![Kiara Advani drops some hot secrets about her personal life - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/14/Kiara-Advani111.jpg.webp?itok=09EenO-F)
తొలి ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మాట చాలామంది అంటారు. తాజాగా కియారా అద్వానీ కూడా అలానే అంటున్నారు. స్కూల్ డేస్‌లో కియారా ప్రేమలో పడ్డారట. అయితే ఈ వయసులో చదువు మీద దృష్టి పెట్టాలి.. ప్రేమా గీమా అని తిరగడానికి వీల్లేదని తల్లితండ్రులు చెప్పడంతో ఆ ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టారట. ‘‘ఫస్ట్ లవ్‌ని అంత సులువుగా మరచిపోలేం. ఎప్పుడు తలుచుకున్నా మధురంగానే ఉంటుంది. చిన్నప్పుడు ఒకరి మీద ఏర్పడ్డ ప్రేమ అలానే ఉండిపోతుంది’’ అన్నారు కియారా.
ఇదిలా ఉంటే.. హృతిక్ రోషన్ హీరోగా రూపొందనున్న ‘క్రిష్’ సిరీస్ ‘క్రిష్ 4’లో కథానాయికగా నటించే అవకాశం కియారాకి దక్కిందని సమాచారం. ఈ సినిమాలో ఇద్దరు నాయికలు ఉంటారట. ఒక నాయికగా కృతీ సనన్‌ని ఎంపిక చేయగా, లాక్ డౌన్ కారణంగా తారుమారైన షూటింగ్ తేదీల వల్ల ఆమె తప్పకున్నారట. ఆ స్థానంలో కియారాని ఎంపిక చేశారని బాలీవుడ్ టాక్. ‘క్రిష్’ 2, 3వ భాగాలలో హీరోయిన్‌గా నటించిన ప్రియాంకా చోప్రా కూడా ‘క్రిష్ 4’లో ఓ కథానాయికగా నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment