Lovers commits suicide
-
విషాదంగా ముగిసిన లవ్‌స్టోరీ.. వాట్సాప్ చాటింగ్ చేసుకుని..
పాలకుర్తి(జనగామ జిల్లా): తమ ప్రేమకు పెద్దలు అడ్డు చెబుతారని భావించిన ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామశివారు భీక్యా నాయక్ గ్రామ పంచాయతీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. భీక్యా నాయక్ గ్రామ పంచాయతీకి చెందిన బాలిక (16), అదే తండాకు చెందిన గుగులోతు పాపా, టీక్యా దంపతుల కుమారుడు రాజు(22) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. రాజు కారు డ్రైవర్‌గా పని చేస్తుండగా, దీపిక ఇంటర్ చదువుతోంది. చదవండి: ఏమైందో ఏమో.. అన్నయ్య విదేశాలకు వెళ్లిపోవడంతో.. వీరి ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళనకు గురయ్యారు. తమ పెళ్లి జరగదని భావించిన ఇరువురూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి తండా శివారులోని పల్లె ప్రకృతి వనంలో ముందుగానే సిద్ధం చేసుకున్న పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో తండాలోని ఓ అమ్మాయిని ప్రేమించి ఆమె ఆత్మహత్యకు రాజు కారకుడయ్యాడని తండావాసులు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి రాజు, ఆ బాలిక వాట్సాప్ మెసేజ్‌లు చేసుకున్నారని, ఉద్దేశపూర్వకంగానే బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కూతురికి రాజు బలవంతంగా పురుగుమందు తాగించాడని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టానికి తీసుకెళ్లకుండా తండా వాసులు అడ్డుతగిలారు. పోలీసులు వారికి సర్దిచెప్పి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. -
ఆర్టీపీఎస్లో ప్రేమపాశం: ప్రియుడు ఆత్మహత్య.. ప్రియురాలి బలవన్మరణం
రాయచూరు రూరల్: ప్రేమ అనే రెండక్షరాలు కొన్ని జీవితాలను నిలబెడితే, కొన్ని జీవితాలను కబళిస్తున్నాయి. ప్రేమ వ్యవహారం ఇంజనీర్ దంపతులను, మరో యువతిని ప్రాణాలు తీసింది. రాయచూరు థర్మల్ కేంద్రం (ఆర్టీపీఎస్) మహిళా ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. శక్తి నగర్ పోలీసులు వివరాల మేర కు థర్మల్ కేంద్రంలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న పార్వతి (30) శనివారం రాత్రి ఆర్టీపీఎస్ కాలనీలోని నివాసంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. పెళ్లయిన వ్యక్తితో ప్రేమ.. విషాదం ఇదే వ్యవహారంలో కొన్ని నెలల వెనక్కు వెళ్తే, ఆర్టీపీఎస్లో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేసే సోమనాథ్ (32), పార్వతి ఒకే విభాగంలో ఉద్యోగం చేస్తుండడంతో పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. సోమనాథ భార్య వేద (29)కు ఈ విషయం తెలియడంతో జనవరి 14న బాగల్‌కోటలో పుట్టింటిలో ఆత్మహత్య చేసుకుంది. భార్య లేకుండా ఉండలేనంటూ సోమనాథ్ జనవరి 21 న ఆర్టీపీఎస్ కాలనీలో బలవన్మరణానికి ఒడిగట్టాడు. రాయచూరుకే చెందిన పార్వతి తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల కిందట మరణించారు. ఆమె అన్న ఆర్టీపీఎస్లో ఉద్యోగం చేస్తూ కన్నుమూయడంతో బీటెక్ చదివిన పార్వతికి 6 నెలల కిందట జూనియర్ ఇంజనీర్‌గా ఉద్యోగమిచ్చారు. తన వల్ల ఒక కుటుంబం నాశనమైందని పార్వతి మథన పడుతున్నట్లు సమాచారం. నా చావుకు ఎవరూ కారణం కాదు, నేను సోమనాథ్‌ను ప్రేమించాను, ఆయన లేకుండా ఉండలేను అని శనివారం రాత్రి డెత్‌నోట్ రాసిపెట్టి ఇంటిలో ఉరివేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ సిఐ హనుమరెడ్డి తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
చున్నీతో ప్రియుడిని నడుముకు కట్టుకుని.. కాలువలో దూకి..
మైసూరు: ప్రేమజంట కేఆర్ఎస్ ఎడమ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతులను మైసూరు నగరంలోని మేటెగళ్లి లేఔట్‌లోని హళె పోలీస్ స్టేషన్ రోడ్డులో నివాసం ఉంటున్న నవీన్(20), నిసర్గ(19)గా గుర్తించారు. మృతులు ఇద్దరూ బంధువులే. కొన్ని సంవత్సరాలుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే తమ ప్రేమ విషయం పెద్దలకు తెలియకుండా గుట్టుగా ఉంచారు. చదవండి: (వెంటపడ్డాడు.. నమ్మించాడు.. పలుమార్లు గదికెళ్లి కోరికలు..) ఈక్రమంలో గతనెల 20న చామరాజనగర సమీపంలో ఉన్న ఒక గ్రామానికి చెందిన యువకుడితో నిసర్గకు వివాహం జరిపించారు. నిసర్గ డిసెంబర్ 1న ఇంటినుంచి బయటకు వెళ్లి నవీన్‌ను కలిసింది. బైక్‌పై కేఆర్ఎస్ వద్దకు వెళ్లారు. నిసర్గ తన చున్నీతో ప్రియుడిని నడుముకు కట్టుకుంది. ఇద్దరూ కలిసి కాలువలో దూకారు. రెండు రోజులుగా బైక్ నిలిపి ఉంచడంపై అనుమానం రావడంతో కేఆర్ఎస్ పోలీసులు వచ్చి ఆరా తీయగా ప్రేమజంట సంచరించినట్లు గుర్తించారు. కాలువలో గాలించగా శుక్రవారం ఉదయం ఇద్దరి మృతదేహాలు బయట పడ్డాయి. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: (మీర్పేట్లో వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్) -
ప్రియురాలి మృతిని తట్టుకోలేక.. ప్రియుడు సెల్ఫీ సూసైడ్
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో ప్రేమికుల జంట బలవన్మరణానికి పాల్పడింది. ముందుగా మౌనిక అనే యువతి గురువారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా.. ప్రియురాలు మరణం తట్టుకోలేక మనస్తాపంతో ప్రియుడు పవన్ కూడా పురుగుల మందు తాగి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల వ్యధిలో ప్రేమికులిద్దరూ ప్రాణాలు వదలడంతో హుజూర్ నగర్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా పురుగుల మందు సేవిస్తూ ప్రియుడు పవన్ తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
లెమన్‌ట్రీ హోటల్ ఘటన: షాకింగ్ అంశాలు వెల్లడి
సాక్షి, గచ్చిబౌలి, బొంరాస్‌పేట: హైదరాబాద్‌లోని మాదాపూర్ లెమన్‌ట్రీ హోటల్లో జరిగిన హత్య, ఆత్మహత్యల ఘటనలో పలు అంశాలు బయటికి వచ్చాయి. చాలా రోజులుగా ప్రేమించుకుంటున్న రాములు, సంతోషి.. నెలన్నర కిందటే రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారని, కానీ ఈ విషయాన్ని కుటుంబాలకు తెలిపే అంశంగా గొడవ పడ్డారని తెలిసింది. ఈ క్రమంలో ఆమెను చంపేసి, తాను ఆత్మహత్య చేసుకోవాలని రాములు ముందే నిర్ణయించుకున్నాడని.. స్టార్ హోటల్‌కు తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడని సమాచారం. చిన్ననాటి స్నేహం నుంచి.. మాదాపూర్‌లోని లెమన్‌ట్రీ హోటల్లో గురువారం సాయంత్రం యువతి హత్య, యువకుడి ఆత్మహత్య ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నారాయణపేట జిల్లా హకీంపేటకు చెందిన జి.రాములు (25), వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం లగచర్లకు చెందిన ఈడిగి సంతోషి (25) ఇద్దరూ హకీంపేటలోని జెడ్పీ హైస్కూలులో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య నెలకొన్న స్నేహం తర్వాత ప్రేమగా మారింది. కులాలు వేర్వేరు కావడంతో ఇరు కుటుంబాల వారు పెళ్లికి అంగీకరించలేదు. ఈ విషయంగా చిన్న గొడవలు కూడా జరిగినట్టు తెలిసింది. దీనితో రాములు, సంతోషి విడిపోతామని తమ కుటుంబాలకు చెప్పారు. కానీ తరచూ కలుస్తూ వచ్చారు. నెలన్నర రోజుల కిందే ప్రేమ వివాహం చేసుకున్నా.. కుటుంబాలకు తెలియకుండా ఉంచారు. తాజాగా పెళ్లి విషయాన్ని తమ కుటుంబాలకు చెప్పే విషయమై ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చి గొడవకు దారితీసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రాములు ఆమెను చంపేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడని.. లెమన్‌ట్రీ హోటల్‌కు వెళ్లేప్పుడే బ్లేడ్‌ను తెచ్చుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. కాగా.. సంతోషి, రాములు మృతదేహలకు కుటుంబ సభ్యులు స్వగ్రామాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. -
ప్రేయసి గొంతుకోసి.. ప్రియుడి ఆత్మహత్య
హైదరాబాద్/ కోస్గి/బొంరాస్‌పేట: వారిద్దరివీ పక్కపక్క ఊర్లు.. చిన్నప్పటి నుంచీ కలిసి చదువుకున్నారు.. ఆమె ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతుండగా.. అతను రెండు కార్లు కొనుక్కుని ట్రావెల్స్ నడుపుతున్నాడు. లాక్డౌన్ సమయంలో సొంతూర్లకు వెళ్లినప్పుడు ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. కలిసి బతకాలనుకున్నారు. కానీ అంతలోనే ఆ యువకుడు ఆమెను హత్య చేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న లెమన్‌ట్రీ హోటల్లో ఈ దారుణ ఘటన జరిగింది. ఆ యువతి వికారాబాద్ జిల్లా బొంరాసుపేట మండలం లగచర్లకు సంతోషి (25) కాగా.. ఆ యువకుడు ఆ ఊరికి పక్కనే ఉన్న నారాయణపేట జిల్లా కోస్గి మండలం హకీంపేటకు చెందిన జి.రాములు (25). హత్య, ఆత్మహత్య దారుణాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. లాక్డౌన్లో ఇంటికి వెళ్లి..: హకీంపేటకు కిష్టయ్య, మొగులమ్మల కుమారుడు రాములు (25). సొంతంగా రెండుకార్లు కొనుగోలు చేసి హెదరాబాద్లో ట్రావెల్స్ నడుపుతున్నాడు. లగచర్లకు చెందిన ఈడిగి బాలమణి, ఈశ్వరయ్య దంపతుల ఐదో సంతానం సంతోషి (25). ఆమె కానిస్టేబుల్ పోస్టులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పరీక్షలకు సిద్ధమవుతోంది. కొంతకాలం హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంది. కరోనా లాక్డౌన్ సమయంలో స్వగ్రామానికి వెళ్లిన రాములు, సంతోష ప్రేమలో పడ్డారు. అయితే బుధవారం మధ్యాహ్నం వారిద్దరూ మాదాపూర్‌లోని లెమన్‌ట్రీ హోటల్ మూడో అంతస్తులో ఉన్న 317 నంబర్ గదిలో దిగారు. బుకింగ్ ప్రకారం గురువారం మధ్యాహ్నం గది ఖాళీచేసి వెళ్లిపోవాలి. కానీ మరో రోజు ఉంటామంటూ గడువు పెంచారు. గురువారం సాయంత్రం వారిమధ్య గొడవ జరిగింది. అటువైపుగా వెళ్తున్న ఒక రూమ్‌బాయ్ ఈ ఘర్షణ శబ్ధాలు విని.. హోటల్లో మిగతా సిబ్బందికి చెప్పాడు. చాలాసేపు ఎలాంటి అలికిడీ రాకపోవడంతో హోటల్ సిబ్బంది మారుతాళంతో గది తలుపులు తెరిచి చూశారు. బాత్రూమ్లో సంతోషి మృతదేహాన్ని, ఫ్యాన్‌కు వేలాడుతున్న రాములు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్లేడుతో గొంతు కోసి.. హోటల్‌కు వెళ్లిన పోలీసులు బాత్రూంలో రక్తపు మడుగులో వివస్త్రగా పడి ఉన్న సంతోషి మృతదేహాన్ని.. అక్కడినుంచి బెడ్ వరకు రక్తంతో కూడిన పాదాల గుర్తులు, రక్తం చుక్కలను గుర్తించారు. గదిలో ఇద్దరి మధ్యా గొడవ జరిగినప్పుడు ఆవేశంతో విచక్షణ కోల్పోయిన రాములు బ్లేడుతో సంతోషి గొంతు కోశాడని.. తర్వాత ఆమె చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. క్లూస్‌టీం బాత్రూమ్లో హత్యకు వినియోగించిన బ్లేడ్‌ను, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఆ గదిలో సంతోషికి చెందిన వివిధ పోటీ పరీక్షల పుస్తకాలు, ఓ ప్రైవేట్ ఈఎన్టీ ఆస్పత్రికి సంబంధించిన ఫైల్, ఆధార్ కార్డులు లభించాయి. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో హకీంపేట, లగచర్ల గ్రామాల్లో విషాదం అలుముకుంది. కొన్నాళ్లుగా కలిసి ఉంటూనే.. సంతోషి, రాములు ఇద్దరూ గతంలోనే ప్రేమ వివాహం చేసుకున్నారని.. కొంతకాలం హైదరాబాద్‌లో కలిసి ఉన్నారని హకీంపేట, లగచర్ల గ్రామాలకు చెందిన స్థానికులు తెలిపారు. ఇరు కుటుంబాల వారు అభ్యంతర పెట్టడంతో విడిగా ఉంటున్నారని తెలిపారు. కొన్నాళ్లుగా వారు సొంతూర్లలోనే ఉంటున్నారని.. కలిసి బతుకుదామని ఇటీవలే నిర్ణయించుకుని హైదరాబాద్‌కు వచ్చారని పేర్కొన్నారు. ఇంతలో ఏదైనా గొడవ జరిగి, ఈ దారుణానికి కారణమై ఉంటుందని తెలిపారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
-
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: ఎంత చెప్పినా వినలేదు!
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఓప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సిరికొండ మండలం పందిమడుగు గ్రామంలో రెండో రోజుల క్రితం ప్రేమికులు మనోవేదనతో బలవన్మరణానికి యత్నించారు. వీరిని కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ప్రియురాలు వందన మృతి చెందింది. ప్రియుడు సుబాష్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియో ప్రకారం.. పురుగుల మందు తాగిన అనంతరం ప్రేమికుల జాడ కనుగొన్న ఓ వ్యక్తి.. అక్కడకు చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించే యత్నం చేశాడు. సేవించిన పురుగుల మందు కక్కాలని సూచించగా ప్రేమికులిద్దరూ తిరస్కరించారు. అలాగే మొండికేసుకుని కూర్చుంటే చనిపోతారని హెచ్చరించినా పట్టించుకోలేదు. తాము చనిపోయేందుకు సిద్ధమని వారు ఆ వ్యక్తికి బదులిచ్చారు. కాగా సిరికొండ మండలం పందిమడుగు గ్రామానికి చెందిన వందన, చింతల్ తండాకు చెందిన సుభాష్ కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే సుభాష్‌కు 2 నెలల క్రితమే వేరే అమ్మాయితో వివాహం జరిగింది. తనను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడని యువతి సుభాష్‌ను నిలదీసింది. అనంతరం ఇద్దరు కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నిజామాబాద్‌లో ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, నిజామాబాద్: జిల్లాలోని నందిపేట్ మండలంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపుతోంది. కుద్వాస్‌పూర్ గ్రామానికి చెందిన సుకన్య సోమవారం తెల్లవారుజామున గ్రామంలోని తన ఇంటి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణ వార్త తెలిసిన వెంటనే ఐలపూర్ గ్రామానికి చెందిన ప్రియుడు ప్రేమ్‌కుమార్ తీవ్రమైన మనస్థాపానికి గురై గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రేమ జంట ఆత్మహత్యలపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
‘మమ్మల్ని క్షమించండి. విడిపోయి బతకలేం’
సాక్షి, సత్తెనపల్లి: ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని మనస్థాపానికి గురైన ప్రేమికులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్తెనపల్లి పట్టణంలోని స్వామి వివేకానంద నగర్లో సోమవారం వెలుగు చూసింది. పట్టణంలోని 14వ వార్డుకు చెందిన బోండాట ప్రదీప్తి (17) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. పట్టణంలోని 23వ వార్డుకు చెందిన దేవళ్ల కిరణ్‌కుమార్ అలియాస్ సాయి కిరణ్‌కుమార్ (21) తాపీ పనులు చేస్తుంటాడు. గతంలో ఇద్దరి ఇళ్లూ దగ్గరగా ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ఐదు నెలల క్రితం పెద్దలకు తెలియడంతో ఇరు కుటుంబాల పెద్దలు మందలించారు. మూడు నెలల క్రితం పట్టణ పోలీసు స్టేషన్లో యువతి తల్లి అరుణ ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్ కుమార్‌ను రాజమండ్రికి పంపారు. ఇద్దరూ దూరంగా ఉంటున్నప్పటికీ ఆదివారం రాత్రి 2.30 గంటల సమయంలో ప్రదీప్తి ఇంటి నుంచి బయటకు రాగా, కిరణ్‌కుమార్ రాజమండ్రి నుంచి వచ్చాడు. ఇదరూ కలిసి వివాహం చేసుకుని స్వామి వివేకానంద నగర్‌లోని చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘అమ్మ, నాన్న, అత్త, మామయ్య మమ్మల్ని క్షమించండి. మేము విడిపోయి బతకలేము.. అందుకే చచ్చి పోతున్నాం.. మా చావుకు ఎవరూ బాధ్యులు కాదు... అందుకే పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా చచ్చిపోతున్నాం.. మమ్మల్ని క్షమించండి’... అంటూ డి.సాయికిరణ్కుమార్, డి.ప్రదీప్తి పేర్లతో సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ సీఐ నరసింహారావు, ముప్పాళ్ల ఎస్సై నజీర్ బేగ్‌లు సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు
సాక్షి, హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మైసమ్మ గడ్డ తండా సమీపంలో గురవారం ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అబ్బాయి మృతి చెందగా అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండటంతో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అమ్మాయి పూడూరు కస్తురిబా గాంధీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అబ్బాయి చన్గోముల్ గ్రామానికి చెందిన మహేష్‌గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన చన్ గోముల్ పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. -
మరణంతో ఏకం.. ఒకే గోతిలో ప్రేమజంట ఖననం
సాక్షి, కథలాపూర్(కరీంనగర్) : బతికున్నప్పుడు ఏకం కాని ప్రేమజంట మరణంలో ఏకమయ్యారు. ప్రేమ పెళ్లికి అంగీకరించని పెద్దలు ఇద్దరినీ ఒకే గోతిలో పూడ్చిపెట్టి వారికి కన్నీటీ వీడ్కోలు పలికిన హృదయ విదారకర సంఘటన ఆదివారం కథలాపూర్ మండలంలోని రాజారాం తండాలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని రాజారాం తండాకు చెందిన భూక్య శిరీష, లకావత్ మహిపాల్ పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారు. శిరీష తల్లిదండ్రులు ఇటీవలే వేరే యువకుడితో పెళ్లి చేయడానికి నిశ్చితార్థం చేసి పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ప్రేమికులు ఇద్దరు తీవ్రమనస్తాపానికి గురయ్యారు. పెద్దలను ఎదురించలేక, ప్రేమ పెళ్లి చేసుకోలేక చావే శరణ్యమని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో కరీంనగర్లో చదువుతున్న మహిపాల్ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన శిరీష, మహిపాల్‌లు శనివారం సిరికొండ శివారులోని అటవీ ప్రాంతంలో ఒకే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరికి ఆదివారం బంధువులు, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపారు. ఇద్దరిని ఒకే గోతిలో ఖననం చేశారు. బతికున్నప్పుడు ఏకం కాని ప్రేమజంట చివరికి మరణంలో ఏకం కావడం, వారిద్దరిని కూడా ఒకే గోతిలో ఖననం చేసిన హృదయ విదారకర సంఘటన ప్రతీ ఒక్కరిని కలిచివేసింది. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలి మృతి
బీబీనగర్ (భువనగిరి) : వివాహానికి పెద్దలు అంగికరించలేదని మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘ టనలో ప్రియురాలి మృతి చెందగా.. ప్రియుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాదకర ఘటన బీబీనగర్ మండలం గూడూరులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన మేకల నవీన్ స్థానిక టోల్‌ప్లాజాలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బింగి స్లావణ్య(19) ఇంటర్ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటోంది. ఇద్దరి ఇళ్లు ఎదురెదురుగా ఉండడంతో నవీన్, స్లావణ్యల మద్య ఏర్పడిన స్నేహం ప్రేమగా చిగురించింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరి విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో పెళ్లి సంబధాలు చూడడం మొదలు పెట్టారు. దీంతో నవీన్‌కు ముందుగా పెళ్లి కుదరడం, ఆ తంతు పనులు జరుగుతుండడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రేమికులిద్దరూ ఆదివారం స్లావణ్య ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఘటనను గమనిం చిన స్థానికులు వారిని సిఇకంద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ స్లావణ్య సోమవారం మృతి చెందింది. నవీన్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా తన కూతురును నవీన్ ప్రేమ వేధింపులకు గురి చేయడంతోనే అత్మహత్యకు పాల్పడిందని స్లావణ్య తండ్రి నర్సింహ్మ బీబీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ సుధాకర్‌గౌడ్ తెలిపారు. -
ఏంకష్టం వచ్చిందో..!
ప్రేమజంట ఆత్మహత్య కలకాలం కలిసి ఉండాలనుకున్న ప్రేమజంటకు ఏంకష్టం వచ్చిందో తెలియదుగాని ఈ లోకం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. బలవన్మణానికి తెగించి విషాదాన్ని మిగిల్చారు. ఈ సంఘటన పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఓ లాడ్జిలో శనివారం వెలుగుచూసింది. చనిపోయినవారు ఒడిశా వాసులుగా పోలీసులు గుర్తించారు. రామచంద్ర బారికో(25) సుకంతి పారిక(17) తనువు చాలించినట్టు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా : కలసి బతకలేమని భావించారో.. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని అనుకున్నారో.. ఇంకేమి కష్టం వచ్చిందో గానీ.. ఆ బాధను ఎవరికీ పంచుకోలేక, ఇంకెవరికీ భారం కాలేక ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఎలానూ బతకలేమని నిర్ణయించుకుని.. మరణంలోనైనా కలసే ఉందామని భావించి ఒకరికొకరు హత్తుకుని తనువు చాలించారు. తల్లిదండ్రులకు, అయిన వారికి తీరని శోకాన్ని మిగిల్చి.. తిరిగిరాని లోకాలకు వెడలిపోయారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ బాలిక, ఐటీఐ చదివి కాంట్రాక్టు పనులు చేసుకుంటున్న యువకుడు కాశీబుగ్గలోని లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పర్లాఖిమిడి సంతతోటకు చెందిన లక్ష్మీబారికో, హరి బారికో కుమారుడు రామచంద్ర బారికో(25) సెంచూరియన్ యూనివర్సిటీలో ఐటీఐ పూర్తి చేశాడు. మహేంద్రగడ పంచాయతీలో కాంట్రాక్టు పనుల్లో చేరాడు. సమీపంలో ఉన్నటువంటి డెరబాకు చెందిన దుకా పైకా, రుషియా పైకాలకు ఆరుగురు కుమార్తెలు. ఇందులో నాలుగో కుమార్తె సుకంతి పైకా(17) 8వ తరగతి చదివి మానేసింది. అప్పటి నుంచి ఖాళీగా ఉంటోంది. చెల్లాగూడలో ఉన్నటువంటి తన అక్క ఇంటికి వెళ్లి వస్తుండేది. ఈ తరుణంలో రామచంద్ర బారికోతో పరిచయం పెరిగి, స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త.. ప్రేమగా మారి ఇద్దరు తరచూ రహస్యంగా కలుసుకునేవారు. రామచంద్ర తల్లి లక్ష్మీబారికో పర్లాఖిమిడిలో నివాసం ఉంటోంది. తండ్రి గతంలోనే మరణించాడు. అతని అన్న తారక బారికో టెక్కలి రైల్వేస్టేషన్లో పనిచేస్తున్నాడు. కాంట్రాక్టు పనుల్లో ఇబ్బందిగా ఉందని, పూణె వెళ్లి పనులు చూసుకుంటానని తన అన్నకు రూ.20 వేలు అడిగి రామచంద్ర గురువారం ఇంటి నుంచి వచ్చేశాడు. అటు సుకంతి పైకా కూడా గురువారం నుంచి ఇంటి వద్ద కనిపించలేదు. ఆమె కుటుంబ సభ్యులు గ్రామమంతా వెతికారు. తన అక్క వాళ్ల ఇంటికి వెళ్లింటుందని భావించారు. పలాస లాడ్జిలో దిగి.. ఇదిలా ఉండగా.. ఇంటి నుంచి వచ్చేసిన రామచంద్ర, సుకంతి పైకాలు గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై కాశీబుగ్గ పట్టణంలోని పాత జాతీయ రహదారి పక్కనే ఉన్న శంకర్ లాడ్జిలో దిగారు. పూణె వెళ్తున్నట్లు చెప్పి, గదిని అద్దెకు తీసుకున్నారు. రోజంతా అక్కడే ఉన్నారు. శుక్రవారం రాత్రి భోజనం పార్సిల్‌ను లాడ్జి గదిలోకి తీసుకెళ్లారు. శనివారం తెల్లవారుజామున 6 గంటలైనా బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బంది అనుమానం వచ్చి వారి గది వద్దకు వెళ్లి చాలాసేపు పిలిచారు. ఎంతకూ సమాధానం రాకపోవడంతో బలవంతంగా తలుపులు తొలగించి లోపలికి వెళ్లి చూశారు. ఇద్దరూ స్లాబ్ కొక్కేనికి చీరతో ఉరివేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. శనివారం ఉదయం డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ కె.అశోక్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పంచనామా అనంతరం రాత్రి 7 గంటల సమయంలో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే, ఇద్దరూ మరణించడానికి కారణాలను మాత్రం ఇరువైపుల కుటుంబ సభ్యులూ చెప్పలేకపోతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. -
ప్రేమికుల జంట ఆత్మహత్యాయత్నం
పుణ్యగిరి సమీపంలో ఘటన కుటుంబ సభ్యులకు ఫోన్‌ద్వారా సమాచారం మిత్రుల సాయంతో ఆస్పత్రిలో చేరిక శృంగవరపుకోట : వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక్కటవుదామనుకున్నారు. పెద్దలు అంగీకరించలేదు. ఇక కలసి బతకలేమనుకుని కలిసే చావాలనుకున్నారు. అంతే... క్రిమి సంహారక మందులు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అయితే సమాచారం తెలుసుకుని కొందరు వారిని ఆస్పత్రిలో చేర్చడంతో ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆస్పత్రి వర్గాలు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట పట్టణంలోని శ్రీనివాసకాలనీలో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యార్థిని మేడపాటి సత్యవతి, సెంటరింగ్ పనులు చేసే కోటపల్లి ప్రసాద్ ఉరఫ్ స్వామి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దల అంగీకారం లభించకపోవడంతో ఆత్మహత్యకు సిద్ధపడ్డారు. ఇద్దరూ పుణ్యగిరి ప్రాంతానికి వెళ్లి క్రిమిసంహారక మందు సేవించారు. వాంతులు చేసుకుని అపస్మారకస్థితికి చేరుకున్న వీరిద్దరినీ 4గంటల సమయంలో కాలనీ యువకులు బైక్‌లపై ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. డాక్టర్ శ్యామల ప్రాధమిక చికిత్స చేసి పరిస్థితి చేయిదాటడంతో మెరుగైన వైద్యంకోసం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేస్తున్నట్టు హెచ్‌సీ వెంకటరావు చెప్పారు. చివరి నిమిషంలో ఇళ్లకు సమాచారం స్థానికుల కథనం ప్రకారం సత్యవతి తన తండ్రికి ఫోన్ చేసి ‘నేను వైజాగ్ వెళ్లిపోయా, చనిపోతున్నా నా కోసం వెదకొద్దు’ అంటూ చెప్పింది. స్వామి తన యజమాని ధన భార్యకు ఫోన్ చేసి ‘అక్కా నేను విశాఖలో మా అక్క ఇంటికి వెళ్లాను. రెండు రోజులు పనికి రాను’ అంటూ తొలుత చెప్పాడు. మళ్లీ ఫోన్ చేసి ‘మేం పుణ్యగిరి కొండపై ఉన్నాం. పురుగుల మందు తాగేస్తున్నాం. చనిపోతున్నాం మాకోసం రావదు.్ద’ అంటూ చెప్పినట్టు తెలిసింది. వెంటనే కాలనీ యువకులు, వారి కుటుంబీకులు పుణ్యగిరికి పరుగెత్తారు. పుణ్యగిరి మెట్ల మార్గంలో అపస్మారక స్థితిలో ఉన్న వారిని బైక్‌లపై ఆస్పత్రికి చేర్చారు. -
చెట్టుకు ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య
తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం సిద్ధివారిపాలెం సమీపంలో చోటు చేసుకుంది. చెట్టుకు వెలాడుతున్న జంట మృతదేహలను చూసి స్థానికులు గురువారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని... మృతదేహలను చెట్టుపై నుంచి కిందకి దించారు. అయితే ప్రేమ జంట మృతదేహలు అప్పటికే కుళ్లిపోయినాయి. దాంతో ఆ మృతదేహలను పోలీసులు స్వాదీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ జంట వివరాల కోసం పోలీసులు స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. -
రైలు పట్టాలపై రెండు మృతదేహాలు లభ్యం
వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వేట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో రెండు మృతదేహాలు లభ్యం కావటం స్థానికంగా కలకలం రేపింది. ఇందులో ఒకరు రజిత అనే యువతి కాగా..మరొకరు ఇదే ప్రాంతానికి చెందిన ఇఫ్రాన్‌గా పోలీసులు గుర్తించారు. మరిపెడకు చెందిన రజితకు ఇటీవలే పెళ్లిచూపులు జరిగాయి. బంధువుల ఇంటికని వచ్చిన రజిత రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించింది. అటు మెకానిక్‌గా పని చేస్తున్న ఇఫ్రాన్ కూడా ఇదే ట్రాక్‌పై శవమై కనిపించాడు. వీరు చనిపోవడానికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని బంధువులు చెబుతున్నారు.