తొలిప్రేమ ఎంత మధురం
తొలిప్రేమ ఎంత మధురం
Published Thu, Oct 24 2013 1:09 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
తొలి ప్రేమ ఎంతో మధురమైనది. ఆ ప్రేమ సఫలం అయినా, విఫలం అయినా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ తొలి ప్రేమ మాధుర్యాన్ని ప్రధానాంశంగా చేసుకుని, సన్‌రైజ్ మూవీ ఆర్ట్స్ పతాకంపై చరణ్, బేబి అక్షర సమర్పణలో మంగిలిపల్లి సత్యనారాయణ, మంగిలిపల్లి నాగరాజు నిర్మించిన చిత్రం ‘ఫస్ట్ లవ్’. అంబటి గోపి దర్శకుడు. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన మహేంద్ర ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు.
అమితారావ్ కథానాయిక. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వచ్చే నెల ప్రథమార్ధంలో విడుదల చేయాలనుకుంటున్నాం. ఈ సినిమా కవితాత్మకంగా, కళాత్మకంగా, వినోదాత్మకంగా ఉంటుంది. నేటి తరం దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? అనే విషయాన్ని చర్చిస్తున్నాం. అన్ని వర్గాలవారు చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జీవన్ థామస్, కెమెరా: రాఘవ నూలేటి.
Advertisement
Advertisement