హైదరాబాదీలు ముఖ్యంగా యువత అత్యధికంగా వింటున్న గాయకుల్లో సిద్ శ్రీరామ్ అగ్రగామిగా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ మ్యూజిక్ యాప్ స్పోటిఫై తాజా అధ్యయనంలో తేల్చింది. హైదరాబాద్ వాసుల సంగీతాసక్తులపై తమ డేటా విశ్లేషణ ఫలితాలను సంస్థ తాజాగా వెల్లడించింది. దీని ప్రకారం హైదరాబాదీలు అత్యధికంగా వినే గాత్రాల్లో తొలి స్థానం సిద్ శ్రీరామ్‌కు దక్కగా, ఆ తర్వాత స్థానాల్లో బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్, అనిరుథ్ రవిచందర్, శ్రేయా ఘోషల్ తదితరులతో పాటు కె.ఎస్.చిత్ర, అనురాగ్ కులకర్ణి, ప్రీతమ్, దేవిశ్రీ ప్రసాద్, ఎఆర్‌రెహ్మాన్ తదితర టాలీవుడ్ సంగీత ప్రముఖులూ ఉన్నారు. దివంగత మధుర గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మాణ్యం కూడా ప్రముఖ స్థానాన్ని దక్కించుకున్నారు.
చిట్టి నీ నవ్వంటే...కి టాప్ ప్లేస్..
అదే విధంగా హైదరాబాదీలు అత్యధికంగా విన్న/వింటున్న పాటల్లో చిట్టి నీ నవ్వంటే (జాతిరత్నాలు)ప్రధమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో జలజల పాతం నువ్వు (ఉప్పెన), ఒకేఒక లోకం నువ్వే(శశి), లాహె లాహె(ఆచార్య) తరగతి గది (కలర్ ఫొటో), హే ఇది నేనేనా (సోలో బతుకే సో బెటర్), మగువా మగువా (వకీల్ సాబ్), హోయ్‌నా హోయ్‌నా (నానిస్ గ్యాంగ్ లీడర్), కాటుక కనులె (ఆకాశం నీ హద్దురా), భలేగుంది బాలా (శ్రీకారం) పాటలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment