Actress Chaitra Hallikeri Lodges FIR On Her Husband: తన భర్త వల్ల ప్రాణ హాని ఉందని ప్రముఖ నటి చైత్ర హలికేరి పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు తన భర్త, మామ కలిసి తన బ్యాంక్ అకౌంట్‌ను మిస్ యూస్ చేశారని ఆమె మైసూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు చైత్ర భర్త బాలాజీ పోత్రాజ్, మామపై(చైత్ర భర్త తండ్రి) ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. చైత్ర హల్లీకెరీ పలు కన్నడ సినిమాల్లో నటించింది. ‘గురుశిష్యారు’, ‘శ్రీ దానమ్మ దేవీ’ వంటి చిత్రాలతో ఆమె గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంతో మంగళవారం(మే 24న)భర్త బాలజీ పోత్రాజ్, మామ కలిసి తన బ్యాంక్ ఖాతాను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఆరోపించింది.
చదవండి: Viral Video: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్.. 20 కేజీల బరువు..
తనకు తెలియకుండానే ఆమె పేరుతో బ్యాంక్ నుంచి గోల్డ్ తీసుకున్నారని చైత్ర ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. అంతేకాదు వీరికి సౌత్ ఇండియా బ్యాంక్ మేనేజర్ సహకరించినట్లు చెప్పింది. ఈ విషయం తెలిసి వారిని నిలదీసినందుకు భర్త బాలజీ తనని హింసించినట్లు ఆమె పేర్కొంది. అంతేకాదు తన భర్త, మామ వల్ల ప్రాణ హాని ఉందని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని చైత్ర కోరినట్లు పోలీసులు తెలిపారు. ఇక చైత్ర ఫిర్యాదు మేరకు ఆమె భర్త, మామపై ఐపీసీ సెక్షన్ 468,406, 409, 420, 506 కింద కేసు నమోదు చేశామని, ప్రస్తుతం చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: బయటకు రాగానే యాంకర్ శివ రచ్చ, క్లాస్ పీకిన మహిళ పోలీస్
Comments
Please login to add a commentAdd a comment