Shekar Chandra Song Nijame Ne Chebutunna Crossed 3 Crore Views In Youtube, Deets Inside - Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న ‘నిజమే నే చెబుతున్నా’ సాంగ్‌

Published Tue, Jul 4 2023 3:31 PM | Last Updated on Tue, Jul 4 2023 3:48 PM

Shekar Chandra Song Nijame Ne Chebutunna Crass 3 Crore Views In Youtube - Sakshi

టాలీవుడ్‌లో సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర, సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌లది హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’ , ‘ప్రియతమా ప్రియతమా’ , 'మనసు దారి తప్పేనే' పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ రాబట్టి రికార్డులు సృష్టించాయి. తాజాగా వీరి కాంబోలో వచ్చిన నాలుగో పాట ‘నిజమే నే చెబుతున్నా’ కూడా యూట్యూబ్‌ని షేక్‌ చేస్తుంది. సందీప్ కిషన్ నటిస్తున్న 'ఊరు పేరు బైరవకోన'సినిమాలోని పాట అది. ఇప్పటికే ఈ సాంగ్‌కి 30 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇన్‌స్టా రీల్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. 

ఈ సందర్భంగా శేఖర్ చంద్ర మాట్లాడుతూ..‘నిజమే చెబుతున్నా’  సాంగ్ ఇంత సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సాంగ్ ని ఓన్  చేసుకుంటూ రీల్స్ చేస్తున్న అందరికీ థాంక్స్. రిలీజయ్యక చాలా మెస్సేజెస్ వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు వి ఐ ఆనంద్ గారికి స్పెషల్ థాంక్స్. ఆయనతో నాకు ఇది రెండో సినిమా. మా కాంబోలో ఇంకా మరిన్ని మంచి పాటలు వస్తాయి. అలాగే హీరో సందీప్ కిషన్ కి , నిర్మాతలకు థాంక్స్.  సిద్ శ్రీరామ్ పాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మా కాంబోలో మరిన్ని సాంగ్స్ రానున్నాయి.ఈ పాటకు శ్రీమణి  మంచి సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా శ్రీమణి కి కూడా థాంక్స్ చెప్తున్నా. ఈ సాంగ్ మూవీ రిలీజయ్యాక ఇంకా ఎక్కువ రీచ్ అవుతుందని నమ్ముతున్నాను.’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement