నన్నయ పూర్వసాహిత్యంపై పరిశోధన అవసరం | nanayya sahityam ..sirivennela | Sakshi
Sakshi News home page

నన్నయ పూర్వసాహిత్యంపై పరిశోధన అవసరం

Published Thu, Mar 9 2017 11:27 PM | Last Updated on Tue, Nov 6 2018 4:19 PM

nanayya sahityam ..sirivennela

  • సినీగేయ రచయిత సిరివెన్నెల ‘ఆదికవి’ ప్రారంభమైన ‘వెయ్యేళ్ల 
  • తెలుగు సాహిత్య సమాలోచన’
  • రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) : 
    తెలుగు సాహిత్యంపై ఆదికవి నన్నయకు ముందు కాలంపై కూడా పరిశోధనలు జరపవలసిన అవసరం ఉందని సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. నన్నయ కాలం నాటికే  తెలుగు భాష ఎంతో పరిణతి చెంది మహాభారతం వంటి హృద్యకావ్యం రాసే స్థాయికి చేరుకుందంటే అప్పటికి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితమే తెలుగు భాష ఆవిర్భవించి ఉండవచ్చన్నారు.æ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ‘వెయ్యేళ్ల తెలుగు సాహిత్య సమాలోచన – నన్నయ నుండి నేటి వరకు’ అనే అంశంపై రెండు రోజులు జరిగే జాతీయ సదస్సును గురువారం ఆయన ప్రారంభించారు. తొలుత ఆయన కుమారుడు, సినీ సంగీత దర్శకుడు యోగీశ్వరశర్మతో కలిసి యూనివర్సిటీ ప్రాంగణంలోని ఆదికవి నన్నయ విగ్రహానికి పూలమాల వేసి, అంజలి ఘటించారు. మన ఆచార్య సాంప్రదాయాల కంటే సాహిత్యమే ఎంతో విశిష్టమైనదిగా పేర్కొన్నారు. వివిధ భాషలు, ప్రాంతాలతో మిళితమైన భారతదేశంలో నాగరికత, జాతీయత పరిఢవిల్లుతున్నాయన్నారు. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా వారిలో ఆప్యాయత, అనురాగాలు దర్శనమిస్తాయంటే అందుకు భాషాభిమానమే కారణమన్నారు. 
    నన్నయ పూర్వసాహిత్యంపై త్వరలో సదస్సు
    నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న జాతీయ సదస్సు తరహాలోనే సిరివెన్నెల సూచించి నట్టు నన్నయకు ముందు తెలుగు సాహిత్యం, భాష పరిస్థితులపై త్వరలోనే మరొక సదస్సు నిర్వహిస్తామన్నారు.  సినీగేయ రచయితగా  తెలుగు భాషలోని మాధుర్యాన్ని సిరివెన్నెల తన పాటల ద్వారా లోకానికి తెలియజేస్తున్నారని అభినందించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాణి సదాశివమూర్తి, కేంద్ర విశ్వవిద్యాలయ ఆచార్యులు జి.అరుణకుమారి, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ రిటైర్డ్‌ ఆచార్యులు ఎస్‌.రఘునాథశర్మ, తెలుగు యూనివర్సిటీ డీ¯ŒS ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ తెలుగు భాష గొప్పదనం, పరిశోధన అంశాలను వివరించారు. ప్రత్యేకంగా ముద్రించిన సాహిత్య సమాలోచన పత్రికను ఆవిష్కరించారు. డీ¯ŒS ఆచార్య ఎస్‌.టేకి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గజల్‌ శ్రీనివాస్, తెలుగు శాఖ సమన్వయకర్త తలారి వాసు, సదస్సు డైరెక్టరు డాక్టర్‌ తరపట్ల సత్యనారాయణ, సహాయ ఆచార్యులు డాక్టర్‌ కేవీఎ¯ŒSడీ వరప్రసాద్, డాక్టర్‌ లక్ష్మీనరసమ్మ పాల్గొన్నారు.
     
    విశ్వనాథని మించిన కవి ఉండబోరు
    తెలుగు సాహిత్యానికి విశ్వకవి విశ్వనాథ çసత్యనారాయణను మించిన కవి లభ్యమవుతారని తాను భావించడం లేదని సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. ‘వెయ్యేళ్ల తెలుగు సాహిత్య సమాలోచన –నన్నయ నుండి నేటి వరకు’ అనే అంశంపై ఆదికవి నన్నయ యూనివర్సిటీలో గురువారం ప్రారంభమైన జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంపై ఆదికవి నన్నయ పేరిట ఏర్పాటు చేసిన యూనివర్సిటీలో సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని ఒక అదృష్టంగా భావిస్తానన్నారు. కాగా  నన్నయకు పూర్వం గురించి కూడా పరిశీలన చేయవలసి ఉందన్నారు. సాహిత్యం కంటే నాటకం ఉత్కృష్టమైనదంటూ తెలుగు భాషాభివృది్ధకి సాంకేతికతను కూడా జోడించాలని సూచించారు. సినీ పరిశ్రమ ఒక ధర్మబద్ధమైన వ్యాపారం, బాధ్యతయుతమైన మాధ్యమంగా పేర్కొన్నారు. ప్రజల ప్రతిస్పందన కనిపించేది చలనచిత్రసీమలోనేనన్నారు. అయితే  «ఇటీవల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోందన్నారు. టీవీల ప్రభావం అనడానికి లేదని, ప్రతి వ్యక్తీ బిజీ లైఫ్‌తో సినిమాకు మూడు గంటల సమయాన్ని కూడా వెచ్చించలేకపోతున్నాడన్నారు. నిజానికి  మన సమాజంలో గొప్ప ఆలోచనాధోరణి ఉందని, ఇక్కడ సాహిత్యం ఎలా ఉండాలి, ఎటువంటి దాన్ని ఆదరిస్తారు అనే ప్రశ్న ఎప్పుడు జవాబు దొరకనిదిగానే మిగిలిపోతుందని అన్నారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement