భార్య ప్రాణాలు తీసిన భర్త సోమరితనం  | Woman Suicide With Laziness Of Husband In Karnataka | Sakshi

వంటకు సరుకులు కూడా లేవు.. భార్య ప్రాణాలు తీసిన భర్త సోమరితనం 

Sep 17 2022 7:01 PM | Updated on Sep 17 2022 7:12 PM

Woman Suicide With Laziness Of Husband In Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు: భర్త సోమరిగా మారడంతో ఇల్లు గడవక, పిల్లలకు పూటకు ఇంత తిండి పెట్టలేక  భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాలలో చోటు చేసుకుంది. ముడిగండ లేఔట్‌లో రియాజ్, ఉమైజైబా(22) నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు ఉన్నారు. అయితే భర్త ఎలాంటి పనులకు వెళ్లకుండా కుటుంబ పోషణను పట్టించుకోలేదు.

కనీసం వంట వండుకునేందుకు కూడా సరుకులు లేవని, పిల్లలకు ఆహారం ఎలా పెట్టాలని భర్త వద్ద వాపోయినా ఫలితం లేకపోయింది. దీంతో మనో వేదనకు గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కొళ్లెగాల పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 
చదవండి: ప్రియుడితో భార్య షికారు.. వెంబడించి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్న భర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement