Crime News: Raichur Thermal Power Station Lovers Commits Suicide - Sakshi
Sakshi News home page

Raichur Crime: ఆర్టీపీఎస్‌లో ప్రేమపాశం: ప్రియుడు ఆత్మహత్య.. ప్రియురాలి బలవన్మరణం

Published Mon, Apr 11 2022 8:56 AM | Last Updated on Wed, Apr 13 2022 8:34 AM

Raichur Thermal Power Station Lovers Commist Suicide - Sakshi

డెత్‌ నోట్‌, పార్వతి (ఫైల్‌) 

రాయచూరు రూరల్‌: ప్రేమ అనే రెండక్షరాలు కొన్ని జీవితాలను నిలబెడితే, కొన్ని జీవితాలను కబళిస్తున్నాయి. ప్రేమ వ్యవహారం ఇంజనీర్‌ దంపతులను, మరో యువతిని ప్రాణాలు తీసింది. రాయచూరు థర్మల్‌ కేంద్రం (ఆర్టీపీఎస్‌) మహిళా ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకుంది. శక్తి నగర్‌ పోలీసులు వివరాల మేర కు థర్మల్‌ కేంద్రంలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న పార్వతి (30) శనివారం రాత్రి ఆర్టీపీఎస్‌ కాలనీలోని నివాసంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
 
పెళ్లయిన వ్యక్తితో ప్రేమ.. విషాదం 
ఇదే వ్యవహారంలో కొన్ని నెలల వెనక్కు వెళ్తే, ఆర్టీపీఎస్‌లో జూనియర్‌ ఇంజనీర్‌గా పనిచేసే సోమనాథ్‌ (32), పార్వతి ఒకే విభాగంలో ఉద్యోగం చేస్తుండడంతో పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. సోమనాథ భార్య వేద (29)కు ఈ విషయం తెలియడంతో జనవరి 14న బాగల్‌కోటలో పుట్టింటిలో ఆత్మహత్య చేసుకుంది. భార్య లేకుండా ఉండలేనంటూ సోమనాథ్‌ జనవరి 21 న ఆర్టీపీఎస్‌ కాలనీలో బలవన్మరణానికి ఒడిగట్టాడు. రాయచూరుకే చెందిన పార్వతి తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల కిందట మరణించారు.

ఆమె అన్న ఆర్టీపీఎస్‌లో ఉద్యోగం చేస్తూ కన్నుమూయడంతో బీటెక్‌ చదివిన పార్వతికి 6 నెలల కిందట జూనియర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగమిచ్చారు. తన వల్ల ఒక కుటుంబం నాశనమైందని పార్వతి మథన పడుతున్నట్లు సమాచారం. నా చావుకు ఎవరూ కారణం కాదు, నేను సోమనాథ్‌ను ప్రేమించాను, ఆయన లేకుండా ఉండలేను అని శనివారం రాత్రి డెత్‌నోట్‌ రాసిపెట్టి ఇంటిలో ఉరివేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ  సిఐ హనుమరెడ్డి తెలిపారు.  

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement