
టీవీ యాంకరింగ్ చేసి, నిన్ను చూస్తూ సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన నటి హేమలత రెడ్డి. తాజాగా గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు -బెస్ట్ టాలెంట్- బెస్ట్ ఫోటోజెనిక్ ఉప శీర్షికల మీద అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
ఈ సందర్భంగా హీరోయిన్ హేమలత రెడ్డి మాట్లాడుతూ ..' నేను ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నా. జెమిని టీవీ లో ఒక యాంకర్‌గా మొదలుపెట్టి సీరియల్స్ చేశాను. ఆ తరువాత ప్ప్రొడ్యూసర్ కావాలనుకుని ఒక సినిమా తీశా. కోవిడ్ టైంలో ఫ్యాషన్ సైడ్ ట్రై చేశా. మలేషియా కాంపిటీషన్‌లో గెలిచాను. మన మాతృ భాష తెలుగులోనే నేను అక్కడ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా. అటు నటన.. అలాగే ఇటు గ్లామర్ రెండు కష్టమైన పనులే. ఆడవారు గ్లామర్ మాత్రమే కాదు.. ప్రతి రంగంలో ముందుండాలి. ఆఫర్ వాస్తే ఎలాంటి రోల్స్ అయిన చేస్తా.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment