
ఢిల్లీలోని ఓ మెట్రో స్టేషన్
గురుగ్రామ్: ప్రమాదకరమని తెలిసి కూడా తొందరపాటు చర్యతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పట్టాలు దాటే క్రమంలో మెట్రో రైలు కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీలోని గురుగ్రామ్‌లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన భూరా సింగ్(40) మానేసర్‌లోని కసాన్ గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ మధ్య తన స్వగ్రామానికి వెళ్లిన అతను శనివారం తిరుగు ప్రయాణం అయ్యాడు. హూడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్‌లో దిగి బయటకు వెళ్లబోయాడు. అయితే స్టేషన్ నుంచి త్వరగా బయటపడాలన్న ఆలోచనతో ఎస్కులేటర్ మీదుగా కాకుండా పట్టాలు దాటేందుకు యత్నించాడు. ఈ క్రమంలో రైలు రావటం గమనించిన అతను ఆందోళనకు గురయ్యాడు. అతన్ని గమనించిన ఓ మహిళ ఫ్లాట్‌ఫాం పైకి లాగేందుకు యత్నించింది. కానీ, లాభం లేకపోయింది. జరగాల్సిన ఘోరం జరిగిపోయంది. రైలు కింద నలిగి అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment