
హరియాణాకు చెందిన మీనాక్షి చౌదరి.. పంజాబ్‌లోని నేషనల్ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో డెంటల్ సర్జరీలో డిగ్రీ పొందారు.

బీడీఎస్ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడే తన నాన్నగారు (ఆర్మీ) బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించారు.

నాన్న లేకపోవడంతో మీనాక్షి చదువును పక్కన పెట్టేసింది. దీంతో ఆ బాధ నుంచి బయటకు తీసుకురావాలని ‘మిస్ ఇండియా’ పోటీల్లో పాల్గొనమని ఆమ్మ దరఖాస్తు చేసింది.

నాన్న చనిపోయిన నెలకే అమ్మ అలాంటి నిర్ణయం తీసుకోవడంతో బంధువులు తనని నానా మాటలనడమే కాకుండా మాట్లాడటం మానేశారు. అయితే మీనాక్షి అమ్మగారు అవేమీ పట్టించుకోకుండా కూతురిని ప్రొత్సహించారు.

అమ్మ ప్రోత్సాహంతో మిస్ ఇండియా పోటీల్లో విజయం సాధించాక సినిమాల్లో ఛాన్సులు

వ్యైద్య విద్యలో ఉన్నప్పుడే మోడలింగ్‌లో సత్తా చాటింది.

యూట్యూబ్ సాయంతో క్యాట్‌వాక్ నేర్చుకుంది.

2018లో ఫెమినా మిస్ ఇండియా హరియాణా విజేతగా భారీగా పాపులర్

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఖిలాడి,గుంటూరు కారం,ది గోట్, లక్కీ భాస్కర్‌తో మెప్పించింది.

ప్రస్తుతం ఆమె నటించిన విశ్వంభర,మట్కా,మెకానిక్ రాకీ సినిమాలు విడుదల కావాల్సి ఉంది.

కథ డిమాండ్ చేస్తే లిప్‌లాక్ సీన్‌కు ఓకే అని చెప్పింది.

ఐఏఎస్ కావాలనే తన కోరిక.. ఆ అవకాశం దక్కలేదు. దీంతో కనీసం సినిమాల్లో అయినా కలెక్టర్ పాత్ర వస్తే సంతోషమని చెప్పింది.

మీనాక్షి చౌదరికి మహేష్ బాబు, అడవి శేష్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్‌తో ఛాన్సులు రావడం వెనుక తన హైట్ అని చెప్పింది. తను ఆరడుగుల రెండు అంగుళాలు ఎత్తు ఉన్నట్లు తెలిపింది.




