
Is Singer Sid Sriram Will Become A hero In The Movie: సింగర్ సిద్ శ్రీరామ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో యూత్‌లో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సింగర్ ఆయన. సిద్ శ్రీరామ్ పాట లేనిదే ఈ మధ్య సినిమాలు లేవనడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకున్నా ఆయన పాట మాత్రం సూపర్ హిట్ అవుతోంది. కొన్నిసార్లు అయితే సిద్ శ్రీరామ్ పాడిన పాటలతోనే సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది.
యూత్‌లోనూ సిద్ శ్రీరామ్‌కు మాంచి ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉండగా సిద్ శ్రీరామ్ గురించి ఇప్పుడో వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమాతో సిద్ శ్రీరామ్ వెండితెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే హీరోగా మారనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్ నచ్చడంతో హీరోగా చేయడానికి సిద్ శ్రీరామ్ కూడా అంగీకరించినట్లు కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.