గీత స్మరణం | song of the day from movie nuvvostavante nenoddantana | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Thu, Nov 28 2013 12:07 AM | Last Updated on Tue, Nov 6 2018 4:19 PM

పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా , అంత మారం ఏంటంటా మాట వినకుండా

పల్లవి :


 పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా     (2)
 అంత మారం ఏంటంటా మాట వినకుండా
 సరదాగా అడిగాగా మజిలీ చేర్చావా తీసుకుపో నీ వెంటా
 వస్తా తీసుకుపో నీ వెంటా...
 
 చరణం : 1
 
 నా సంతోషాన్నంతా పంపించా తనవె ంటా
 భద్రంగానే ఉందా ఏ బెంగపడకుండా
 తన అందెలుగ తొడిగా నా చిందరవందర సరదా
 ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా
 చినబోయిందేమో చెలికొమ్మ
   ఆ గుండెల గూటికి ముందే కబురీయవే చిలకమ్మా
 నీవాడు వస్తాడే ప్రేమా
   అని త్వరగా వెళ్లి నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మా
 తీసుకుపో నీ వెంటా... వస్తా తీసుకుపో నీ వెంటా...
 హే... పుటుక్కు జరజర డుబుక్కుమే     (2)
 
 చరణం : 2
 
 ఆకలి కనిపించింది నిన్నెంతో నిందించింది
 అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది
 నిద్దుర ఎదురయ్యింది తెగ చిరాగ్గా ఉన్నట్టుంది
 తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది
 ఏం గారం చేస్తావే ప్రేమా
 నువ్వడిగిందివ్వని వాళ్లంటూ ఎవరున్నారమ్మా
 ఆ సంగతి నీకు తెలుసమ్మా నీ పంతం ముందు
 ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా
 తీసుకుపో నీ వెంటా... ఓ ప్రేమా తీసుకుపో నీ వెంటా...
 ॥
 
 చిత్రం : నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
 రచన : సిరివెన్నెల, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : మల్లికార్జున్, సాగర్

 
 నిర్వహణ: నాగేశ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement