Delhi Metro stations
-
‘పోలో’కు ఢిల్లీ మెట్రోలో తొలి పోస్టింగ్..
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 4.0లో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు ఆరునెలల తర్వాత ఢిల్లీలో మెట్రో సేవలను పున:ప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించేవారు స్థానిక స్టేషన్లలో బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన శునకం ‘పోలో’ను కలవవచ్చు. ప్రత్యేక శిక్షణ నైపుణ్యాలు కలిగిన చురుకైన పోలోకు ఢిల్లీ మెట్రో స్టేషన్లలో తొలి పోస్టింగ్ లభించింది. ఇది స్థానిక స్టేషన్లలో భదత్రా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందితో కలిసి విధులు నిర్వహించనున్నది. (7 న మెట్రో పునఃప్రారంభం, చర్యలివే!) కాగా అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టడంలో ఈ జాతికి చెందిన శునకం ‘కైరో’ ప్రముఖ పాత్ర పోషించింది. అప్పటి నుంచి బెల్జియన్ మాలినోయిస్ జాతి కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇది ఏకధాటిగా 40 కిలోమీటర్లు పరిగెత్తగలదని శిక్షకులు తెలిపారు. వాసన పసిగట్టడం, దాడి చేయడం, కాపలాకాయడం వంటి మూడు విధులు నిర్వహించడం దీని ప్రత్యేకత. మిగతా జాతి కుక్కలైన జర్మన్ షెపర్డ్, లాబ్రడార్ వంటివి ఏకధాటిగా 4 నుంచి 7 కిలోమీటర్లు మాత్రమే నడుస్తాయని, అవి ఒక టాస్క్‌ను మాత్రమే చేస్తాయని చెప్పారు. చురుకైన బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన కుక్కను దేశ రాజధానిలో విధుల్లో నియమించడం ఇదే తొలిసారి. ఇక నుంచి ఢిల్లీ పరిధిలోని కీలక మెట్రో స్టేషన్లలలో ఇది కనిపించనున్నది. -
26న మెట్రో సేవల నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకల సందర్భంగా ఈనెల 26న ఢిల్లీ మెట్రో రైలు సర్వీసులకు కొన్ని చోట్ల పాక్షికంగా విఘాతం కలగనుందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఢిల్లీ పోలీసుల సూచనలకు అనుగుణంగా మెట్రో సేవలను భద్రతా కారణాల దృష్ట్యా పాక్షికంగా నిలిపివేస్తామని మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. లైన్ 2లో (హుడా సిటీ సెంటర్ -సమయ్‌పూర్ బద్లి) లైన్ 6లో (కశ్మీరీ గేట్-రాజ నహర్ సింగ్) రూట్లలో స్వల్ప మార్పులు చేశామని వెల్లడించింది. ఆయా రూట్లలో పలు మెట్రో స్టేషన్లను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మూసివేయనున్నట్టు తెలిపింది. ఇక పటేల్ చౌక్, లోక్‌కళ్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మూసివేయనున్నట్టు వెల్లడించింది. కాగా మెట్రో పార్కింగ్ సదుపాయాలన్నీ ఈనెల 25న ఉదయం ఆరు గంటల నుంచి 26 మధ్యాహ్నం 2 గంటల వరకూ మూసివేస్తారని తెలిపింది. -
మెట్రో రైలు కింద నలిగి మృతి
గురుగ్రామ్: ప్రమాదకరమని తెలిసి కూడా తొందరపాటు చర్యతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పట్టాలు దాటే క్రమంలో మెట్రో రైలు కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీలోని గురుగ్రామ్‌లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన భూరా సింగ్(40) మానేసర్‌లోని కసాన్ గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ మధ్య తన స్వగ్రామానికి వెళ్లిన అతను శనివారం తిరుగు ప్రయాణం అయ్యాడు. హూడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్లో దిగి బయటకు వెళ్లబోయాడు. అయితే స్టేషన్ నుంచి త్వరగా బయటపడాలన్న ఆలోచనతో ఎస్కులేటర్ మీదుగా కాకుండా పట్టాలు దాటేందుకు యత్నించాడు. ఈ క్రమంలో రైలు రావటం గమనించిన అతను ఆందోళనకు గురయ్యాడు. అతన్ని గమనించిన ఓ మహిళ ఫ్లాట్‌ఫాం పైకి లాగేందుకు యత్నించింది. కానీ, లాభం లేకపోయింది. జరగాల్సిన ఘోరం జరిగిపోయంది. రైలు కింద నలిగి అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. -
నేడు కొన్ని మెట్రో స్టేషన్లు రాత్రి 7.30గంటలకే బంద్
సాక్షి, న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా భద్రత రీత్యా రాజీవ్‌చౌక్, బారాకంభారోడ్, పటేల్‌చౌక్ మెట్రోస్టేషన్లను మంగళవారం రాత్రి 7.30 గంటలకే మూసి వేయనున్నట్లు డీఎంఆర్సీ అధికారులు తెలిపారు. రాత్రి 7.30 గంటల తర్వాత ఈ మెట్రో స్టేషన్లలో రాకపోకలకు వీలుండదు. ఆయా స్టేషన్లలో టిక్కెట్ల విక్రయాన్ని సైతం 7.15 గంటలకే నిలిపి వేయనున్నారు. అయితే లైన్-2 (హుడా సిటీసెంటర్-జహంగీర్‌పుర), లైన్-3 (ద్వారకా సెక్టార్-21 నుంచి నోయిడా సిటీసెంటర్, వైశాలి) రూట్ వెళ్లే ప్రయాణికులు రైళ్లు మారడానికి అవకాశం కల్పిస్తారు. మిగిలిన స్టేషన్లలో మాత్రం మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.