extra marital
-
భార్యపై అనుమానం.. బెడ్రూంలో సెల్‌ఫోన్ పెట్టి వీడియో రికార్డు.. ఆ తర్వాత!
సాక్షి, సంగారెడ్డి: భార్యపై అనుమానంతో భర్త బెడ్రూంలో సెల్‌ఫోన్ కెమెరా ఏర్పాటు చేశాడు. మరో వ్యక్తితో చనువుగా ఉన్న దృశ్యం వీడియోలో రికార్డు అయ్యింది. దీనిపై నిలదీసినందుకు అతడిని కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించి కిడ్నాప్, వివాహేతర సంబంధం కేసులో పోలీసులు ఏడుగురికిపై కేసు నమోదు చేసి అందులో నలుగురికి రిమాండ్‌కు తరలించిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అమీన్పూర్ సీఐ శ్రీనివాసులురెడ్డితో కలసి డీఎస్పీ భీంరెడ్డి ఆవివరాలు వెల్లడించారు. వివరాలు వెల్లడిస్తున్న డీస్పీ భీంరెడ్డి భద్రాదికొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రాయని రాజు, భార్యతో కలసి బతుకుదెరువు కోసం ఏడేళ్ల క్రితం బీరంగూడ న్యూ సాయి భగవాన్ కాలనీకి వచ్చాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. కాగా రాజు బావ శాఖామణి బీరంగూడ మంజీరానగర్ కాలనీలో ఓలియో చర్చి పాస్టర్. ఇతడి భార్య అమీన్పూర్ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్. ఈ క్రమంలో రాజు భార్య పద్మజ ప్రవర్తనలో మార్పు గమనించి అనుమానంతో ఈనెల 5వ తేదీన రాజు తన బెడ్రూమ్లో సెల్ఫోన్లో వీడియో ఆన్ చేసి సెల్ఫ్‌లో పెట్టాడు. అదే రోజు దేవ శిఖామణి ఇంటికి వచ్చి పద్మజతో చనువుగా ఉన్న వీడియో రికార్డు అయ్యింది. ఈ విషయంపై రాజు తన భార్యను నిలదీయగా మంగళగిరిలోని తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఈ విషయంపై రాజు దేవ శఖామణి నిలదీశాడు. ఈ క్రమంలో 13వతేదీన రాజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అదే సమయంలో దేవశిఖామణి అతడి స్నేహితులు కిరణ్ గౌడ్, కుంటోల్ల మల్లేశ్, సాయి, దినేశ్, పర్మప్ప అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకొని ఇసుకబావి వద్ద ఖాళీ వెంచర్లోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి రాంచంద్రాపురంలోని అస్లంఖాన్‌కు చెందిన శ్రీ సాయి ఫొటో స్టూడియోలో నిర్బంధించారు. కట్టెలతో కొట్టి రాజు తీసిన వీడియోలు తొలగించారు. రాత్రంతా రాజును ఫొటో స్టూడియోలో ఉంచారు. 14వ తేదీన ఉదయం రాజు అక్కడి నుంచి తప్పించుకొని తన స్వగ్రామానికి వెళ్లాడు. 26వ తేదీన సాయంత్రం అమీన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఎస్ఐ సుభాశ్ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు. రాజును కిడ్నాప్ చేసిన దేవ శిఖామణి, బేగంపేట కిరణ్ గౌడ్, మల్లేశ్‌గౌడ్, అస్లంఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయి, దినేష్, పర్మప్ప పరారీలో ఉన్నారు. పోలీసులు కారు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని 120(బి), 386, 448, 363, 324, 442, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కోఆప్షన్ భర్త సస్పెన్షన్ పటాన్చెరు: వివాహేతర సంబంధం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన టీఆర్ఎస్ నేత, అమీన్పూర్ కోప్షన్ సభ్యురాలి భర్త దేవశిఖా మణిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు చౌటకూరి బాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీఎస్ మణి ఓ పాస్టర్‌గా గుర్తింపు పొందాడని, దాంతోనే ఆయనకు టీఆర్ఎస్లో పనిచేసే అవకాశం కలిగిందన్నారు. సభ్య సమాజానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన భార్యను కూడా పదవి నుంచి తొలగించాలని తాము కోరుకుంటున్నామన్నారు. పార్టీకి చెడుపేరు తెచ్చేవిధంగా ప్రవర్తిస్తే ప్రోత్సహించేది లేదన్నారు. సమావేశంలో అమీన్పూర్ కౌన్సిలర్లు బాశెట్టి కృష్ణ, బిజిలి రాజు, నాయకులు యూనుస్, వడ్ల కాలప్ప పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం: భర్త నిద్రపోతుంటే.. రాత్రి ప్రియుడితో కలిసి కారులో..
సాక్షి,హుస్నాబాద్(సంగారెడ్డి): కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన వెంకట్‌రెడ్డి(45) అనే వ్యక్తిని అతడి భార్య పెనుగొండ లక్ష్మి రోకలిబండతో కొట్టి హత్య చేసిన అనంతరం హుస్నాబాద్ మండలం పొట్లపల్లి వాగు ఒడ్డులో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గన్నెరువరం సీఐ కృష్ణారెడ్డి వివరాల ప్రకారం..వెంకట్‌రెడ్డి, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వెంకట్‌రెడ్డి శుభకార్యాలకు వంటలు చేస్తుంటాడు. అతడి భార్య లక్ష్మి ఇంటివద్ద కిరాణం, బెల్ట్‌షాపు నిర్వహిస్తోంది. పొట్లపల్లికి చెందిన బొనగిరి వెంకటస్వామితో లక్ష్మి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త వెంకట్‌రెడ్డి నిద్రపోతుంటే భార్య లక్ష్మి శుక్రవారం రాత్రి రోకలిబండతో కొట్టి హత్యచేసింది. రాత్రి వేళ ప్రియుడు వెంకటస్వామితో కలిసి కారులో మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి వాగు ఒడ్డుకు తీసుకెళ్లి పూడ్చివేయించింది. వెంకటస్వామి, కారు డ్రైవర్ కుమార్ భయపడి గన్నేరువరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించి నేరాన్ని అంగీకరించి లొంగిపోయారు. కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు నిందితురాలు లక్ష్మి, ఆమె ప్రియుడు వెంకటస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకొని సోమవారం ఘటన స్థలానికి వెళ్లారు. తహసీల్దార్ మహేశ్ సమక్షంలో పంచనామా నిర్వహించి మృతదేహాన్ని వెలికితీసి అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించారు. పూర్తి వివరాలు దర్యాప్తు చేసిన అనంతరం వెల్లడిస్తామని సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. చదవండి: పెళ్లి జరిగి రెండు నెలలు కూడా కాలేదు.. ఇంతలో సడన్‌గా.. -
హత్యకు నేపథ్యం.. వివాహేతర సంబంధం
ఏలూరు అర్బ¯ŒS : ఇద్దరు మహిళల మధ్య వివాహేతర సంబంధం కోసం ఏర్పడిన వివాదం ఓ మహిళ దారుణ హత్యకు దారితీసింది. తనకూ ప్రియుడికి మధ్య ఉన్న మహిళను అడ్డుతొలగించుకునేందుకు పథకం రచించిన మహిళ ఆరుగురు వ్యక్తుల సాయంతో ఆమెను హత్య చేయించింది. ఈ కేసులో ఏడుగురిని పెదవేగి పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి టీఎస్ 05 ఈఎం 2786 నెంబరు మారుతీ కారు, 5 సెల్ఫోన్లు, రూ.4,050 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, సీఐ అడపా నాగమురళీ ఆదివారం ఏలూ రు రూరల్ పోలీస్‌స్టేష¯ŒSలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.. పెదవేగి మండలం లక్ష్మీపురం సమీపంలోని పోలవరం కుడికాలువ గట్టుపై ఈనెల 6న ఓ మహిళ శవమై కన్పించింది. దీనిపై పెదవేగి ఎస్సై వి.రామకోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. ఏలూరు రూరల్ సీఐ అడపా నాగమురళీ, ఎస్సైలు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు మహిళల వివాహేతర సంబంధంలో ఏర్పడిన వివాదం హత్యకు దారి తీసిం దని గుర్తించారు. ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన అలజంగి నాగమ ణి అనే మహిళ భర్త చనిపోయిన తర్వా త అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పసుపులేటి దుర్గబాబు అలియాస్ దుర్గారావుతో కొంత కాలంగా సహజీవనం చేస్తోంది. అయితే దుర్గారావు అదే గ్రామానికి చెందిన వేముల నాగలక్ష్మి అలియాస్ బుజ్జి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన నాగమణి దుర్గారావును నిలదీసింది. దుర్గారావు తీరుమారకపోవడంతో రెండు నెలల క్రితం నాగమణి ఘర్షణకు దిగింది. నాగలక్ష్మి బతికి ఉంటే దుర్గారావు తనకు దక్కడని భావించిన నాగమణి హత్యకు పథకం సిద్ధం చేసింది. తన కుమారుడు, అతని స్నేహితులు, నాగలక్ష్మి సన్నిహితుడైన ఆది ఏసుబాబు, అతని రెండో భార్యతో హత్యకు వ్యూ హరచన చేసింది. దీనిలో భాగంగా ఆదిఏసు నాగలక్ష్మి వద్దకు వెళ్లి అప్పు ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. దీంతో ఈనెల 5న ఆదిఏసు భార్యతో కలిసి నాగలక్ష్మి భీమడోలు వెళ్లింది. అక్కడ కారులో నాగమణి కుమారుడు నాగమునీశ్వరరావు అలియాస్ ముని అలి యాస్ ప్రసాద్, కారు మెకానిక్ సురేష్, కారు డ్రైవర్ మరియదాసు అలియాస్ దాసు, నాగమణి చె ల్లెలు కుమారుడు గంగాధరరావు ఉ న్నారు. వారంతా నాగలక్షి్మని కారులో ఏలూరు తీసుకువచ్చారు. నాగలక్షి్మకి మాయమాటలు చెప్పి చీకటిపడిన తర్వాత భీమడోలు తీసుకువచ్చారు. భీమడోలులో నాగమణి కారులో ఎక్కడంతో ఆమెను చూసిన నాగలక్ష్మి అనుమానం వచ్చి దిగేందుకు ప్రయత్నించింది. దీంతో మిగిలిన వారంతా నాగలక్షి్మని కారులోనే కదలకుండా ఉంచి జంగారెడ్డిగూడెం రోడ్డువైపు తీసుకువెళ్లారు. పెదవేగి 7వ మైలు వద్ద నాగలక్ష్మి మెడకు నైలా¯ŒS కారు బెల్టును బిగించి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. నాగలక్ష్మి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత శవాన్ని పోలవరం కాలువలో పడవేయాలనే ఉద్దేశంతో కాలువ గట్టుపై నుంచి కిందకు తోసేశారు.