ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : మొదటిసారి ప్రేమలో పడటమన్నది ఓ ప్రత్యేమైన భావన. చాలా మంది తమ తొలి ప్రేమ మర్చిపోలేనిదని అంటుంటారు. 30 ఏళ్ల క్రితందైనా నిన్న,మొన్న జరిగిందానిలా గుర్తు చేసుకుంటుంటారు. ఓ అవకాశం వస్తే దాని గురించి మాట్లాడటానికి ఏ మాత్రం వెనుకాడరు. అయితే మొదటిసారి ప్రేమించిన వ్యక్తులను మర్చిపోలేమా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. ఓ ప్రముఖ మీడియా మొదటిప్రేమ గురించి కొంతమంది వ్యక్తులను ప్రశ్నించగా వారు ఏ మాత్రం ఆలోచించకుండా గతంలో ప్రేమించిన వారి గురించి గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం పెళ్లై పిల్లలు ఉన్నప్పటికి తొలిసారి ప్రేమించిన వ్యక్తి గురించి మాట్లాడటానికి జంకటం లేదు. ఇది ఆడ,మగ తేడాలు లేకుండా ఇద్దరి విషయంలో ఒకే రకమైన స్పందన కలిగివుంది. సదరు మీడియా ఢిల్లీకి చెందిన ఓ మహిళను ప్రశ్నించినపుడు ఆమె తన మొదటి ప్రేమను గుర్తుచేసుకుని ఆనందపడిపోయింది. తన ప్రేమను తెలుపటానికి ధైర్యం సరిపోకపోవటం వల్లే అది విఫలమైందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
దాదాపు 30 ఏళ్లు గడుస్తున్నా అతడు గుర్తున్నాడని చెప్పింది. ఏళ్లు గడుస్తున్నా ఆ ప్రేమ అలా గుర్తుండిపోవటానికి సైంటిఫిక్ కారణం లేకపోలేదు. కొత్తగా మనం నేర్చుకున్న విషయాలు ప్రేమ కావచ్చు, సైకిల్ తొక్కటం కావచ్చు అది ఏదైనా మన జ్ఞాపకాల్లోంచి చెరిగిపోవటం చాలా కష్టం. మన మెదడులో ఉన్న హిప్పోకాంపస్ అనే భాగం కారణంగా కొత్త అనుభవాలు, జ్ఞాపకాలు చివరి వరకు గుర్తుండిపోతాయి. మొదటిసారి ప్రేమలో పడటం, ముద్దు పెట్టుకోవటం వంటి భావోద్వేగ పూరిత జ్ఞాపకాలు మెదడులోని పలు భాగాల్లో నిక్షిప్తమై ఉంటాయని జర్నల్ న్యూరాన్ అనే సర్వేలో కూడా వెల్లడైంది. మన ఎమోషన్ మొదటి ప్రేమ తాలూకూ జ్ఞాపకాలను నిన్న, మొన్న జరిగినట్లుగా తాజాగా ఉంచుతుంది.
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment