పోటీ పడి విజయం సాధించండి | Competing Student Education Grab :sirivennela sitarama sastry | Sakshi
Sakshi News home page

పోటీ పడి విజయం సాధించండి

Published Sun, Dec 29 2013 2:57 AM | Last Updated on Thu, Jul 11 2019 5:07 PM

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పోటీపడి విజయం సాధించాలని ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి విద్యార్థులకు సూచించారు.

బాలాజీచెరువు (కాకినాడ), న్యూస్‌లైన్ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పోటీపడి విజయం సాధించాలని ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి విద్యార్థులకు సూచించారు. అలాగే సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను యువతకు తెలియజేయాల్సి బాధ్యత తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఉందని ఆయన అన్నారు. అభ్యుదయ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవ సందర్భంగా సూర్యకళామందిరంలో శనివారం నిర్వహిస్తున్న సంప్రదాయ సాంస్కృతిక వైభవ్ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. తొలుత సరస్వతీదేవి చిత్ర పటానికి పూలమాలలు వేశారు. అనంతరం మాట్లాడుతూ   ప్రస్తుతం యువత మోడిబారిపోయిన కొమ్మను మాత్రమే చూస్తోందని, చెట్టు మొదలుకున్న పచ్చదనం చూడటం లేదన్నారు. ఆధునికత మోజులో పడి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పూర్తిగా విస్మరిస్తున్నారన్నారు. సంక్రాంతి వచ్చిందంటే పల్లెలో అచ్చమైన పండుగ వాతావరణం నెలకొనేదని, ప్రస్తుతం ఆ వాతావరణం ఎక్కడా కనబడటం లేదన్నారు. అభ్యుదయ ఫౌండేషన్ చైర్మన్ బాదం మాధవరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకై సంగీతం, పద్యనాటకాలు వంటి కార్యక్రమాలు, ప్రముఖుల ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాహిత్యం పై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సిరివెన్నెల సమాధానమిచ్చారు.
 
‘నేను తినే తిండిలో సంఘం కనిపిస్తుంది’
కాకినాడ కల్చరల్, న్యూస్‌లైన్ : దేశానికి స్వాతంత్య్రమైతే వచ్చింది కాని... మాతృభాషను మాట్లాడే స్వాతంత్య్రాన్ని హరించింది. పాశ్చాత్య సంస్కృతి మోజు దేశ సంస్కృతిని పతనావస్థలో నడిపిస్త్తోంది.  అందుకే ఈ వ్యవస్థను నిగ్గదీసి అడగాలి...అగ్గితోటి కడగాలి... అంటున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి 
‘న్యూస్‌లైన్’తో పంచుకున్న విషయాలు మీకోసం...
 
ఈ మధ్యన సినిమా పాటలే ఎక్కువ రాస్తున్నారు?ఙఞ్చటజ: ప్రస్తుతం సినిమానే  అన్ని రకాల ప్రజల్లోకి త్వరగా వెలుతుంది. అందుకే సినిమా గేయాల ద్వారానే ప్రజా చైతన్యానికి నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. పుస్తకాలు రాసినా సామాన్యులు వాటిపై దృష్టి పెట్టడంలేదు.
 
 మీ పాటల్లో భావం తీక్షణంగా ఉంటుంది కారణం?ఙఞ్చటజ: ప్రతీ విషయంలోనూ లోతైన ఆలోచన చేస్తాను. ఉదాహరణకు మనం తినే అన్నం ఈ సంఘం పండించింది. అందుకే మనం ప్రతీ నిమిషం ఈ సమాజానికి రుణపడి ఉండాలి. అటుంటి ఆలోచనల్లోంచి పుట్టిందే నా సాహిత్యం.
 
 నేటితరం మాతృభాషను నిర్లక్ష్యం చేస్తోంది. మీ అభిప్రాయం?
మనకు జీవించడం నేర్పేది మాతృభాష, ప్రాథమిక భాషపై పట్టు సాధించినపుడే మనకు ప్రతీ విషయాన్ని అర్ధం చేసుకునే  అవగాహన పెరుగుతుంది.
 
సంస్కృతానికి ఆదరణ ఉందా?ఙఞ్చటజ: ఆదరణ కాదు కావాల్సింది గౌరవం కావాలి. వజ్రాన్ని భూమిలోనుంచి తవ్వనంత మాత్రాన అది రాయిగా రూపాన్ని మార్చుకోదు కదా.! 
 
 మన సంస్కృతికి పాశ్చాత్య సంస్కృతికి ప్రధాన తేడా ఏమైనా చెబుతారా?
మనకు భావాత్మక పునాదులు లేవు. వారికి జీవాత్మక పునాదులు లేవు. 
 
 సినిమాలు సమాజాన్ని పెడదోవ పట్టిస్తున్నాయంటున్నారు?ఙఞ్చటజ: సినిమా ఒక కాలక్షేపం మాత్రమే. ఒకప్పుడు కుటుంబ కథాచిత్రాలు మాత్రమే వచ్చేవి. ఆసినిమాలను చూసిన అప్పటి సమాజం ఒకే కుటుంబంలా జీవించాలని వారు అనుకోలేదు. కాబట్టి ప్రస్తుత సినిమాలను చూసి చెడిపోయేది ఏమీ లేదు. సమాజం మారినప్పుడే సినిమాలూ మారతాయి. కాబట్టి సినిమాలనుంచి సమాజాన్ని రక్షించాల్సిన అవసరంలేదు. 
 
 రాష్ట్ర విభజనపై మీ అభిప్రాయం?ఙఞ్చటజ: రాష్ట్ర విభజన రాజకీయ ప్రయోజనాలకు కాకుండా, ప్రజల, దేశ 
ప్రయోజనాలకు అనుగుణంగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement