
చందన
మైసూరు: కళాశాల హాస్టల్లో అధ్యాపకురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన చామరాజనగరలో చోటుచేసుకుంది. నగరంలోని జేస్‌ఎస్ కళాశాలలో సైన్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న చందన (26) ఆత్మహత్య చేసుకుంది. అవివాహిత అయిన చందన ఇక్కడి కళాశాల హాస్టల్లో ఉంటోంది.
మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో హాస్టల్ గది నుంచి బయటకు రాకపోవడంతో విద్యార్థులు కిటికి నుంచి చూడగా ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. తన చావుకు ఎవరూ కారణం కాదని చందన డెత్‌నోట్ రాసింది. అదే రోజు ఆమె పుట్టిన రోజు కావడం విశేషం. చందన తాలూకాలోని అంబళె గ్రామానికి చెందిన రేషన్ డీలర్ మహాదేవ స్వామి కుమార్తె. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చదవండి: (ఆమె కోసం ఎంతకైనా.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు భార్య..)
Comments
Please login to add a commentAdd a comment