friends clashes
-
కలిసి మద్యం తాగారు.. ఊపిరి ఉండగానే పాతేశారు
మైసూరు: తాగిన మైకంలో స్నేహితులు గొడవపడి ఒకరిని అమానుషంగా హత్య చేశారు. హనగోడిలోని బీసీ కాలనీలో ఈ ఘటన జరిగింది. మూడురోజుల కిందట కృష్ణ (33)ని అతని స్నేహితులు గోపాల, అశోక్‌లు ఫోన్ చేసి మారమ్మ గుడి వద్దకు పిలిపించారు. మద్యం తాగి ఏదో విషయమై ఘర్షణ పడ్డారు. కృష్ణను మిగతావారు కొట్టడంతో స్పృహ తప్పాడు. జేసీబీతో అక్కడే గుంతను తవ్వి ఊపిరి ఉండగానే కృష్ణను పాతిపెట్టారు. మరుసటి రోజున భర్త కనబడకపోవడంతో భార్య గ్రామపెద్దలకు ఫిర్యాదుచేయగా నిందితులు పరారయ్యారు. హుణసూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా గోపాల, అశోక్‌ను అరెస్టు చేశారు. మృతదేహాన్ని తీయించి పోస్టుమార్టం జరిపించారు. చదవండి: (ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..) -
ఇదేం దోస్తానారా అయ్య: ఫ్రెండ్ షిప్‌డే నాడే దాడులు
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ఈత సరదా యువకుల మధ్య చిచ్చురేపింది. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ముగ్గురు గాయపడగా ఒక యువకుడు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక ఎన్టీటీపీఎస్ బూడిద చెరువు నుంచి వెలువడే నీళ్లు చఫ్టా ద్వారా కృష్ణానదిలో కలుస్తాయి. చఫ్టా వద్ద జాలువారే నీటిని వాటర్‌ఫాల్స్‌గా భావించి యువకులు ఈత కొట్టేందుకు వస్తుంటారు. ఆదివారం ఫ్రెండ్షిఫ్ డే కావడంతో అధిక సంఖ్యలో యువకులు అక్కడకు చేరుకున్నారు. బైక్‌ల విషయంలో మొదలై... స్టాండ్ వేసిన బైక్‌లు ఒకదానిపై ఒకటి పడటంతో ఇరువర్గాల మద్య గొడవ ప్రారంభమైంది. అప్పటికే మద్యం మత్తులో తూగుతున్న యువకులు ఘర్షణకు దిగారు. హైవే వద్దకు చేరుకునే సమయానికి యువకుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. తోపులాటతో ప్రారంభమై చివరికి కర్రలు, రాళ్లు, పడిగుద్దులతో ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ముఖ్యంగా ముగ్గురు యువకులను తీవ్రంగా చావబాదారు. కిలేశపురంలో యువకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. నగరానికి చెందిన యువకులు దేవిశెట్టి దివాకర్, కరమద్ది సాయి, కోట్ల అరుణ్, ముద్రబోయిన నాగేశ్వరరావు, తెనాలి శ్రావణ్‌కుమార్, తాసెట్టి శరత్, చలసాని నాగరాజు, షేక్ షాహీల్, బొమ్మశెట్టి కుమార్ పేద కుటుంబాలకు చెందిన వారు. చదువుల పేరుతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి సరదా కోసం వీరు చేస్తున్న పనులు తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చాయి. ఈ సంఘటనపై స్పందించిన సీఐ శ్రీధర్‌కుమార్ మాట్లాడుతూ.. కిలేశపురంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. ప్రస్తుతం వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రెండు వర్గాలపై కేసులు పెడతామన్నారు. 10 మంది అరెస్ట్... ఇప్పటి వరకు 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. మిగిలిన వారి కోసం విజయవాడ చిట్టినగర్, పాలప్యాక్టరీ ప్రాంతాల్లో గంజాయి స్థావరాల వద్ద గాలిస్తున్నామన్నారు. అక్కడ జరిగింది గ్యాంగ్‌వార్ కాదన్నారు. ఘటనలో పాతనేరస్తులు లేరని, ఒక్కరు కూడా చనిపోలేదని, స్థానికులు గొడవలో పాల్గొనలేదన్నారు. అందరూ నున్న, ప్రకాశ్‌నగర్, సింగ్‌నగర్ ప్రాంతాలకు చెందిన యువకులని వెల్లడించారు. -
నువ్వు ప్రేమిస్తున్న నీ మేనకోడలిని నేను ప్రేమిస్తున్నా..
సాక్షి, బంజారాహిల్స్: ‘నువ్వు ప్రేమిస్తున్న నీ మేనకోడలిని నేను ప్రేమిస్తున్నా.. నా కోసం నీ ప్రేమను త్యాగం చేయ్... లేకపోతే బాగుండదు’ అంటూ స్నేహితుడికి ఓ యువకుడు మెసేజ్ పెట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్నేహితుడు బ్లేడ్‌తో ఆ యువకుడి మెడపై గాట్లుపెట్టాడు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, బ్లేడ్‌తో దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... రహ్మత్‌నగర్ బంగారు మైసమ్మ టెంపుల్ వద్ద నివసించే సాయి చైతన్య(19) ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తున్న తన అక్క కూతురు(17)ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు. తమ ఇద్దరి ప్రేమకు సహకరించాల్సిందిగా స్నేహితులైన ఇద్దరు బాలురు (17)ను సాయిచైతన్య కోరాడు. అయితే, వారు చైతన్యను మోసగించి ఆ యువతితో ప్రేమాయణం నడిపిస్తున్నారు. అంతేకాకుండా నీ ప్రేమను త్యాగం చేయాలంటూ రెండు రోజుల క్రితం సాయి చైతన్యకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన చైతన్య ఎల్ఆర్ కిషోర్ స్కూల్ సమీపంలోని గ్రౌండ్‌కు వస్తే తేల్చుకుందామని వారిని హెచ్చరించాడు. దీంతో స్నేహితులతో పాటు చైతన్య గ్రౌండ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. సాయిచైతన్య తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో స్నేహితుల్లోని ఓ బాలుడి మెడపై గాట్లు పెట్టాడు. తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతున్న బాధితుడిని ఆస్పత్రిలో చేర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సాయి చైతన్యపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. తనను చంపేస్తానని బెదిరించడంతో ముందుగానే స్నేహితుడిని చంపేందుకు పథకం వేసి బ్లేడ్‌తో దాడి చేశానని నిందితుడు చైతన్య తెలిపాడు. చదవండి: బంజారాహిల్స్: ప్రేమిస్తావా.. చస్తావా.. చావాలా.. ! ఓయో రూమ్ తీసుకుందామనుకుంటే.. అంతలోనే! -
యువకుడి దారుణ హత్య
పహాడీషరీఫ్: స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ ఓ యువకుడి దారుణ హత్యకు దారి తీసిన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బార్కాస్, సలాల ప్రాంతానికి చెందిన హుస్సేన్ బిన్ అహ్మద్ సాదీ(30), ఇదే ప్రాంతానికి చెందిన చాంద్ వహ్లాన్, అలీనగర్‌కు చెందిన ఇఫ్తేకార్ స్నేహితులు. వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. చాంద్ వద్ద అజీజ్ అనే యువకుడు అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.గత కొద్ది నెలలుగా హుస్సేన్ అతడిని దూషిస్తున్నాడు. దీంతో అజీజ్ అతనిపై కోపం పెంచుకున్నాడు. ఈ నెల 2వ తేదీ రాత్రి నలుగురు కలిసి ఇఫ్తేకార్ ఇంట్లో విందు చేసుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాట పెరిగి గొడవకు కారణమైంది. దీంతో ఆగ్రహానికి గురైన అజీజ్ ఓడ్కా బాటిల్‌తో హుస్సేన్ తలపై మోదగా, చాంద్, ఇఫ్తేకార్ అతడిపై కుక్కర్ మూత, గ్రానైట్ రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆదివారం అర్ధరాత్రి పోలీసులకు సమాచారం అందడంతో వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ, బాలాపూర్ ఇన్స్పెక్టర్ వి.సైదులు, ఎస్సై నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడు హిజ్రా హత్య కేసులో నిందితుడు... చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నారన్న వదంతుల నేపథ్యంలో గత ఏడాది మే 26న చాంద్రాయణగుట్టలో హిజ్రాను హత్య చేసిన కేసులో మృతుడు హుస్సేన్ బిన్ అహ్మద్ సాదీ 5వ నిందితుడిగా ఉన్నాడు. హోటల్లో భిక్షాటన చేస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్ర మండలం, బండమీదిపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య, మరో ఇద్దరు హిజ్రాలను వెంటాడి గ్రానైట్ రాళ్లతో దాడి చేయడంతో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందగా...మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం హుస్సేన్ కూడా రాళ్లతో జరిగిన దాడిలోనే మృత్యువాత పడటం గమనార్హం. -
అమ్మాయిలు సప్లయ్ చేస్తాడంటూ..
కక్షసాధింపునకు వికృత చర్యలు స్నేహితుల మధ్య పొడచూపిన విభేదాలు తప్పుడు ప్రచారంతో స్టిక్కర్ల అతికింపు అమలాపురం : వారిద్దరూ ఒకే గ్రామానికి చెందిన స్నేహితులు. ఇద్దరి మధ్య అమ్మాయిల విషయమై వివాదం ఏర్పడింది. ఇద్దరి మధ్య కక్షలు పెరిగాయి. కక్ష సాధింపునకు ఇద్దరూ వేచి ఉన్నారు. ఓ స్నేహితుడు తన శత్రువుపై మరీ అడ్డదారులు తొక్కి వికృత చర్యలకు పాల్పడ్డాడు. ‘రిసార్ట్స్‌లో అమ్మాయిలు సప్లయ్ చేయబడును, అంటూ వివరాలకు తన శత్రువు పేరు రాసి ... అతడి ఫోన్లు నెంబర్లతో ఫ్లెక్సీల మాదిరిగా స్టిక్కర్లు ముద్రించి కోనసీమలోని బస్స్టేషన్లు, ముఖ్య కూడళ్లలో అతికించిన విషయం వివాదాస్పదమైంది. పోలీసు కేసులు, నిందితుల అదుపు వరకూ పరిస్థితులు దారి తీశాయి. సంబంధిత వివరాలను పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం కె. ఏనుగపల్లికి చెందిన బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న బోణం సాయిరామ్, నిమ్మకాయల శేషయ్య మధ్య తలెత్తిన వివాదం ఈ తప్పుడు స్టిక్కర్లతో అవాక్కయ్యే ప్రచారాలకు ఒడిగట్టారు. ఒకరినొకరు విష ప్రచారానికి తెర తీసుకున్నారు. చివరకు అమలాపురం బస్‌స్టేషన్‌లో అతికించి ఉన్న ఈ స్టిక్కర్‌ను సీఐ శ్రీనివాస్ గమనించి వీటి వెనుక ఉన్న రెండు వర్గాల స్నేహితుల బృందాల మధ్య జరుగుతున్న వార్‌గా గుర్తించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన సీఐ తీగ లాగితే డొంక కదలినట్లు రెండు స్నేహితులు బృందాలకు చెందిన పేర్లను సేకరించి వారిని మంగళవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బోణం సాయిరామ్ నాయకత్వంలో దాసరి అయ్యప్పనాయుడు బోణం ప్రసాద్, తోలేటి అరవింద్, కుంపట్ల సాయిరామ్లను, నిమ్మకాయల శేషయ్య నాయకత్వంలోని చేగొండి సాయిరామ్ తదితరులను పోలీ సులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీఐ శ్రీనివాస మాట్లాడుతూ ఆ రెండు వర్గాలకు సంబంధించిన వారు పరస్పరం ఇలాంటి వికృత చేష్టలకు ఒడిగట్టారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.