భందించడమే కాకుండా తీవ్ర ఆగ్రహంతో టైర్లను తగలబెట్టడం వంటి పనులు చేశారు. వాస్తవానికి ఇలా రైలు పట్టాలను దాటవద్దంటూ హెచ్చరించడమే కాకుండా, హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఐతే కళాశాలకు, మార్కెట్‌కు సమీపంలో ఉన్నందున నివాసితులు సులభంగా ఉంటుందని తరుచుగా ఈ రైల్వే ట్రాక్‌లను దాటి అవతలి వైపుకు వెళ్లిపోతుంటారు. ఇలా నిర్లక్య ధోరణితో రాంగ్‌రూట్‌లో రైలు పట్టాలను క్రాస్‌ చేసి ప్రాణాల పైకి తెచ్చుకోవడం బాధకరం.

(చదవండి: శివయ్య మీద పాట: సింగర్‌ ఫర్మానీపై ముస్లిం పెద్దల నారజ్‌.. హిందూ సంఘాల రియాక్షన్‌ ఇది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement