
ప్రతీకాత్మకచిత్రం
మైసూరు: ప్రేమజంట కేఆర్‌ఎస్ ఎడమ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతులను మైసూరు నగరంలోని మేటెగళ్లి లేఔట్‌లోని హళె పోలీస్ స్టేషన్ రోడ్డులో నివాసం ఉంటున్న నవీన్(20), నిసర్గ(19)గా గుర్తించారు. మృతులు ఇద్దరూ బంధువులే. కొన్ని సంవత్సరాలుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే తమ ప్రేమ విషయం పెద్దలకు తెలియకుండా గుట్టుగా ఉంచారు.
చదవండి: (వెంటపడ్డాడు.. నమ్మించాడు.. పలుమార్లు గదికెళ్లి కోరికలు..)
ఈక్రమంలో గతనెల 20న చామరాజనగర సమీపంలో ఉన్న ఒక గ్రామానికి చెందిన యువకుడితో నిసర్గకు వివాహం జరిపించారు. నిసర్గ డిసెంబర్ 1న ఇంటినుంచి బయటకు వెళ్లి నవీన్‌ను కలిసింది. బైక్‌పై కేఆర్‌ఎస్ వద్దకు వెళ్లారు. నిసర్గ తన చున్నీతో ప్రియుడిని నడుముకు కట్టుకుంది. ఇద్దరూ కలిసి కాలువలో దూకారు. రెండు రోజులుగా బైక్ నిలిపి ఉంచడంపై అనుమానం రావడంతో కేఆర్‌ఎస్ పోలీసులు వచ్చి ఆరా తీయగా ప్రేమజంట సంచరించినట్లు గుర్తించారు. కాలువలో గాలించగా శుక్రవారం ఉదయం ఇద్దరి మృతదేహాలు బయట పడ్డాయి. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment