Sai Pallavi: Where Is Sai Pallavi What She Is Doing Now, Why No Movie Updates From her - Sakshi
Sakshi News home page

Sai Pallavi : సాయిపల్లవి ఎక్కడుంది? సినిమాలు ఉన్నట్టా లేనట్టా?

Published Thu, Mar 24 2022 1:41 PM | Last Updated on Thu, Mar 24 2022 3:47 PM

Where Is Sai Pallavi What She Is Doing Now - Sakshi

నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సహజమైన నటన, అద్భుతమైన డ్యాన్స్‌తో ఇటూ ప్రేక్షకులను, అటూ దర్శక-నిర్మాతలను ఫిదా చేస్తోంది ఆమె. ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఎక్క‌డా గ్లామ‌ర్ పాత్ర‌ల జోలికి పోకుండా కేవ‌లం న‌ట‌న‌కు ప్రాధాన్యత ఉన్న పాత్ర‌ల్లోనే న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది. సినిమా సినిమాకు త‌న న‌ట‌నను మెరుగు ప‌రుచుకుంటూ దూసుకుపోతోందీ చిన్న‌ది. పాత్ర కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఇక ఇటీవలె శ్యామ్‌ సింగరాయ్‌లో దేవదాసి పాత్రలో నటించి ఆకట్టుకుంది.

కొద్ది రోజుల క్రితం 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సందడి చేసింది. అయితే ఆ తర్వాత బయట ఎక్కడా కనిపించలేదు. ఆమె సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ కూడా ఏం లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో విరాటపర్వం మినహా మరే సినిమా లేదు. దీంతో అసలు సాయిపల్లవి ఇప్పుడేం చేస్తుంది అన్న సందేహం మొదలైంది.

శ్యామ్‌ సింగరాయ్‌ తర్వాత ఆమె సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్‌ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంత ఫ్యాన్‌ బేస్‌ ఉన్న హీరోయిన్‌ హఠాత్తుగా కనిపించకపోవడం, సినిమా అప్‌డేట్స్‌ ఏవీ ఇవ్వకపోవడంతో అసలు ఏం జరిగిందనే అనుమానం మొదలైంది. ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా పాత్ర నచ్చకపోతే సినిమాకు నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. ఈ కారణంగానే సినిమాలు చేయట్లేదేమో అంటూ  నెటిజన్లు భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement