'ఫిదా' న‌టుడి నిశ్చితార్థం | Sirivennela Sitaramasastri Son Raja Chembolu Gets Engaged | Sakshi
Sakshi News home page

న‌టుడి నిశ్చితార్థం: అమ్మాయి పేరు మాత్రం స‌స్పెన్స్‌

Aug 16 2020 4:13 PM | Updated on Aug 16 2020 7:40 PM

Sirivennela Sitaramasastri Son Raja Chembolu Gets Engaged - Sakshi

లాక్‌డౌన్ స‌మ‌యాన్ని టాలీవుడ్ సెల‌బ్రిటీలు బీభ‌త్సంగా వాడుకుంటున్నారు. ముందుగా నిర్మాత దిల్ రాజు రెండో వివాహం చేసుకుని త‌న జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఆ త‌ర్వాత నిఖిల్‌, జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్, న‌టుడు మ‌హేష్, హీరో నితిన్ పెళ్లిళ్లు జ‌రిగాయి. ఈ నెల‌లో రానా త‌న ప్రేయ‌సి మిహికా బజాజ్‌ను వివాహ‌మ‌డగా, మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌ నిశ్చితార్థం జ‌రుపుకున్నారు. తాజాగా ఇప్పుడు మ‌రో న‌టుడి ఇంట పెళ్లి సంద‌డి ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ పాట‌ల‌ ర‌చ‌యిత‌ సిరివెన్నెల సీతారామ‌శాస్త్ర్రి త‌న‌యుడు, న‌టుడు రాజా చెంబోలు త‌న నిశ్చితార్థం జ‌రిగిన‌ట్లు శ‌నివారం సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. (వైభ‌వంగా నిహారిక నిశ్చితార్థం)

"ఫిదా" సినిమాలో వ‌రుణ్ తేజ్‌కు అన్న‌య్య‌కు న‌టించిన రాజా త‌న ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ మేర‌కు ఫొటోల‌ను షేర్ చేస్తూ "ఇది 2020లోనే బెస్ట్ పార్ట్‌. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు నా కృత‌జ్ఞ‌త‌లు" అని రాసుకొచ్చారు. కాబోయే భార్య‌ పేరును మాత్రం వెల్ల‌డించలేదు. కాగా రాజా..'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'హ్యాపీ వెడ్డింగ్'‌, 'అంత‌రిక్షం', 'మిస్ట‌ర్ మ‌జ్ను', 'ర‌ణ‌రంగం' వంటి ప‌లు చిత్రాల్లో న‌టించారు. 'మ‌స్తీ' అనే వెబ్‌సిరీస్‌లోనూ క‌నిపించారు. (స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్‌ స్టయిలులే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement