Sai Pallavi Emotional On Sirivennela Seetharama Sastry Last Song: ప్రముఖ సినీ గేయ రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 1986లో ‘సిరివెన్నెల’చిత్రంతో ప్రారంభమైన ఆయన పాటల ప్రయాణం.. ‘శ్యామ్ సింగరాయ్’తో ముగిసింది. హీరో నాని, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సిరివెన్నెల రెండు పాటలు రాశారు. అందులో ఆయన రాసిన చివరి పాటను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇదే ఆయన రాసిన ఆఖరి పాట అని చిత్ర బృందం వెల్లడించింది. ‘సిరివెన్నెల’ అంటూ సాగడం ఈ పాట ప్రత్యేకత. నేడు ఈ పాటను విడుదల చేశారు శ్యామ్ సింగరాయ్ మూవీ యూనిట్. ఈ నేపథ్యంలో సిరివెన్నెల రాసిన ఈ చివరి పాటపై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది సాయి పల్లవి.
చదవండి: పుష్ప ట్రైలర్‌పై వర్మ షాకింగ్ కామెంట్స్
Sirivennela Seetharama Sastry Garu, Every word that you’ve ever written carries your soul and You’ll forever live in our hearts♥️#Sirivennela Lyrical Song from #ShyamSinghaRoy https://t.co/0RAM2tShHH@NameisNani @MickeyJMeyer @anuragkulkarni_ @Rahul_Sankrityn @NiharikaEnt
— Sai Pallavi (@Sai_Pallavi92) December 7, 2021
ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకు వస్తోంది. ఎప్పటికీ మీరు మా హృదయాల్లో జీవించే ఉంటారు సార్’ అంటూ సాయి పల్లవి ఎమోషనల్ అయ్యింది. ఈ పాట సినిమాకి హైలైట్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా థియేయటర్లోకి రానుంది. ‘నెల రాజునీ .. ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల’ అంటూ సాగే ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. తేనెలో తీయదనం సహజంగా ఉన్నట్టే, సిరివెన్నెల సాహిత్యంలో హాయిదనం ఉంటుందని ఈ పాట మరోసారి నిరూపించింది.
చదవండి: విడాకులపై సమంత కామెంట్స్, వైరల్ అవుతోన్న చై-సామ్ ఓల్డ్ ఫోన్ కాల్
Comments
Please login to add a commentAdd a comment