ఒక ప్రేమలేఖ... ఓ గులాబీ పువ్వు! | Nayanthara tells about first love | Sakshi
Sakshi News home page

ఒక ప్రేమలేఖ... ఓ గులాబీ పువ్వు!

Published Tue, Nov 17 2015 12:42 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

ఒక ప్రేమలేఖ... ఓ గులాబీ పువ్వు! - Sakshi

ఒక ప్రేమలేఖ... ఓ గులాబీ పువ్వు!

అమ్మాయికైనా అబ్బాయికైనా తొలి ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే, ‘ఐ లవ్ యు’ అని మొదట ప్రపోజ్ చేసిన వ్యక్తిని జీవితాంతం మర్చిపోలేరు. నయనతారకు అలా జీవితాంతం గుర్తుండిపోయే అబ్బాయి ఒకడు ఉన్నాడు. ఈ బ్యూటీ కో-ఎడ్యుకేషన్ స్కూల్‌లో చదువుకున్నారు. అందుకని అబ్బాయిలందరితో స్నేహంగా ఉండేవారు. ఆ విషయం నయనతార చెబుతూ - ‘‘అమ్మాయిలతో ఎలా స్నేహంగా ఉండేదాన్నో అబ్బాయిలతో కూడా అలానే ఉండేదాన్ని.

ఒకే ఒక్క అబ్బాయి తప్ప మిగతావాళ్లందరూ నాతో అలానే ఉండేవాళ్లు. అప్పుడు నేను మూడో తరగతి చదువుతున్న రోజులు. నేను క్లాస్ గదిలోకి వచ్చేసరికే నా డెస్క్ కింద ఒక ప్రేమలేఖ, ఓ గులాబీ పువ్వు ఉండేవి. ఆ లేఖలో సంతకం ఉండేది కాదు. దాంతో ఎవరు రాశారో తెలియక తికమకపడేదాన్ని. చాలా భయం వేసేది. నా పక్కన కూర్చున్న నా ఫ్రెండ్‌కి ఈ విషయం చెప్పాను.

రోజుల తరబడి లవ్ లెటర్, పువ్వు దర్శనిమవ్వడంతో మా అమ్మకు చెప్పాను. స్కూల్‌కి వచ్చి మా అమ్మ కంప్లైంట్ చేశాక ఆ అబ్బాయి ఎవరో తెలిసింది. అతను ఏడో తరగతి అబ్బాయి. ప్రిన్సిపాల్ మేడమ్ పిలిచి, బాగా చీవాట్లు పెట్టారు. అసలా వయసు అబ్బాయికి ప్రేమ అంటే ఏంటో ఏం తెలుస్తుంది? ఆ విషయం ఇప్పుడు తల్చుకున్నా నాకు వింతగా ఉంటుంది’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement