రాయలసీమ నేపథ్యంలో వస్తోన్న లవ్‌ స్టోరీ.. ట్రైలర్ చూశారా? | Tollywood Movie Love Reddy Trailer Out Now | Sakshi
Sakshi News home page

Love Reddy Trailer: రాయలసీమ నేపథ్యంలో వస్తోన్న ప్రేమకథాచిత్రం.. ట్రైలర్ వచ్చేసింది

Published Tue, Oct 15 2024 8:02 PM | Last Updated on Tue, Oct 15 2024 8:28 PM

Tollywood Movie Love Reddy Trailer Out Now

అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం లవ్ రెడ్డి. ఈ సినిమాను గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్  బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా  ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా స్మరన్ రెడ్డి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ - 'లవ్ రెడ్డి సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. 20 మంది యంగ్ టాలెంటెడ్ హీరోలు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్' అని అన్నారు.

లవ్ రెడ్డి  సినిమా ట్రైలర్ చూస్తే లవ్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాయలసీమ నేపథ్యంలో ఈ ప్రేమకథను రూపొందించారు. ఈ ప్రేమ కథ చివరికి ఎక్కడికి చేరిందనేది ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. రాయలసీమ నేపథ్యంతో, అక్కడి యాసలో సినిమా ప్రేక్షకుల ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement