
ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ పుట్టినరోజు నేడు (ఆగస్టు 17)

హైదరాబాద్ లో పుట్టిన ఈమె.. బెంగళూరులో పెరిగింది.

చూస్తే నార్త్ భామలా కనిపిస్తుంది.. కానీ తెలుగు, తమిళ, కన్నడ భాషలు వచ్చు.

2017 నుంచి ఇండస్ట్రీలో ఉంది గానీ అదృష్టం అనేది అందని ద్రాక్షలా మారింది.

హిందీలో 'మున్నా మైఖేల్' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో చిత్రాలు చేసింది.

వీటిలో 'ఇస్మార్ట్ శంకర్' హిట్ అయింది గానీ అది రామ్-పూరి క్రెడిట్‌లోకి వెళ్లిపోయింది.

ప్రస్తుతం ప్రభాస్‌తో 'రాజాసాబ్', పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రాల్లో ఈమెనే హీరోయిన్.

నిధి అగర్వాల్ కెరీర్ నిలబడాలంటే ఈ రెండు సినిమాలు హిట్ కావాల్సిందే.
















