
మైసూరు: తాగిన మైకంలో స్నేహితులు గొడవపడి ఒకరిని అమానుషంగా హత్య చేశారు. హనగోడిలోని బీసీ కాలనీలో ఈ ఘటన జరిగింది. మూడురోజుల కిందట కృష్ణ (33)ని అతని స్నేహితులు గోపాల, అశోక్‌లు ఫోన్ చేసి మారమ్మ గుడి వద్దకు పిలిపించారు. మద్యం తాగి ఏదో విషయమై ఘర్షణ పడ్డారు. కృష్ణను మిగతావారు కొట్టడంతో స్పృహ తప్పాడు. జేసీబీతో అక్కడే గుంతను తవ్వి ఊపిరి ఉండగానే కృష్ణను పాతిపెట్టారు. మరుసటి రోజున భర్త కనబడకపోవడంతో భార్య గ్రామపెద్దలకు ఫిర్యాదుచేయగా నిందితులు పరారయ్యారు. హుణసూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా గోపాల, అశోక్‌ను అరెస్టు చేశారు. మృతదేహాన్ని తీయించి పోస్టుమార్టం జరిపించారు.
చదవండి: (ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..)
Comments
Please login to add a commentAdd a comment