సింగర్ సిద్ శ్రీరామ్.. అతడి గాత్రంలోనే ఏదో మ్యాజిక్ ఉంది. అతడు పాడిన ఎన్నో పాటలు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేశాయి. 'టాక్సీవాలా'లో 'మాటే వినదుగా..', 'అల వైకుంఠపురములో' చిత్రంలో 'సామజవరగమన..', '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'లో 'నీలి నీలి ఆకాశం..', 'వకీల్ సాబ్'లో మగువా మగువా..', 'రంగ్ దే'లో 'నా కనులు ఎపుడు..', లేటెస్ట్‌గా 'పుష్ప'లో పాడిన 'శ్రీవల్లి' పాటలు ఎంతగానో పాపులర్ అయ్యాయి.. అంతేగాక ఆ సినిమాలన్నీ సక్సెస్ కావడం అతడికి ఎంతగానో కలిసొచ్చింది.
తన గాత్రంతో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేస్తున్న సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా? రూ.5 లక్షల నుంచి 7 లక్షల వరకు అందుకుంటాడట! నిజానికి సింగర్స్‌కు ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ ఉండే అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే తను పాడితే ఆ సాంగ్ ఏ రేంజ్‌లో సెన్సేషన్ అవుతుందో అర్థమైన నిర్మాతలు ఎంత డబ్బు ఇచ్చైనా సరే సిద్ శ్రీరామ్‌తోనే పాడించడానికి మొగ్గు చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment