రూ.20పై మూడేళ్ల పోరాటం.. రిటైర్డు టీచర్‌కు దక్కిన విజయం | Three Years of legal war for Rs 20, Retd Teacher wins at Last | Sakshi
Sakshi News home page

రూ.20పై మూడేళ్ల పోరాటం.. రిటైర్డు టీచర్‌కు దక్కిన విజయం

Aug 10 2022 7:08 AM | Updated on Aug 10 2022 7:10 AM

Three Years of legal war for Rs 20, Retd Teacher wins at Last - Sakshi

రిటైర్డు ఉపాధ్యాయుడు సత్యనారాయణ   

సత్యనారాయణ 2019లో హనుమంతరాజు షాపులో 3 శారీ ఫాల్స్‌ను కొన్నాడు. ఒక్కోటి రూ.30 కాగా మొత్తం రూ.90 అవుతుంది. కానీ హనుమంతరాజు రూ.110 వసూలు చేశాడు. ఇందుకు బిల్లు కూడా ఇచ్చాడు. ఎందుకు ఎక్కువ తీసుకున్నావని సత్యనారాయణ ప్రశ్నించగా అతడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.

మైసూరు: సినిమా హాళ్లు, పర్యాటక ప్రదేశాల్లో వస్తువులను విచ్చలవిడి ధరలకు అమ్ముతుంటారు. గత్యంతరం లేక జనం కొంటూ ఉంటారు. కానీ ఎంఆర్‌పీ ధర కంటే వ్యాపారి రూ.20 అదనంగా తీసుకోవడంపై రిటైర్డు ఉపాధ్యాయుడు మూడేళ్లు న్యాయ పోరాటం చేసి చివరికి విజయం సాధించాడు. ఈ సంఘటన మైసూరులో జరిగింది.

వివరాలు.. సత్యనారాయణ 2019లో హనుమంతరాజు షాపులో 3 శారీ ఫాల్స్‌ను కొన్నాడు. ఒక్కోటి రూ.30 కాగా మొత్తం రూ.90 అవుతుంది. కానీ హనుమంతరాజు రూ.110 వసూలు చేశాడు. ఇందుకు బిల్లు కూడా ఇచ్చాడు. ఎందుకు ఎక్కువ తీసుకున్నావని సత్యనారాయణ ప్రశ్నించగా అతడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.

దీంతో సత్యనారాయణ జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేసి వ్యాపారి నిర్వాకానికి గాను రూ.61 వేల పరిహారాన్ని ఇప్పించాలని కోరాడు. ఇప్పటివరకు విచారణ కొనసాగింది. వ్యాపారి చేసింది తప్పని నిర్ధారణ కావడంతో ఫోరం అతనికి రూ.6,020 జరిమానా విధిస్తూ, ఆ సొమ్మును బాధితునికి ఇవ్వాలని తెలిపింది. 

చదవండి: (Chandana: పుట్టిన రోజు నాడే డెత్‌ నోట్‌ రాసి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement