
సాక్షి, మైసూరు: అక్కను వేధిస్తున్నాడని సొంత బావను హతమార్చారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ఉదయగిరిలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. హతుడు ప్రైవేటు ఉద్యోగి మహమ్మద్ నురాన్ (36) కాగా, నిందితులు కలీం పాష, అజ్మల్ పాష, హలామత్ పాష, ఖదీర్ పాషా. వివరాలు.. మహమ్మద్ నురాన్ తన భార్యకు అక్రమ సంబంధం ఉందని నిత్యం వేధించేవాడు. దీనిపై అనేక పంచాయతీలు జరిగినా అతడు మానలేదు.
దీంతో బావమరదులందరూ కలిసి అతనిని ఇంట్లోనే తీవ్రంగా కొట్టిచంపారు. ముగ్గురు పారిపోగా, ఖదీర్ ఒక్కడు తన బావ చేతిని నరికి ఆ ముక్కను సంచిలో తీసుకుని ఉదయగిరి పోలీస్‌స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటనపై ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసి పరారైన వారి కోసం గాలింపు చేపట్టారు
Comments
Please login to add a commentAdd a comment