హత్యకు నేపథ్యం.. వివాహేతర సంబంధం
హత్యకు నేపథ్యం.. వివాహేతర సంబంధం
Published Mon, Dec 12 2016 1:59 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
ఏలూరు అర్బ¯ŒS : ఇద్దరు మహిళల మధ్య వివాహేతర సంబంధం కోసం ఏర్పడిన వివాదం ఓ మహిళ దారుణ హత్యకు దారితీసింది. తనకూ ప్రియుడికి మధ్య ఉన్న మహిళను అడ్డుతొలగించుకునేందుకు పథకం రచించిన మహిళ ఆరుగురు వ్యక్తుల సాయంతో ఆమెను హత్య చేయించింది. ఈ కేసులో ఏడుగురిని పెదవేగి పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి టీఎస్ 05 ఈఎం 2786 నెంబరు మారుతీ కారు, 5 సెల్‌ఫోన్లు, రూ.4,050 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, సీఐ అడపా నాగమురళీ ఆదివారం ఏలూ రు రూరల్ పోలీస్‌స్టేష¯ŒSలో విలేకరులకు వివరాలు వెల్లడించారు.
వివరాలిలా ఉన్నాయి.. పెదవేగి మండలం లక్ష్మీపురం సమీపంలోని పోలవరం కుడికాలువ గట్టుపై ఈనెల 6న ఓ మహిళ శవమై కన్పించింది. దీనిపై పెదవేగి ఎస్సై వి.రామకోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. ఏలూరు రూరల్ సీఐ అడపా నాగమురళీ, ఎస్సైలు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు మహిళల వివాహేతర సంబంధంలో ఏర్పడిన వివాదం హత్యకు దారి తీసిం దని గుర్తించారు. ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన అలజంగి నాగమ ణి అనే మహిళ భర్త చనిపోయిన తర్వా త అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పసుపులేటి దుర్గబాబు అలియాస్ దుర్గారావుతో కొంత కాలంగా సహజీవనం చేస్తోంది. అయితే దుర్గారావు అదే గ్రామానికి చెందిన వేముల నాగలక్ష్మి అలియాస్ బుజ్జి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన నాగమణి దుర్గారావును నిలదీసింది. దుర్గారావు తీరుమారకపోవడంతో రెండు నెలల క్రితం నాగమణి ఘర్షణకు దిగింది. నాగలక్ష్మి బతికి ఉంటే దుర్గారావు తనకు దక్కడని భావించిన నాగమణి హత్యకు పథకం సిద్ధం చేసింది. తన కుమారుడు, అతని స్నేహితులు, నాగలక్ష్మి సన్నిహితుడైన ఆది ఏసుబాబు, అతని రెండో భార్యతో హత్యకు వ్యూ హరచన చేసింది. దీనిలో భాగంగా ఆదిఏసు నాగలక్ష్మి వద్దకు వెళ్లి అప్పు ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. దీంతో ఈనెల 5న ఆదిఏసు భార్యతో కలిసి నాగలక్ష్మి భీమడోలు వెళ్లింది. అక్కడ కారులో నాగమణి కుమారుడు నాగమునీశ్వరరావు అలియాస్ ముని అలి యాస్ ప్రసాద్, కారు మెకానిక్ సురేష్, కారు డ్రైవర్ మరియదాసు అలియాస్ దాసు, నాగమణి చె ల్లెలు కుమారుడు గంగాధరరావు ఉ న్నారు. వారంతా నాగలక్షి్మని కారులో ఏలూరు తీసుకువచ్చారు. నాగలక్షి్మకి మాయమాటలు చెప్పి చీకటిపడిన తర్వాత భీమడోలు తీసుకువచ్చారు. భీమడోలులో నాగమణి కారులో ఎక్కడంతో ఆమెను చూసిన నాగలక్ష్మి అనుమానం వచ్చి దిగేందుకు ప్రయత్నించింది. దీంతో మిగిలిన వారంతా నాగలక్షి్మని కారులోనే కదలకుండా ఉంచి జంగారెడ్డిగూడెం రోడ్డువైపు తీసుకువెళ్లారు. పెదవేగి 7వ మైలు వద్ద నాగలక్ష్మి మెడకు నైలా¯ŒS కారు బెల్టును బిగించి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. నాగలక్ష్మి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత శవాన్ని పోలవరం కాలువలో పడవేయాలనే ఉద్దేశంతో కాలువ గట్టుపై నుంచి కిందకు తోసేశారు.
Advertisement