Crossing track
-
పగిడిపల్లిలో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి!
సాక్షి, హైదరాబాద్: క్రాసింగ్ సమయంలో ఇతర రైళ్లను ఆపేయాల్సిన పరిస్థితి ఉండటాన్ని ఈ మధ్య సీరియస్‌గా తీసుకున్న రైల్వేశాఖ.. ‘రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి’ల నిర్మాణంపై దృష్టి సారించింది. గత ఏడాది దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని విజయవాడ సెక్షన్ పరిధిలో గూడురు–మనుబోలు మధ్య 2.2 కిలోమీటర్ల నిడివితో ఇలాంటి వంతెనను నిర్మించారు. తాజాగా సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో పగిడిపల్లి స్టేషన్ సమీపంలో ఈ తరహా బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి నడికుడి మీదుగా గుంటూరు వైపు వెళ్లే రైళ్లు.. కాజీపేట మార్గాన్ని క్రాస్ చేసేచోట నిర్మించనున్నారు. వంతెన ఒక్కటే కాకుండా దానికి అనుసంధానంగా కొంత మేర అదనపు ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా రూ.180 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.రెండు మూడు మార్గాల సమస్య తీరేలా..ప్రస్తుతం సికింద్రాబాద్–కాజీపేట మధ్య, నడికుడి మీదుగా సికింద్రాబాద్–గుంటూరు మధ్య నిత్యం 450 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అందులో 150కిపైగా గూడ్స్ రైళ్లు ఉంటున్నాయి. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే రైళ్లు పగిడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత కాజీపేట మార్గాన్ని క్రాస్ చేసి మళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏదైనా రైలు నడికుడి వైపు క్రాస్ చేయాలంటే.. సికింద్రాబాద్–కాజీపేట మార్గంలోని రైళ్లను ఎక్కడో ఓ స్టేషన్లో కాసేపు నిలిపేయాల్సి వస్తోంది. ఇక భవిష్యత్తులో సికింద్రాబాద్–గుంటూరు మార్గాన్ని రెండు లైన్లకు విస్తరించనున్నారు. ఆ మార్గంలో ప్రయాణికులు, గూడ్స్ రైళ్ల సంఖ్య పెరగనుంది. ఇది సికింద్రాబాద్–కాజీపేట, సికింద్రాబాద్–గుంటూరు లైన్లను అనుసంధానించే మార్గం కావటం విశేషం. ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లకే పరిమితమైన ఈ మార్గంలో భవిష్యత్తులో ప్యాసింజర్ రైళ్లను తిప్పాలనే ప్రతిపాదన ఉంది. అప్పుడు పగిడిపల్లి వై జంక్షన్ వద్ద రైల్వే ట్రాఫిక్ బాగా పెరగనుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. క్రాసింగ్ వద్ద రైళ్లు జామ్ కాకుండా రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి (ఆర్‌ఓఆర్‌బీ)కి ప్లాన్ చేశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన రైల్ ఓవర్ రైలు బ్రిడ్జికి సంబంధించిన మార్గం మొత్తం ఐదున్నర కిలోమీటర్లు ఉంటుంది. ఇది సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో బీబీనగర్ స్టేషన్ దాటిన తర్వాత.. పగిడిపల్లి స్టేషన్‌కు 600 మీటర్ల ముందు మొదలవుతుంది. ప్రస్తుత లైన్‌కు అదనంగా మరో లైన్ అక్కడ మొదలవుతుంది. అది పగిడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత గుంటూరు వైపు మళ్లుతుంది. సికింద్రాబాద్–గుంటూరు లైన్‌లోని బొమ్మాయిపల్లి స్టేషన్ సమీపంలో ప్రధాన లైన్‌కు కలుస్తుంది. ఈ ఐదున్నర కిలోమీటర్ల లైన్లో 1,400 మీటర్ల మేర ఎలివేటెడ్ మార్గం ఉంటుంది. -
రైలు ఢీ కొని విద్యార్థి మృతి.... అధికారుల తప్పిదమే అంటూ నిరసనలు
బెంగళూరు: కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక విద్యార్థి రైలు ఢీ కొని మృతి చెందింది. ఐతే ఈ ఘటన రైల్వే అధికారుల నిర్లక్యం కారణంగానే జరిగిందంటూ ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. ఈ మేరకు ప్రీతి పుట్టస్వామి అనే విద్యార్థి ప్రభుత్వ కాలేజ్‌లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చివరి సంవత్సరం చదువుతుంది. ఆమె తండ్రి ఆటోలో రైల్వే పట్టాల వద్ద దింపడంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె రైలు పట్టాలు దాటుతుండగా జారిపడటంతో అటుగా వేగంగా వస్తున్న రైలు ఢీ కొనడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందింది. ఐతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టకపోవడంతోనే ఈ ఘటన జరిగిందంటూ స్థానికులు విద్యార్థులు పెద్ద ఎత్తున్న నిరసనలు చేప్టటారు. ఇది ముమ్మాటికి రైల్వే అధికారుల తప్పిదమేనని, ఫుట్ ఓవర్ బ్రిడ్జి కట్టాల్సిందేనంటూ...నిరసనలు చేశారు. ఈ మేరకు నిరసనకారులు హాసన్-మైసూరు హైవేను దిగ్భందించడమే కాకుండా తీవ్ర ఆగ్రహంతో టైర్లను తగలబెట్టడం వంటి పనులు చేశారు. వాస్తవానికి ఇలా రైలు పట్టాలను దాటవద్దంటూ హెచ్చరించడమే కాకుండా, హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఐతే కళాశాలకు, మార్కెట్‌కు సమీపంలో ఉన్నందున నివాసితులు సులభంగా ఉంటుందని తరుచుగా ఈ రైల్వే ట్రాక్‌లను దాటి అవతలి వైపుకు వెళ్లిపోతుంటారు. ఇలా నిర్లక్య ధోరణితో రాంగ్రూట్లో రైలు పట్టాలను క్రాస్ చేసి ప్రాణాల పైకి తెచ్చుకోవడం బాధకరం. (చదవండి: శివయ్య మీద పాట: సింగర్ ఫర్మానీపై ముస్లిం పెద్దల నారజ్.. హిందూ సంఘాల రియాక్షన్ ఇది!) -
మెట్రో రైలు కింద నలిగి మృతి
గురుగ్రామ్: ప్రమాదకరమని తెలిసి కూడా తొందరపాటు చర్యతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పట్టాలు దాటే క్రమంలో మెట్రో రైలు కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీలోని గురుగ్రామ్‌లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన భూరా సింగ్(40) మానేసర్‌లోని కసాన్ గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ మధ్య తన స్వగ్రామానికి వెళ్లిన అతను శనివారం తిరుగు ప్రయాణం అయ్యాడు. హూడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్లో దిగి బయటకు వెళ్లబోయాడు. అయితే స్టేషన్ నుంచి త్వరగా బయటపడాలన్న ఆలోచనతో ఎస్కులేటర్ మీదుగా కాకుండా పట్టాలు దాటేందుకు యత్నించాడు. ఈ క్రమంలో రైలు రావటం గమనించిన అతను ఆందోళనకు గురయ్యాడు. అతన్ని గమనించిన ఓ మహిళ ఫ్లాట్‌ఫాం పైకి లాగేందుకు యత్నించింది. కానీ, లాభం లేకపోయింది. జరగాల్సిన ఘోరం జరిగిపోయంది. రైలు కింద నలిగి అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. -
‘మెట్రో’ రూట్లో 106 పెడస్ట్రియన్ క్రాసింగ్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్ఎంఆర్) సంస్థ పిల్లర్ల మధ్యలో నిర్మిస్తున్న గోడపై నగర ట్రాఫిక్ విభాగం అధికారులు అధ్యయనం పూర్తి చేశారు. దీని నిర్మాణం నేపథ్యంలో మొత్తం 106 చోట్ల పాదచారులు రోడ్డు దాటేందుకు ఉపకరించే పెడస్ట్రియన్ క్రాసింగ్స్ ఏర్పాటు చేయాల్సి ఉందని గుర్తించారు. వీటిలో 49 ప్రాంతాల్లో ‘యూ’టర్న్స్ ఉంటాయి. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను హెచ్ఎంఆర్కు సమర్పిం చారు. దసరా తర్వాత ఆ సంస్థ పనులు చేపట్టే అవకాశం ఉందని ట్రాఫిక్ విభాగం చీఫ్ డాక్టర్ వి.రవీందర్ ‘సాక్షి’కి తెలిపారు. పాదచారుల పాట్లు ఎన్నో.. రాజధానిలో పాదచారుల పాట్లు అన్నీఇన్నీ కావు. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారిలో వీరి సంఖ్యే ఎక్కువ. మెట్రో నిర్మాణం నేపథ్యంలో నగరంలో ఫుట్ఓవర్ బ్రిడ్జ్‌లు పూర్తిగా కనుమరుగయ్యాయి. జీబ్రా క్రాసింగ్స్, పెలికాన్ సిగ్నల్స్ సైతం అవసరమైన స్థాయిలో లేవు. వీటికి తోడు మెట్రోరైల్ నిర్మిస్తున్న ‘అడ్డు గోడ’కొత్త సమస్యల్ని తెచ్చిపెట్టింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మెట్రో రైల్ మార్గం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఎలివేటెడ్ విధానంలో నిర్మించిన ట్రాక్ ప్రధాన రహదారి వెంటే ఉంటోంది. దీనికోసం డివైడర్ మధ్యలో పిల్లర్లు నిర్మించారు. ఇప్పుడు సుందరీకరణ పేరుతో హెచ్ఎంఆర్ మరో అడ్డుగోడను నిర్మిస్తోంది. పిల్లర్ల మధ్యలో డివైడర్‌కు అటుఇటు దాదాపు రెండున్నర అడుగుల ఎత్తులో గోడను నిర్మిస్తోంది. దీని మధ్యలో మట్టిని పోయడంతో పాటు ఆకర్షణీయంగా ఉండే మొక్కలు పెంచాలని ఆ సంస్థ యోచిస్తోంది. నాగోల్–హబ్సిగూడ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఈ నిర్మాణం సాగుతోంది. ఫలితంగా రోడ్డు దాటడానికి పాదచారులు, టర్న్స్ తీసుకోవడానికి వాహనచోదకులు ఎన్నో ఇబ్బందులు పడటంతో పాటు కిలోమీటర్లు చుట్టిరావాల్సి వస్తోంది. జీహెచ్ఎంసీతో కలసి ఠాణాల వారీగా.. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల వారీగా స్థానిక జీహెచ్ఎంసీ ఇంజనీర్లతో కలసి మెట్రో గోడల నిర్మాణంతో పాటు పాదచారులు రోడ్డు దాటేందుకు, వాహనాలు టర్న్స్ తీసుకునేందుకు ఎక్కడెక్కడ అవకాశం కల్పించాలనే దానిపై అధ్యయనం చేశారు. నగరంలో సరాసరిన ప్రతి 1.5 కి.మీ. దూరంలో మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఇవే ఫుట్ఓవర్ బ్రిడ్జ్లుగా ఉపకరిస్తున్నాయి. ఇవి మినహా మిగిలిన చోట్ల ప్రతి 300 మీటర్లకు ఒక చోట పాదచారులు రోడ్డు దాటేందుకు మొత్తం 106 పెడస్ట్రియన్ క్రాసింగ్ అవసరమని గుర్తించారు. వీటిలో 49 చోట్ల వాహనాల కోసం ‘యూ’టర్న్స్‌తో కూడి ఉంటాయి. ప్రత్యేక డిజైన్‌తో క్రాసింగ్స్ ఈ ప్రాంతాల్లో పాదచారులతో పాటు వాహనచోదకులకూ ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు నిశిత అధ్యయనం చేశారు. రాకపోకలు ఎక్కువగా సాగే జనావాస ప్రాంతాలు, ప్రభుత్వ/ప్రైవేట్ కార్యాల యాలు, మార్కెట్స్, మాల్స్, వాణిజ్య ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లారు. పాదచారులు రోడ్డు దాటేందుకు అనువుగా క్రాసింగ్స్, ప్లాట్‌ఫామ్స్‌తో పాటు 12 చోట్ల పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేసేలా నివేదిక రూపొందించారు. దీనికి సంబంధించి ఓ ప్రత్యేక డిజైన్ సైతం రూపొందించి హెచ్ఎంఆర్కు అందించారు. ఈ పనుల నిర్వహణ బాధ్యతల్ని ఆ సంస్థ నాలుగు ఏజెన్సీలకు అప్పగించింది. దసరా తర్వాత పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
తృటిలో జబల్పూర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద స్కూల్ బస్సును రైలు డీకొని చిన్నారుల మరణించిన ఘోర సంఘటన కళ్ల ముందు మెదులుతుండగానే.. రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో మరోసారి ఇలాంటి ప్రమాదమే జరిగింది. అదృష్టవశాత్తూ ఈసారి పెద్ద ప్రమాదమే తప్పింది. కాపాలేని రైల్వే క్రాసింగ్ వద్ద జబల్పూర్ ఎక్స్‌ప్రెస్ జేసీబీని డీకొంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దున గల కర్ణాటకలోని దొడ్డబళాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలవగా, రైలు ఇంజిన్ దెబ్బతింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.