అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసలీలల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తండ్రికి ఏమాత్రం తగ్గని రీతిలో అతని కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా వ్యవహరిస్తున్నాడనే వార్తలు గుప్పుముంటున్నాయి. తాజాగా అమెరికన్ గాయని ఆబ్రే ఓ డే.. జూనియర్ ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. సుదీర్ఘ కాలంగా జూనియర్ ట్రంప్‌తో తనకు అఫైర్ ఉన్నట్లువస్తున్న ఆరోపణలు ఒక స్వలింగ సంపర్కుల క్లబ్‌లోని బాత్రూమ్‌లో మొదలయ్యాయన్నారు.
పాడ్‌కాస్ట్‌లో వివరాలు వెల్లడి..
మైకేల్ కోహెనెకు చెందిన ‘మేయా కుల్పా’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న 34 ఏళ్ల ఆబ్రే ఓ డే తొలిసారిగా తనకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని వెల్లడించింది. తనను జూనియర్ ట్రంప్ వేధించి లైంగికంగా సంబంధం ఏర్పరుచుకున్నాడని ఆరోపించింది. మేము మొదటిసారి ఒక గే క్లబ్‌కు వెళ్లాం. అప్పుడు అతను నా వైపు చెడుగా చూశాడు. ఈ రాత్రికి క్లబ్‌లోనే ఉంటానని అన్నాడు. అది న్యూయార్క్‌లో అతి పెద్ద క్లబ్. దాని భారీ ఎత్తున గే పార్టీలు జరుగుతుంటాయి. ఆబ్రే ఓ డేకు అప్పుడు మరో మార్గం లేదు అని అనుకుంది.
అతని ఇన్‌స్టాగ్రామ్‌లో..
పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆబ్రే ఓ తాను అతని ఇన్‌స్టాగ్రామ్‌ని మొదటిసారి చూశానని, దానిలో గే కమ్యూనిటీని కించపరిచే అన్ని రకాల జోక్‌లు ఉన్నాయని తెలిపారు. మేము మొదటిసారిగా గే క్లబ్ బాత్రూమ్‌లో లైంగిక చర్యలో పాల్గొనడం చాలా సౌకర్యంగా ఉంది అని అతను పేర్కొన్నాడని ఆమె ఆరోపించింది. ఈ జంట శారీరకంగా కలవడం ఇదే మొదటిసారి అయినప్పటికీ, మాజీ డానిటీ కేన్ ఫ్రంట్ వుమన్.. వీరు గతంలోనే బలమైన భావోద్వేగ బంధాన్ని పంచుకున్నారని వెల్లడించింది.
‘సెలబ్రిటీ అప్రెంటిస్’లోనూ..
ఆబ్రే ఓ డే తెలిపిన వివరాల ప్రకారం ఈ జంట 2011లో ‘సెలబ్రిటీ అప్రెంటిస్’లో తొలిసారిగా కలుసుకున్నారు. ఒకరిని చూసి మరొకరు నవ్వుకున్నారు. పార్టీలో ఏదైనా ఫన్నీగా జరిగిప్పుడు మేము ఒకరినొకరు చూసుకున్నాం. అప్పుడే సన్నిహితులమయ్యాం అని ఆమె తెలిపింది. తాను ఎప్పటికీ అతనిని ప్రేమిస్తూనే ఉంటానని ఆబ్రే ఓ పేర్కొంది. కాగా గత ఏడాది పేజ్ సిక్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆబ్రే ఓ తనకు జూనియర్ ట్రంప్‌తో ఉన్నసంబంధం గురించి ప్రస్తావించింది.అయితే జూనియర్ ట్రంప్ దీనిపై స్పందించలేదు.
ఇదికూడా చదవండి: అతను 16 సార్లు వ్యోమనౌకలో భూమిని చుట్టబెట్టాడు.. అంతలోనే..
ట్రంప్ దిగజారితే.. కొడుకు ఏం తక్కువ తిన్నాడు? వేధించి వశపర్చుకున్నాడు
Published Thu, Jul 6 2023 1:46 PM | Last Updated on Thu, Jul 6 2023 2:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment