తలైవా ‘తొలిప్రేమ’ ముచ్చట.. వైరల్! | Rajinikanth reveals his school days love story | Sakshi
Sakshi News home page

తలైవా ‘తొలిప్రేమ’ ముచ్చట.. వైరల్!

Published Mon, Jan 8 2018 9:43 PM | Last Updated on Mon, Jan 8 2018 9:47 PM

Rajinikanth reveals his school days love story - Sakshi

కౌలాలంపూర్: ఇటీవల రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ రజనీ చెప్పిన విషయం ఏంటంటారా.. తలైవా తొలిప్రేమ ముచ్చట్లు మరి. ఇంకేం.. అభిమానులు రజనీ చెప్పిన పాత జ్ఞాపకాలను షేర్ చేసుకుంటున్నారు.

సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ (ఎస్ఐఏఏ) వేడుకలు మలేషియాలో జరుగుతున్నాయి. నడిగర్ సంఘం భవనానికి సంబంధించి నిధుల సేకరణ కోసం ఈవెంట్ ను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న సంబర‍్భంగా తలైవా రజనీకాంత్ తాను తొలిసారి ప్రేమలో పడ్డ విషయాన్ని  వెల్లడించారు. ‘కర్ణాటకలో హైస్కూల్‌లో చదువుకునే రోజుల్లో ఓ విద్యార్థినిని ప్రేమించాను. తొలిప్రేమను అందరూ గెలవలేరు. నా పరిస్థితి అలాగే అయింది. ఫస్ట్ లవ్‌లో సక్సెస్ కాలేకపోయాను’ అంటూ నోరు విప్పారు. ఏకంగా సూపర్ స్టార్ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పారంటూ సోషల్ మీడియాలో రజనీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. లవ్‌లో ఫెయిలయ్యానని చెప్పిన తలైవా.. ఎంత అడిగినా ఆమె పేరు మాత్రం చెప్పలేదు.

రాజకీయాలపై ఓ ప్రశ్నకు రజనీ బదులిస్తూ.. 1996లోనే రాజకీయల్లోకి రానందుకు తాను ఒక్క క్షణం కూడా బాధ పడలేదన్నారు. కేవలం అందుకు కాస్త సమయం పట్టిందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. మరోవైపు రజనీ, స్టార్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘2.ఓ’. అమీ జాక్సన్ రజనీతో జతకట్టగా, విలన్ పాత్రలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఈ సమ్మర్‌లో మూవీ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement